మంగుళూరు బ్యూటీ కృతిశెట్టి(Krithi Shetty) 'ఉప్పెన'(Uppena) సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత కృతిశెట్టికి వరుసగా కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలతో తన హిట్ స్ట్రీక్ ను కంటిన్యూ చేసింది. రీసెంట్ గా 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా చేసినందుకు కృతి రిగ్రెట్ అవ్వడం లేదు. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని చెబుతోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది కృతి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇప్పటికే ఆమెకి తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వస్తున్నాయి. మరి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా..? అని కృతిని ప్రశ్నించగా.. అలాంటి ప్లాన్ లేదని చెప్పేసింది.
బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చిన మాట నిజమే కానీ.. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి ఆదరణ లభిస్తోందని.. ఇక్కడ సినిమాలు చేయడం తనకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. నిజానికి ఈ బ్యూటీ ముంబైలోనే పెరిగింది. అక్కడే చిన్న చిన్న యాడ్స్ లో కనిపిస్తూ.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' సినిమాలో ఓ పాత్ర పోషించింది కృతి. ఆ తరువాత ఈమెకి సౌత్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. దీంతో ఇక్కడ బిజీ అయిపొయింది.
ఇక 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గురించి మాట్లాడుతూ.. స్వాతి అనే క్యారెక్టర్ లో నటించానని, ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని.. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటకొస్తుంది తెలిపింది. కథలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో పాటు అమ్మడు చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. సుధీర్ బాబుతో ఓ సినిమా, అలానే నాగచైతన్య ఓ సినిమా కమిట్ అయింది. త్వరలోనే కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది కృతిశెట్టి. సూర్య, బాల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కృతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఫ్యూచర్ లో ఆమె మరిన్ని కోలీవుడ్ సినిమాలు చేసే అవకాశం ఉంది.
Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?