కన్నడ స్టార్ హీరో యష్ 'కేజీఎఫ్' సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల 'కేజీఎఫ్' పార్ట్ 2తో ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఇప్పటివరకు తన కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ రావడంతో తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు యష్. అందుకే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది. 


ప్రస్తుతం యష్ తన ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతున్నారు. ఇటీవల తన భార్యా, పిల్లలతో ట్రిప్ కి వెళ్లిన యష్ తిరిగి ఇండియాకు వచ్చారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా యష్ భార్య రాధికా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో యష్ కొడుకు యథర్వ్ తన తండ్రిని బ్యాడ్ బాయ్ అని అంటూ కనిపించాడు. 


బ్రష్ చేయడం గురించి యష్ తన కొడుకుని మందలించడంతో అతడు నొచ్చుకున్నాడు. వెంటనే తన తల్లిని హత్తుకొని 'డడ్డా ఈజ్ ఏ బ్యాడ్ బాయ్' అని చెబుతూ కనిపించాడు. దానికి యష్ 'డడ్డా ఈజ్ ఏ గుడ్ బాయ్' అని అన్నాడు. వెంటనే యథర్వ్ 'నో.. బ్యాడ్ బాయ్' అని పదేపదే అంటూనే ఉన్నాడు. మరి అమ్మ అని యష్ ప్రశ్నించగా 'మమ్మీ గుడ్ గర్ల్' అని చెబుతాడు. దానికి యష్ కొడుకుతో వాదిస్తూ కనిపించారు. ఈ ఫన్నీ వీడియోను రాధికా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో.. ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.  


Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!


Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?