జానకి.. రామాని విడిపించడానికి ప్రయత్నం చేయడం లేదని జ్ఞానంబ కోపం పెంచుకుంటుంది. ఒక తల్లి బిడ్డని ఎంత ప్రేమిస్తుందో భార్య కూడా భర్తని అంతే ప్రేమిస్తుంది. తల్లిగా మీ బిడ్డ కోసం మీరు పడుతున్న ఆరాటం అర్థం చేసుకోగలను. మీరు నన్ను అంటున్న మాటలు మీ బిడ్డ మీద ప్రేమతోనే కానీ నా మీద ద్వేషంతో కాదని నాకు తెలుసు. నా గుండె భారంగా మారింది. ఓదార్పు దొరకకపోగా మాటలు పడుతున్నా. రామ తోడు లేకపోతే జీవితమే లేదని జానకి అంటుంటే అలాంటప్పుడు ఖాకీ వేసుకుని రెచ్చిపోవడం ఎందుకు చొక్కాలు పట్టుకుని నిందితుల్ని ఈడ్చుకుని వెళ్ళడం ఆర్భాటం ఎందుకు నువ్వు ఇంకా ఐపీఎస్ అవలేదు రెచ్చిపోకని మల్లిక చురక వేస్తుంది.


మల్లిక: అంతమంది కానిస్టేబుల్స్ ఉండగా నీకే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయ్. నువ్వు కొండని ఢీ కొడుతున్నావ్ అందుకే ఇంటి మీదకి ఇలాంటి సమస్యలు తీసుకొస్తున్నావ్. జానకి వల్ల కాకపోతే బావని కేసులో ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది


జానకి: అందరికీ లేనిపోని అనుమానాలు సృష్టించకు


Also Read: తప్పించుకున్న ప్రియ, నిజం తెలుసుకున్న నందు- కూతురి పెళ్లి ఆపగలుగుతాడా?


మల్లిక: ఉన్నమాటే కదా నేను చెప్పింది. యూనిఫాం వేసుకుని భర్తని అరెస్ట్ చేయడం చీర కట్టుకుని క్యారియర్ తీసుకుని వెళ్ళడం అడిగేవాళ్ళు లేరని రెచ్చిపోతుంది. అత్తయ్య మత్తు పదార్థాలు దొరకడం అంటే పెద్ద కేసు అవుతుంది ఆ నిజం దాచి బావని విడిపిస్తానని అబద్ధం చెప్తుంది. మీరు అవేవీ నమ్మొద్దు అనేసరికి తాను ఏదో తెలియకుండా వాగుతుందని గోవిందరాజులు కొట్టి పారేస్తాడు.


జానకి క్యారియర్ తీసుకుని స్టేషన్ కి రావడం మనోహర్ చూస్తాడు. పర్మిషన్ ఇస్తే భోజనం పెట్టి వెళ్తానని అడుగుతుంది. డ్యూటీలో ఉండగా భర్తని మెడ పట్టుకుని స్టేషన్ కి తీసుకొచ్చావ్ ఇప్పుడు భోజనం తీసుకొచ్చావ్ హ్యాట్సాఫ్ ఈ గెటప్ లో ఫోటో ఒకటి తీసి మీడియా వాళ్ళకి ఇవ్వాలని ఉందని అంటాడు. లాకప్ లో ఉన్నవాడికి ఇంటి ఫుడ్ తీసుకురాకూడదని తెలియదా అని అడుగుతాడు. తెలుసు కానీ బయట ఫుడ్ అలవాటు లేదని చెప్తుంది. వెళ్ళు భోజనం పెట్టు ఈ ఒక్కరోజే కదా రేపు నీ జాబ్ కి రిజైన్ చేస్తున్నావ్ కదా అని బయటకి వెళ్ళిపోతాడు.


రామని చూసి జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. భర్త ఓదార్చడానికి చూస్తాడు. నాకోసం మీరు ఎంత చేశారు అలాంటిది ఈ పాపిష్టి చేతులతో అరెస్ట్ చేసి పరువు పోయేలా చేశానని బాధపడుతుంది.


రామ: పరువు పోవడం కాదు పరువు నిలబెట్టేలా చేశారు. బాధ్యత ముందు బంధాలకు విలువ లేదని నిరూపించారు


జానకి: కానీ మీరు తప్పు చేయలేదు కదా


Also Read: అర్థరాత్రి కనకం ఇంటికి స్వప్న, ఎదురుపడిన రాజ్- అపర్ణకి ఫోన్ చేసి నిజం చెప్పిన కావ్య


రామ: తప్పు చేయకపోయినా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగులుతాయి. తట్టుకుని నిలబడాలి. అమ్మ ఎలా ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? నేను తప్పు చేశానని అనుకుంటుందా?


జానకి: మీ అందరికీ తెలియని నిజం ఒకటి ఉంది తప్పు జరిగింది నా వల్ల. మధుకర్ మీద ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నానని తెలిసి కావాలని మిమ్మల్ని ఇందులో ఇరికించాడు. నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తేనే మిమ్మల్ని కేసు నుంచి తప్పిస్తానని అన్నాడు. ఎస్సైకి చెప్తే బుద్ధిగా మాట వినమని సలహా ఇచ్చాడు. ఆ బిల్డర్ ఎస్సై ఇద్దరూ ఒకటే. ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు.


అది విని రామ ఆవేశంగా ఎస్సై మీద అరుస్తాడు. మర్డర్ చేసిన బిల్డర్ కి ఊడిగం చేస్తున్నాడు ఏ తప్పు చేయని నన్ను కటకటాల వెనక్కి వేశాడని రామ ఆవేశంగా మాట్లాడతాడు. నీ పెళ్ళాం కథ మొత్తం చెప్పిందా అంటాడు. జానకి రాజీనామా చేయదు కోర్టులో బిల్డర్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందని తెగేసి చెప్తాడు. డ్యూటీ మీద ఉన్న ఎస్సైకి తెగబడితే ఎంత పెద్ద తప్పో నీ పెళ్ళానికి తెలుసు ఇంతటితో ఆగదు దొంగతనంగా స్టేషన్ లోకి దూరి భర్తని విడిపించుకుందని నీ పెళ్ళాం మీద కేసు పెడతాను అనగానే రామ ఎస్సై మీదకు దూకుతాడు. వెంటనే మనోహర్ గన్ తీసుకుని రామని షూట్ చేస్తాడు. ఒక్కసారిగా జానకి రామ అని అరుస్తుంది.