నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న తాజా వెబ్ సిరీస్ ‘ఖుఫియా’. విశాల్ భరద్వాజ్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. సీనియర్ నటి టడు, అలీ ఫజల్, హాట్ బ్యూటీ వామిగా గబ్బి ప్రధాన పాత్రలు పోషించారు. స్పై, థ్రిల్లర్ యాక్షన్ సిరీస్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అందరినీ ఓ రేంజిలో ఆకట్టుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది.  


ఇంతకీ ‘ఖుఫియా’ కథ ఏంటంటే?


RAW (రీసెర్చ్ & అనాలిసిస్ వింగ్)లో పని చేస్తున్న రవి మోహన్ అనే ఇంటెలీన్ ఆఫీసర్‌గా ఫజల్ నటించారు. అతడు శత్రు దేశాలకు భారత రహస్యాలను చేరవేస్తారు. RAWకు అనుమానం కలగడంతో ఆయన కుటుంబపై నిఘా పెడుతుంది.  RAWలోని అత్యుత్తమ ఏజెంట్లలో ఒకరైన కృష్ణ మెహ్రా(టబు), రవి మోహన్ భార్య చారు(వామికా గబ్బి)తో పాటు అతడి కుటుంబపై ఆపరేషన్‌ను మొదలు పెడతుంది. రవి మోహన్ నిజానికి భారతీయ గూఢచర్య రహస్యాలను అమ్ముతున్నాడా? లేక నిర్దోషిగా వేరొకరి చేత ఇరికించబడ్డారా? అనేది తెలియాలంటే Netflixలో ‘ఖుఫియా’ వెబ్ సిరీస్ చూడాల్సిందే.   


‘ఖుఫియా’ వాస్తవ కథా?


విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ‘ఖుఫియా’ వెబ్ సిరీస్ అమర్ భూషణ్  నవల ‘ఎస్కేప్ టు నోవేర్’ ఆధారంగా రూపొందించబడింది. ఈ పుస్తకంలో రాసిన అదే కథను మిడ్-పాయింట్ వరకు అనుసరిస్తాడు దర్శకుడు. సెకెండ్ ఆఫ్ కు వచ్చేసరికి కొత్తగా కథ అల్లారు.  దశాబ్దాలుగా గూఢచారిగా అనుమానిస్తున్న సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి 2004లో అదృశ్యం అయ్యారు. ఆ సమయంలో జరిగిన నిజమైన ఘటనల ఆధారంగా  ‘ఎస్కేప్ టు నోవేర్’ పుస్తకాన్ని రాశారు.


రబీందర్ సింగ్ ఎవరు? అతడు చేసిన నేరం ఏంటి?


‘ఖుఫియా’లో సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఉన్న రవి మోహన్ పాత్ర, నిజ జీవితంలో రబీందర్ సింగ్ పాత్ర. సింగ్ మేజర్ అయ్యే వరకు భారత సైన్యంలో పని చేశాడు. ఆ తర్వాత భారత గూఢచార సంస్థ RAWలో చేరారు. RAWలో జాయింట్ సెక్రటరీగా, ‘ఖుఫియా’లో ఫజల్ పాత్ర రవి మోహన్‌ని చూపించినట్లుగా,  రహస్య పత్రాలను అమెరికా విదేశీ గూఢచార సంస్థ  CIAకి అందిస్తూ దొరికిపోయాడు. 2004లో సింగ్ నేపాల్ మీదుగా అమెరికాకు పారిపోయాడు. సురేందర్‌జీత్ సింగ్ పేరుతో అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతడి అప్పీలు చాలా సార్లు తిరస్కరించబడింది. CIA అతడికి డబ్బు చెల్లించడం కూడా మానేసింది. దీంతో ఆయన అమెరికాలో శరణార్థిగా ఉండిపోయారు. 2016లో మేరీల్యాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించాడని వార్తలు వచ్చాయి. ఆయన పాత్రను హైలెట్ చేస్తూ ‘ఖుఫియా’ను తెరకెక్కించారు విశాల్ భరద్వాజ్. ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.






Read Also: నెక్ట్స్ మూవీ టార్గెట్ రూ. 3 వేల కోట్లు- అట్లీ సంచలన స్టేట్మెంట్, ఆటాడుకుంటున్న నెటిజన్లు



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial