Geeta Sanon: ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా పై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. సినిమా విడుదల అయినప్పటి నుంచి ఈ సినిమా పై విమర్శులు వెల్లువెత్తాయి. ఓ వైపు సోషల్ మీడియాలో సినిమాలో పాత్రలు వేషధారణ అలాగే గ్రాఫిక్స్ వర్క్స్ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు కొంతమంది మత సంఘాల నేతలు, రాజకీయ నాయకులు మూవీలోని డైలాగ్స్ పై మండిపడుతున్నారు. ఇది రామాయణాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించిందని, వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని నిరసనలు కూడా చేశారు. తాజాగా ‘ఆదిపురుష్’ పై వస్తోన్న విమర్శలపై నటి కృతి సనన్ తల్లి గీత సనన్ స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 


తప్పులు చూపడం కాదు భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి: గీత సనన్


‘ఆదిపురుష్’ సినిమాలో నటి కృతి సనన్ సీత పాత్రలో కనిపించింది. మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే కథ పరంగా సీత పాత్ర పై విమర్శలు వచ్చాయి. సీత భారత్ లో పుట్టినట్టు సినిమాలో చూపించడం పట్ల నేపాల్ లో నిరసనలు వెల్లు వెత్తాయి. ఈ సినిమాను నేపాల్ లో బ్యాన్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే దీనిపై మూవీ టీమ్ కూడా క్షమాపణలు కోరింది. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాపై వస్తోన్న విమర్శల నేపథ్యంలో కృతి సనన్ తల్లి గీత సనన్ స్పందించింది. ఈ మేరకు ఓ పోస్ట్ ను షేర్ చేసిందావిడ. ‘‘మనం ఏదైనా ఒక విషయాన్ని మంచి మనసుతో చూడాలి. అలా మంచి దృక్పథంతో చూసినప్పుడే మనకు ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ప్రజలకు ప్రేమను పంచమనే శ్రీరాముడు బోధించాడు. మనం శబరి రాముడిపై చూపిన ప్రేమను చూడాలి కానీ ఎంగిలి పండ్లను కాదు. ఎదుటి మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి గానీ ఆ వ్యక్తి తప్పులను కాదు. జై శ్రీరామ్’’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 


టిక్కెట్ ధరలు తగ్గించిన మేకర్స్..


‘ఆదిపురుష్’ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 16 న విడుదల అయింది. మొదటి రోజు మాత్రం ఈ మూవీకు భారీ కలెక్షన్లు వచ్చాయి. తర్వాత రెండు రోజులు కూడా కలెక్షన్స్ ఆశాజనకంగానే వచ్చాయి. కానీ సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గిపోయాయి. మూవీ పై వస్తోన్న విమర్శల ప్రభావం కలెక్షన్ల మీద పడింది. దీంతో ఇంకా కలెక్షన్లను రాబట్టేందుకు టికెట్ ధరలను సగానికి తగ్గించారు మేకర్స్. ఈ మధ్య కాలంలో బ్రహ్మాస్త్ర, పఠాన్, జర హట్కే జర బచ్కే వంటి మావీలు కూడా ఇదే విధంగా టికెట్స్ ధరలు తగ్గించారు. మరి ఈ వీకెండ్ లో అయినా ‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్లు రాబడుతుందా మేకర్స్ ట్రిక్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. 


Also Read: ‘ఆదిపురుష్’‌లో వార్ సీన్ ఆ మూవీ నుంచి ఎత్తేశారట - ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial