మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కొరటాల శివ రూపొందించిన సినిమా 'ఆచార్య'. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి తగ్గట్లుగా చిత్రబృందం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేసింది. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రను తొలగించామని దర్శకుడు కొరటాల క్లారిటీ ఇచ్చారు.
కాజల్ రోల్ ఉండదని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాపై ఓ రూమర్ వినిపించడం మొదలైంది. గ్లామర్ సైడ్ కోసం సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది టాక్ నడిచింది. తాజాగా దీనిపై కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. అలాంటి సర్‌ప్రైజ్‌లు ఏమీ లేవని తేల్చేశారు. అనుష్క నటింస్తుందనేది కేవలం రూమర్ మాత్రమేనని అందులో నిజం లేదని చెప్పారు.
ఇద్దరు వ్యక్తిలా జర్నీను చూపించే సినిమా 'ఆచార్య' అని.. ఎమోషనల్ గా సాగుతుందని, యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో 'మిర్చి' లాంటి యాక్షన్ ఎపిసోడ్ బ్లాక్స్ ఉంటాయని చెప్పారు. 'మిర్చి' సినిమా తరువాత తాను మాస్ కమర్షియల్ సినిమాలు తగ్గించానని.. ఆ లోటుని 'ఆచార్య'లో భర్తీ చేసినట్లు చెప్పారు.
పాన్ ఇండియా సినిమాపై ఆయన స్పందిస్తూ.. పాన్ ఇండియాకి చిన్న చిన్న కొలతలు ఉంటాయని, అందరికీ ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా ఉండాలని అన్నారు. సినిమాలో పాయింట్ ఎక్కువ మందికి కనెక్ట్ అయితే అదే పాన్ ఇండియా అని.. దేనికైనా ఎమోషన్ అనేది ముఖ్యమని చెప్పారు.
ఇక ఆయన ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ.. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండబోతుందని.. బిగ్ కాన్వాస్ లో సినిమా ఉంటుందని చెప్పారు. ఈసారి సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని.. 'ఆచార్య' రిలీజ్ తరువాత రిలాక్స్ గా సినిమాను పట్టాలెక్కిస్తామని తెలిపారు. ఇంకా హీరోయిన్ ను ఫైనల్ చేయలేదని చెప్పారు.
Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే
Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు