వారం థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అయితే, వీటికి పెద్ద చిత్రాలేవీ పోటీగా లేకపోవడం విశేషం. ‘జవాన్’, ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ హవా కొనసాగితే మాత్రం.. ఈ మూవీస్ నడవడం కష్టమే. ఈసారి వారాంతమే కాదు, వినాయక చవితి కూడా రానుంది. ఈ నేపథ్యంలో పండుగను ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో నిర్మాతలు ఉన్నారు. అయితే, వీటిలో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ మూవీ ఒక్కటే అంచనాలతో రిలీజ్ అవుతోంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. ‘భోళాశంకర్’, ‘రామబాణం’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితోపాటు తెలుగు వెబ్ సీరిస్‌లు ‘అతిథి’, ‘దిల్ సే’లు స్ట్రీమింగ్ కానున్నాయి.


ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే


నెట్ ఫ్లిక్స్


⦿ వైఫ్ లైక్ (మూవీ) - సెప్టెంబర్ 11


⦿ ఫ్రీస్టైల్ (పోలిష్ థ్రిల్లర్ సీరిస్) - సెప్టెంబర్ 13


⦿ టాపీ/క్లాస్ యాక్ట్ (సీజన్ 1 - ఫ్రెంచ్ సీరిస్) - సెప్టెంబర్ 13


⦿ రెజ్లర్స్ (డాక్యుమెంటరీ సీరిస్) - సెప్టెంబర్ 13


⦿ Di4ries (సీజన్ 2 - పార్ట్ 1 - ఇటలియన్ సీరిస్) - సెప్టెంబర్ 13


⦿ ఎహ్రెంగార్డ్: ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ (సీరిస్) - సెప్టెంబర్ 13


⦿ వన్స్ అపాన్ ఎ క్రైమ్ (జపనీస్ ఫాంటసీ లైవ్-యాక్షన్ సినిమా) - సెప్టెంబర్ 13


⦿ థర్స్‌డే విడోస్ (సీజన్ 1 - స్పానిష్ సీరిస్) - సెప్టెంబర్ 13


⦿ రామబాణం (తెలుగు సినిమా) - సెప్టెంబర్ 14


⦿ భోళా శంకర్ (తెలుగు సినిమా) - సెప్టెంబర్ 15


⦿ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ (లిమిటెడ్ సిరీస్) - సెప్టెంబర్ 15


⦿ ఎల్ కాండే / ది కౌంట్ (చిలీ బ్లాక్ కామెడీ) - సెప్టెంబర్ 15 


అమెజాన్ ప్రైమ్ 


⦿ కెల్సే (మూవీ) - సెప్టెంబర్ 12


⦿ ది కిడ్నాపింగ్ డే - సెప్టెంబర్ 12


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్


⦿ యానిమల్స్ అప్‌క్లోజ్ (డాక్యుమెంటరీ) - సెప్టెంబర్ 13


⦿ హాన్ రివర్ పోలీస్ (సీరిస్) - సెప్టెంబర్ 13


⦿ ది అదర్ బ్లాక్ గర్ల్ (సీరిస్) - సెప్టెంబర్ 15


⦿ అతిథి (తెలుగు సీరిస్) - సెప్టెంబర్ 16


ఈటీవీ విన్ 


⦿ దిల్ సే (తెలుగు సీరిస్) - సెప్టెంబర్ 16


బుక్ మై షో


⦿ బార్బీ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 12


థియేటర్లలో విడుదల కానున్న సినిమాలివే:


⦿ మార్క్ ఆంటోని


అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో.. విశాల్ హీరోగా తెరకెక్కిన టైమ్ ట్రావెల్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విశాల్ ద్విపాత్ర అభినయం పోషిస్తున్నాడు. ఎస్‌జే సూర్య, రీతూ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. 


⦿ సోదర సోదరీ మణులారా


రఘుపతి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోదర సోదరీ మణులారా’ మూవీ కూడా సెప్టెంబ్ 15న విడుదల కానుంది. కమల్ కామరాజు, అపర్ణాదేవి ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. 


⦿ రామన్న యూత్ 


నవీన్ బెతిగంటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘రామన్న యూత్’ మూవీ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ పొలిటికల్ డ్రామా మొత్తం.. పార్టీలు, నేతలు కోసం జెండాలు ఎత్తే కార్యకర్తల లైఫ్ చుట్టూ తిరుగుతుంది. 


⦿ చాంగురే బంగారు రాజా


సతీష్ వర్మ దర్శకత్వంలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘చాంగురే బంగారు రాజా’ కూడా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజ నిర్మించారు. 


Also Read: సౌత్ లో ఆ హీరోతో మాత్రం చేయదట- అతిలోక సుందరి కూతురు వింత నిర్ణయం!