అక్కినేని కథానాయకులకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. కింగ్ నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్యకు బాక్సాఫీస్ పరంగా ఆశించిన విజయాలు దక్కలేదు. ఇక, అఖిల్ నుంచి సినిమా ఏదీ రాలేదనుకోండి. ఈ తరుణంలో అక్కినేని అభిమాని ఒకరు రాసిన లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


నాగార్జున (Nagarjuna Akkineni) మాస్ సినిమా చేయాలని ఆ అభిమాని రాసుకొచ్చారు. అంతే కాదు... ఇంకా ఎమోషనల్ అయ్యారు. అసలు, ఆ లేఖలో ఏముంది? అనే వివరాల్లోకి వెళితే... 


ఒక్కసారి ఫుల్ మాస్ సినిమాలో చూడాలని...
''మా నాన్న నాకు 'మాస్', 'నేనున్నాను', 'మన్మథుడు' సమయంలో నాగార్జునను థియేటర్లలో పరిచయం చేశాడు. అప్పుడు హీరో అంటే నాగార్జున మాత్రమే అనుకునే అంతగా మా నాన్న నన్ను నాగార్జున అభిమానిగా మార్చేశాడు. 'కింగ్', 'డాన్', 'రగడ' లాంటి సినిమాలు చూసి సంబరపడిపోయిన నాకు... ఆ తర్వాత కాలంలో (ఇప్పటి వరకు) అటువంటి మాస్ ఎంటర్టైనర్ కనిపించలేదు. నా జీవితంలో ఒకే ఒక్కసారి (ఆఖరిసారి) మా నాగార్జునను ఫుల్ మాస్ సినిమాలో చూడాలని కోరుకుంటున్నాను'' అని అభిమాని లేఖ రాశాడు.
 
గుండె పగిలేలా అరుస్తూ...
''నాగార్జున బాబును మాస్ ఎంటర్టైనర్ లుక్ లో స్క్రీన్ మీద చూసి అలా చూసిన ఆనందంలో... గుండె నిండా ఆనందంతో నిండిపోయి, గుండె పగిలేలా అరుస్తూ... 'మా నాగార్జున రా' అని గర్వంగా చెప్పుకొంటూ థియేటర్లో చనిపోయినా నేను సంతోషంగా ప్రాణాలు వదులుతా'' అని ఆ లేఖలో అభిమాని ఎమోషనల్ అయ్యాడు. 


'ఐ లవ్ యు కింగ్ - నీ అభిమాని' అంటూ లేఖ ముగించారు. ఈ లేఖ నాగార్జున అన్నయ్యకు చేరేలా షేర్ చేయమని ట్విట్టర్‌లో అందరినీ కోరడంతో పాటు అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగ చైతన్య, అఖిల్... సుమంత్, సుశాంత్ (నాగార్జున మేనల్లుళ్లు)కు ట్యాగ్ చేశాడు. మరి, ఈ లేఖ నాగార్జునకు చేరుతుందో? లేదో? చూడాలి.


'ఘోస్ట్' డిజప్పాయింట్ చేసింది!
నాగార్జున నుంచి ఈ ఏడాది ఓ సినిమా వచ్చింది. అది 'ద ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఆ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆశించిన రీతిలో ఆడలేదు. సినిమా విడుదలకు ముందు నాగార్జున గొప్పగా చెప్పారు. యాక్షన్ బావుంది కానీ ఎక్కడో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అక్కినేని అభిమానులను ఆ సినిమా డిజప్పాయింట్ చేసింది. బాలీవుడ్ సినిమా 'బ్రహ్మాస్త్ర'కు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం నాగార్జున కథలు వింటున్నారు. తర్వాత సినిమా మీద దృష్టి పెట్టారు.


Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?
 
చైతన్యకు నో 'థాంక్యూ'...
హిందీలో కూడా ఆడలేదు!
అక్కినేని నాగ చైతన్య ఈ ఏడాది హిందీ చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా'లో కీలక పాత్ర చేశారు. అది డిజాస్టర్ అయ్యింది. అసలు, నాగ చైతన్య ఆ క్యారెక్టర్ ఎందుకు చేశారని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తెలుగులో నటించిన 'థాంక్యూ' కూడా ఫ్లాప్ అయ్యింది. అఖిల్ నుంచి ఈ ఏడాది సినిమా ఏదీ రాలేదనుకోండి. 2023లో ఈ ముగ్గురూ విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.


Also Read : చిరు, బాలయ్య పోటీ - నో ప్రాబ్లమ్, ఆల్ హ్యాపీస్!