‘బిగ్ బాస్’ సీజన్ 7లో మొదటి వారంలో ఎలిమినేషన్ పూర్తయ్యింది. హౌజ్‌లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్‌లో కిరణ్ రాథోడ్ వెళ్లిపోయింది. ప్రస్తుతం 13 మంది మాత్రమే హౌజ్‌లో ఉన్నారు. ఒకరు వెళ్లిపోయిన వెంటనే హౌజ్‌లో మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఎప్పుడైనా ‘బిగ్ బాస్’‌లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గుతున్నకొద్దీ.. ఫైనల్స్‌కు చేరువ అవుతున్నారనే అర్థం. అంటే ఎవరికి వారు తాము హౌజ్‌లో ఎందుకు ఉండాలి, మిగతా కంటెస్టెంట్స్ ఎందుకు ఉండకూడదు అనే విషయంపై నామినేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా జరిగిన నామినేషన్స్ మరింత వాడి వేడిగానే జరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే తేజ.. రతికపై సీరియస్ అయ్యాడు.


ఏం పీకుతున్నావ్.?
ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ 7లో జరిగిన నామినేషన్స్‌లో తాము ఏ కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాలని అనుకుంటున్నారో.. వారిని ఒక టబ్‌లో నిలబెట్టి వారిపై బురదపడేలాగా బటన్‌ను ప్రెస్ చేయాలి. అదే క్రమంలో రతిక.. టేస్టీ తేజను నామినేట్ చేయాలని అనుకుంది. దానికి తగిన కారణం కూడా చెప్పింది. ఒకసారి తేజ తనను ఏం పీకుతున్నావని అడిగాడని, అలా అడగడం తనకు నచ్చలేదని చెప్పింది. అంతే కాకుండా ఎప్పుడూ పడుకునే ఉంటున్నావు అనే అంశంపై టేస్టీ తేజను నామినేట్ చేసింది రతిక. ‘పడుకున్నాను, కానీ కళ్లు మూసుకొని నిద్రపోలేదు’ అని తన వర్షన్ తను చెప్పుకునే ప్రయత్నం చేశాడు తేజ. తనకు సపోర్ట్‌గా ప్రియాంక కూడా ముందుకు వచ్చింది. మామూలుగా పడుకోకూడదు అని ‘బిగ్ బాస్’ రూల్స్‌లో లేదని, అలా పడుకోవడంలో తప్పు లేదని, తాము కూడా అలా పడుకుని ఉంటామని ప్రియాంక.. తేజకు సపోర్ట్ చేసింది.


పడుకోకపోతే టేస్టీ తేజ ఎలా అవుతాను..
‘‘ఎవరు, ఏం చెప్పినా రతిక మాత్రం తన మాట మీద నిలబడింది. తేజ ఒకసారి పడుకొని ఉన్నప్పుడు తన దగ్గరకు వెళ్లి మాట్లాడదాం అంటే తను పట్టించుకోలేదని కారణం చెప్పింది. అలా ఎప్పుడూ పడుకొని ఉంటే తనకే బద్ధకంగా ఉంటుందని సలహా ఇచ్చింది. నేనంతే అలాగే పడుకుంటాను. పడుకోకపోతే టేస్టీ ఎలా అవుతాను’’ అంటూ దురుసుగా సమాధానమిచ్చాడు తేజ. ఆ మాట రతికకు నచ్చలేదు. అయినా ఇంక వాదించకుండా తనపై బురద నీళ్లు పడేలా చేసి.. తేజను నామినేట్ చేసి పక్కకు తప్పుకుంది. పల్లవి ప్రశాంత్ కూడా తేజనే నామినేట్ చేశాడు. తేజ.. అందరి మీద జోకులు వేస్తుంటే అందరూ తీసుకుంటున్నారని, ఇంకెవరూ జోకులు వేసినా తను తీసుకోవడం లేదనే కారణంతో తనను నామినేట్ చేశాడు ప్రశాంత్.


తేజకు సపోర్ట్‌గా గౌతమ్..
ఫేస్ ది బీస్ట్ టాస్క్‌లో ఓడిపోయినందుకు తను బాధతో కింద పడుకున్నానని, మామూలుగా కింద కూర్చోవడం, పడుకోవడం తనకు అలవాటు అని ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘నాకు కూడా పడుకోవడం అలవాటు. అందుకే ఆమె నన్ను నామినేట్ చేసింది’’ అంటూ రతిక చేసిన నామినేషన్‌ను ఉద్దేశించి మాట్లాడాడు తేజ. కానీ ప్రశాంత్ చెప్పిన కారణానికి మాత్రం ఒప్పుకున్నాడు. రతిక.. తేజను నామినేట్ చేసిన తర్వాత గౌతమ్ కృష్ణతో నామినేషన్ గురించి మాట్లాడింది. గౌతమ్ కృష్ణ పూర్తిగా తేజకే సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. కేవలం రతిక దగ్గర మాత్రమే కాదు.. అందరి దగ్గరకు వెళ్తూ తేజనే సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు గౌతమ్. అందరూ నామినేషన్స్‌ను ఒకే విధంగా యాక్సెప్ట్ చేయరు అని, అలవాటు చేసుకోవాలి అని రతికతో చెప్పాడు అమర్‌దీప్.


Also Read: శివాజీకి వేలు చూపించిన ప్రియాంక, నేను ఎవడి మాట వినను అన్న శివాజీ - రెండో వారం వాడివేడిగా సాగిన నామినేషన్స్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial