బాల నటిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల తార హన్సిక మోత్వాని, తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ కు పరియం అయిన ఈమె, తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయ్యింది. అగ్రహీరోల సరసన నటించే అవకాశం పొందింది. తమిళ సినిమా పరిశ్రమలోనూ బాగా రాణించింది. ఉత్తరాది ముద్దుగుమ్మ అయినా, సౌత్ లోనే బాగా పేరు సంపాదించుకుంది. మొత్తంగా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 50 సినిమాల్లో నటించింది.


చిన్ననాటి స్నేహితుడితో హన్సిక పెళ్లి


ఇక గత ఏడాది డిసెంబర్ లో హన్సిక తన చిన్ననాటి స్నేహితుడు, ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ అయిన సోహెల్ కతురియాను పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ జైపూర్ లోని ఓ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొద్ది మంది ప్రత్యేక ఆహ్వానితుల నడుమ వీరి పెళ్లి వైభవంగా జరిగింది. అయితే, పెళ్లి సందర్భంగా వివాహ స్థలికి చేరుకోవడంలో వరుడు కాస్త ఆలస్యం అయ్యాడట. దీంతో హన్సిక తల్లి కాబోయే అల్లుడికి ఫోన్ చేసి ఓ కండీషన్ పెట్టిందట. ఆమె కండీషన్ కు తను షాక్ అయ్యాడట. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


అత్త డిమాండ్ విని అల్లుడు షాక్


వాస్తవానికి హన్సిక పెళ్లి వేడుకను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రసారం చేస్తోంది. హన్సిక పెళ్లి వేడుకనంతా ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘లవ్ షాదీ డ్రామ్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ డాక్యుమెంటరీ కోసం హన్సిక కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించారు. తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్‌లో హన్సిక తల్లి మోనా మోత్వానీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లికి సోహైల్ కుటుంబ సభ్యులు అనుకున్న సమయానికి రాకపోవడంతో ఆమె చాలా టెన్షన్ పడ్డారట. వెంటనే సోహైల్ తల్లికి ఫోన్ చేసి ఇంకా ఆలస్యంగా వస్తే నిమిషానికి రూ. 5 లక్షలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారట. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో హన్సిక తల్లి ఈ విషయాన్ని వెల్లడించారు.  


హన్సిక స్నేహితురాలితో సోహైల్ వివాహం


ఇక  హన్సిక భర్త సోహైల్ కు గతంలో ఓ పెళ్లి అయ్యింది. హన్సిక స్నేహితురాలు రింకీ బజాజ్ తో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకలో హన్సిక పాల్గొని బరాత్ సందర్భంగా డ్యాన్స్ కూడా చేసింది. పెళ్లైనా కొద్ది కాలానికే వీరిద్దరు విడిపోయారు. దానికి కారణం హన్సిక అంటూ గతంలో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలను హన్సిక దంపతులు ఖండించారు. అవన్నీ అవావస్తవం అని తేల్చి చెప్పారు.






Read Also: ఓ మై గాడ్, ఆస్కార్ వేడుక టికెట్ల కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ అంత ఖర్చుపెట్టారా?