విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి' (Kushi Movie). విడుదలకు ఇంకా టైమ్ ఉంది. కానీ, ఇప్పటి నుంచి సౌండ్ చేస్తోంది. దీనికి కారణం సినిమా బిజినెస్! ఆల్రెడీ డిస్కషన్స్ స్టార్ట్ చేశారట.
 
థియేట్రికల్ రైట్స్‌కు వంద కోట్లు!?
ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్ ఏంటంటే... 'ఖుషి' థియేట్రికల్ రైట్స్‌కు దర్శక నిర్మాతలు 90 నుంచి 100 కోట్లు కోట్ చేస్తున్నారట! ఈ రేటు ఒక్క తెలుగుకు మాత్రమే కాదు... తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలకు కలిపి! విజయ్ దేవరకొండకు యువతలో మంచి క్రేజ్ ఉంది. 'లైగర్' ఓపెనింగ్స్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది. హిట్ పడితే వంద కోట్లు రావడం పెద్ద విషయం ఏమీ కాదు. అందుకని, డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వస్తున్నారని సమాచారం.
 
'లైగర్' ఎఫెక్ట్ లేనట్టేనా!?
'లైగర్'తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటరైన విజయ్ దేవరకొండకు ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. డిజాస్టర్ కావడంతో ఆయనతో పాటు అభిమానులు కూడా డీలా పడ్డారు. అయితే... ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ 'ఖుషి' మీద పడలేదని లేటెస్ట్ బిజినెస్ డీల్స్ చూస్తే తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు తోడు సమంత వంటి స్టార్ ఉండటం, వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా సినిమాకు హెల్ప్ అవుతోంది. 



సమంత నటించిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'యశోద' (yashoda) ఈ శుక్రవారం పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. ఆమెకు నేషనల్ వైడ్ మంచి మార్కెట్ ఉంది. 'ఖుషి'కి అది యాడ్ అవుతోంది. 



'ఖుషి' ఆడియోకీ మంచి రేటు!
మలయాళ 'హృదయం' సినిమాతో భాషలకు అతీతంగా సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహాబ్ శ్రోతలను ఆకట్టుకున్నారు. ఆయన 'ఖుషి'కి సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియో కూడా మంచి రేటు సొంతం చేసుకుందట. అన్ని భాషల మ్యూజిక్ రైట్స్ కలిపి 13 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
 
షూటింగ్ 30 రోజులే! 
మరో 30, 35 రోజులు షూటింగ్ చేస్తే 'ఖుషి' సినిమా కంప్లీట్ అవుతుంది. అయితే... సమంత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రస్తుతం కొత్త షెడ్యూల్స్ గురించి యూనిట్ ఏం ప్లాన్ చేయడం లేదు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. తొలుత డిసెంబర్ 23న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరికి వెళ్ళింది. ఇప్పుడు అయితే 2023 వేసవికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.


Also Read : నేను ఒక్కరోజు టైమ్ తీసుకుంటా! కానీ, 'యశోద'కు... : సమంత ఇంటర్వ్యూ
  
'ఖుషి'లో కశ్మీర్ యువతిగా సమంత కనిపించనున్నారని వినిపించింది. ఫస్ట్ లుక్ చూస్తే... తమిళ అమ్మాయి ఆహార్యంలో కనిపించారు. విజయ్ దేవరకొండ డ్రస్సింగ్ స్టయిల్ కశ్మీర్ యువకుడిలా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రమిది.



మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.