సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది.ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ ని లాక్ చేసింది చిత్రబృందం.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం 'కేజీఎఫ్', 'కేజీఎఫ్2' సినిమాలకు పని చేసిన ఫైట్ మాస్టర్స్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్2' సినిమా అంచనాలకు మించి ఆడింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంలో యాక్షన్ సన్నివేశాలు కీలకపాత్ర పోషించాయి. దీనికోసం ఫైట్ మాస్టర్లు అన్బు-అరివు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వీరినే మహేష్-త్రివిక్రమ్ సినిమా కోసం తీసుకోబోతున్నారట. ఈ ఫైట్ మాస్టర్స్ పని చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. 'విక్రమ్' సినిమాకి కూడా వీరే వర్క్ చేశారు.
'RC15'కి కూడా వీరే పని చేస్తున్నారు. ఇప్పుడు మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా ఓకే అవ్వడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
విలన్ గా తమిళ స్టార్:
SSMB28 సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించింది. అసలు నిజం ఏంటంటే... విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అందులో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. విజయ్ సేతుపతి రీసెంట్‌గా కథ, అందులో తన క్యారెక్టర్ గురించి విన్నారు. సినిమాలో నటించడం తనకు సంతోషం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది.
Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?