‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న సినిమాకు తాను పని చేయబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు.


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ కాగానే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ రెడీ అవుతోంది. రాజమౌళి మహేష్ బాబుకు కేవలం స్టోరీ లైన్ మాత్రమే చెప్పారు. దర్శకుడి మీద ఉన్న నమ్మకంతో ప్రిన్స్ ఓకే చేశారు. షూట్ కు వెళ్లే ముందు మాత్రం హీరోకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పనున్నారు.


తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన కీరవాణి


ఆస్కార్ విన్నింగ్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు సైతం తన క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే సినిమా కథ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ రెడీ చేస్తున్నారు. తాజా ఈ సినిమా కథ గురించి విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కథ హోటల్ లో విందు భోజనం చేసినట్లుగా ఉందన్నారు. ఇక తాజాగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మరో ఆసక్తికర విషయాన్ని చెప్పారు.


తన తదుపరి సినిమా రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోతోందన్నారు కీరవాణి. ఈ సినిమా వరల్డ్ అడ్వెంచర్ గా రూపొందబోతున్నట్లు తెలిపారు. కీరవాణి వాస్తవానికి రెగ్యులర్ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం లేదు. సెలెక్టివ్ గా కొన్ని సినిమాలకు మాత్రమే పని చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా జక్కన్న సినిమాకు సంగీతం అందిచనున్నట్లు తెలిపారు. మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి అద్భుత కథను రెడీ చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమా  ఫారెస్ట్ అడ్వంచర్ గా రూపొందనున్నట్లు తెలిపారు.  


ఇప్పటికే సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన జక్కన్న


ఇప్పటికే ఈ సినిమా గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపిస్తాడు అని చెప్పాడు. రియల్ లైఫ్ సంఘటనలని బేస్ చేసుకొని ఈ మూవీ స్టోరీ రెడీ చేస్తున్నట్లు చెప్పారు.  అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథ మొత్తం నడుస్తుందన్నారు. ఇక కీరవాణి ఫారెస్ట్ అడ్వంచర్ స్టొరీ అని చెప్పడం ద్వారా దాన్ని మరోసారి ధృవీకరించినట్లు అయ్యిందంటున్నారు సినీ అభిమానులు.


ఆస్కార్ 2023 వేడుకల్లో ఎంఎం కీరవాణి ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు అకాడమీ అవార్డు గెల్చుకుని సత్తా చాటారు. తెలుగు సినిమా చరిత్రలోనే అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి.   


Read Also: నిమిషానికి రూ.5 లక్షలు ఇవ్వండి, అత్త డిమాండ్‌కు హన్సిక భర్త షాక్!