మురారీ ఎక్కడ ఉన్నాడు వాడు రాలేదు ఏంటని భవానీ ముకుందని అడుగుతుంది. కృష్ణ మురారీ దగ్గర ఏదో ప్రామిస్ తీసుకున్నట్టు ఉంది అందుకే మన దగ్గర ఏమి చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడని చెప్తుంది. ఇక మురారీ గౌతమ్ వాళ్ళ దగ్గరకి వస్తాడు. గౌతమ్ డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. అమ్మాయి బ్యాగ్రౌండ్ చూసుకుని బాగా దిగులు పెట్టుకున్నాడని, వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత మీరు వెనుకాడతారేమోనని కృష్ణ అంటుంది. మేమిద్దరం కృష్ణార్జునలం అయితే జరగబోయేది సుభద్రా పరిణయం ఆ అమ్మాయికి అన్నగా అండగా ఉంటాను. పెళ్లి తర్వాత త్రెటనింగ్ ఏమైనా ఉంటే నందిని రూమ్ లో పెడదాం. ఏం భయపడకు మాట తప్పను నేను ఉన్నా కదా అని హామీ ఇస్తాడు. కిరణ్ భవానీకి ఫోన్ చేసి పెళ్లి బట్టలు కొంటున్నాం మీరు ఎవరైనా రావాలి కదాని అడుగుతాడు. నందుకి బట్టలు వద్దులే నీకు మేము కొంటామని చెప్తుంది.


Also Read: రామాని షూట్ చేసిన మనోహర్ - జానకి మీద ద్వేషం పెంచుకున్న జ్ఞానంబ


ఈశ్వర్ రేవతి మీద అరుస్తాడు. కృష్ణని మురారీని వదిలేసి తిరుపతి వెళ్దామని అంటావ్ ఏంటని అరుస్తుంటే భవానీ వింటుంది. వాడు ఇప్పటికే సెలవు పెట్టాడు కృష్ణకి కుదరదని చెప్తుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది మీరు ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అందుకే మీకు రావడం కుదరదని చెప్తున్నారని రేవతి నిలదీస్తుంది. కానీ ఈశ్వర్ మాత్రం నీకు వాటితో అనవసరమని వంటింటి పనులు మాత్రమే చూసుకోమని తిడతాడు. భవానీ వచ్చి ఏంటి ఈశ్వర్ మీద అరుస్తున్నావని అడుగుతుంది. నన్ను మనిషిలా కూడా గుర్తించడం లేదు వంటింట్లో వండి వార్చడానికి మాత్రమే పుట్టినట్టు మాట్లాడుతున్నారని రేవతి ఏడుస్తూ చెప్తుంది. నా ముందు నువ్వు రేవతి మీద అరుస్తున్నావ్ అంటే నేను లేనప్పుడు ఎలా చూసుకుంటున్నావో అర్థం అవుతుందని ఈశ్వర్ కి గడ్డి పెడుతుంది. భార్యకి నెమ్మదిగా సర్ది చెప్పాలని అంటుంది.


అక్క ఎంత తెలివైనది ఏం అడగనివ్వకుండా చేసిందని రేవతి మనసులో అనుకుంటుంది. పెళ్లి పనులు మురారీ కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా అని భవానీ ఈశ్వర్ ని అడుగుతుంది. వాడు బాగానే చేస్తున్నాడు కానీ కృష్ణ వైపు నుంచి సమస్య వస్తుందని భయంగా ఉందని చెప్తాడు. గట్టిగా అరిచి మూలన కూర్చోబెడతానని చెప్తుంది. సమస్య బయట పడకుండా ఇద్దరి నోరు మూయించింది పెద్ద వదిన భలే తీర్పు చెప్పిందని ప్రసాద్ అనుకుంటాడు. కృష్ణని చూసి మురారీ చాలా బాధపడతాడు. ఇంట్లోకి రాగానే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు నువ్వు బాధపడితే నేను చూడలేను. నిన్ను మావాళ్లు ఎవరైనా ఏదైనా మాట అంటే వాళ్ళ పెద్దరికాన్ని ప్రశ్నిస్తే కుటుంబ కలహాలు మొదలవుతాయి. కుటుంబంతో ఎలా ఉండాలని కుటుంబం లేని నాతో చెప్తుంటే ఎంత బాగుందోనని అంటుంది. నేను ఎంత బాధపడ్డా సరే మీకు మీ పెద్దమ్మకి కుటుంబానికి మధ్య ఎలాంటి భేధాభిప్రాయాలు రానివ్వనని కృష్ణ మాటిస్తుంది.


Also Read: తప్పించుకున్న ప్రియ, నిజం తెలుసుకున్న నందు- కూతురి పెళ్లి ఆపగలుగుతాడా?


ఇంట్లోకి వెళ్లకుండానే మళ్ళీ బయటకి వెళ్లిపోతారు. మురారీ ఇంకా ఎందుకు రాలేదని ముకుంద ఎదురు చూస్తుంది. అసలు వీళ్ళిద్దరూ అర్థం కావడం లేదు ఇష్టం లేని పెళ్లి అన్నాడు కానీ ఇద్దరిలో మార్పు వచ్చింది. మురారీ కృష్ణని పెళ్ళాం కంటే ఎక్కువగా చూస్తున్నాడు. కృష్ణ మురారీని మాయలో పడేసిందా అలా జరగడానికి వీల్లేదు తన ప్రేమ నాకే దక్కాలి నాకు మాత్రమే దక్కాలని ముకుంద అనుకుంటుంది. కృష్ణ వాళ్ళు రెస్టారెంట్ కి వస్తాడు. అక్కడ వెయిటర్ వచ్చి తిక్కతిక్కగా మాట్లాడతాడు. ఇంతకముందు నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చారా అని కృష్ణ పసిగట్టేస్తుంది. కృష్ణని వెయిటర్ చిన్నక్క అని పిలిచి మురారీకి ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ సంతోషంగా ఉంటారు.