Adipurush: ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా పై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. మొదటి రోజుతో పోలిస్తే మూవీ కలెక్షన్స్ భారీగా తగ్గిన్నట్లే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా విడుదల అయిన దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కుంటూనే ఉంది. మొన్నటి వరకూ సినిమాలోని క్యారెక్టర్స్ లుక్స్, గ్రాఫిక్స్ పైన చాలా రకాల విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ మూవీను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో విషయం నెట్టింట తెగ ట్రోలింగ్ అవుతోంది. ఈ సినిమాలోని లంక సీన్ ను హాలీవుడ్ సినిమా నుంచి దర్శకుడు ఓం రౌత్ కాపీ కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అందుకు తగిన పోస్ట్ లను షేర్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 


మార్వెల్ మూవీస్ నుంచి కాపీ కొట్టేసిన ఓం రౌత్?


‘ఆదిపురుష్’ సినిమా ముందు నుంచే వివాదాల్లో చిక్కుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. మూవీలో లుక్స్, డైలాగ్స్, గ్రాఫిక్స్ వర్క్స్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మూవీపై ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఒక్కో రోజు ఒక్కో రకం ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. నిన్నటి వరకూ గ్రాఫిక్స్ వరకూ మాత్రమే పరిమితమైన ఈ ట్రోలింగ్ ఇప్పుడు కొత్తగా కాపీ సీన్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలోని యుద్ధం సన్నివేశాలు హాలీవుడ్ సినిమా సన్నివేశాలను పోలి ఉన్నాయంటూ ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా రాముడు తన సైన్యంతో కలసి లంక చేరుకుంటాడు. ఆ సమయంలో లంకేష్ బయటకు వస్తాడు. అప్పుడు రాముడి సైన్యం లంకేష్ పై దండెత్తుతుంది. సరిగ్గా ఇదే సన్నివేశాన్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సీన్ లో చూపించే లంక లొకేషన్స్, యుద్దం జరిగే విధానం అంతా హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ నుంచి ఎత్తుకొచ్చేశారని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ‘ఆదిపురుష్’ ను మార్వెల్ సినిమా సన్నివేశాలతో సరిపోలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.  


దేశవ్యాప్తంగా విమర్శలు..


‘ఆదిపురుష్’ దర్శకుడు ఓమ్ రౌత్ పై దేశ వ్యాప్తంగా విమర్శులు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే సినిమాపై నెగిటివ్ టాక్ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఇక మూవీలోని లుక్స్, డైలాగ్స్ పై వస్తోన్న విమర్శలు అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. రామాయణం ఇతిహాసాల ఆధారంగా చేసుకొని సినిమా తీసి అందులో భాషను సరిగ్గా పెట్టలేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ పై ఎక్కువగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ తన రైటింగ్ ను సమర్థిస్తూ ఓ పోస్ట్ చేశారు. దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో ఆ పోస్ట్ ను తొలగిస్తానని ప్రకటించారు. అలాగే మూవీ నిర్మాతలు కూడా సినిమాలో డైలాగ్స్ ను మార్చి కొత్తగా మళ్లీ రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి ఈ విమర్శలు ఇక్కడితో ఆగుతాయో లేదో చూడాలి. ఇక ఈ మూవీను టి-సిరీస్, రెట్రోఫిల్స్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించారు. 


Also read : రోజూ రాత్రిపూట ఇలా జరుగుతోందా? జాగ్రత్త, క్యాన్సర్ కావచ్చు - డాక్టర్‌ను సంప్రదించండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial