వరుస హిట్లతో హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ జోష్ లో ఉంది. ఆమె తాజాగా నటించిన తమిళ సినిమా 'మామన్నన్' సూపర్ డూపర్ హిట్ అందుకుంది. తెలుగులో నటించిన చివరి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట', నానితో 'దసరా' సినిమాలు కమర్షియల్ సక్సెస్ లు అందుకున్నాయి. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.   


రీమేక్ మూవీతో బాలీవుడ్ లోకి కీర్తి సురేష్ ఎంట్రీ


ఓవైపు సౌత్ లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్, త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన తొలి హిందీ మూవీలో వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్‌ దళపతి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘తేరి’ హీందీలోకి రీమేక్ కాబోతోంది. ఇందులో హీరోగా వరుణ్ ధావన్, హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘తేరి’ సినిమా తెలుగులో 'ఉస్తాద్ భగత్ సింగ్'గా రీమేక్ అవుతున్నది. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ‘తేరి’ హిందీ రీమేక్ విషయానికి వస్తే- ఈ చిత్రం ఆగష్టులో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 31, 2024లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు.


సమంత పాత్రలో కనిపించనున్న కీర్తి సురేష్


‘తేరి’ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. హిందీ రీమేక్ లో సమంత పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది.  తమిళ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా, హిందీ చిత్రానికి కాలీస్ మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ రీమేక్‌ సినిమాను అట్లీ, 'కబీర్ సింగ్' నిర్మాత మురాద్ ఖేతానీతో కలిసి నిర్మించనున్నారు. హిందీ రీమేక్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు అంశాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే తెలుగులో సత్తా చాటిని పలువురు హీరోయిన్లు బాలీవుడ్ లో అడుగు పెట్టగా, వారి బాటలో ప్రస్తుతం కీర్తి సురేష్ నడవబోతోంది. తెలుగులో టాప్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, రష్మిక మందన్న ఇప్పటికే హిందీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. త్వరలో నయన తార కూడా ‘జవాన్’ మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా వారి సరసన చేరబోతోంది. మరి కీర్తి సురేష్ హిందీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


వరుస సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్   


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కనిపించబోతోంది. ఆగష్టు 11న ఈ సినిమా విడుదల కానున్నది. అటు  'సైరెన్', 'రఘు తాత', 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' లాంటి తమిళ ప్రాజెక్ట్‌లలో కూడా పని చేస్తోంది.


Read Also: ఏపీలో ‘బ్రో’ చిత్రానికి ఇబ్బందులు ఎదురవుతాయా?-నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial