బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని బయట ఎక్కడా లీక్ చేయలేదు. వారి సన్నిహితుడు, అనీల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ మాత్రం విక్కీ-కత్రినాల ప్రేమ విషయాన్ని ఓ టీవీ షోలో చెప్పేశాడు. అప్పటినుంచి ఈ జంటపై మరిన్ని వార్తలు రావడం మొదలయ్యాయి. ఇన్నాళ్లు ప్రేమాయణం సాగించిన ఈ స్టార్ కపుల్ ఇప్పుడు పెళ్లితో ఒకటి కానున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు రాజస్థాన్ కు చేరుకున్నారు.
అక్కడే ఓ రిసార్ట్ లో బస చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం సంగీత్ జరగనుంది. డిసెంబర్ 9న పెళ్లి జరగనుంది. అయితే ఈ పెళ్లి విషయంలో కత్రినా-విక్కీ జంట.. చై-సామ్ లను ఫాలో అవ్వబోతుందని సమాచారం. ఇండస్ట్రీలో చాలా మంది వేర్వేరు మతాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్నారు. ఒక మతానికి తగ్గట్లుగా కాకుండా.. సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని.. ఆ తరువాత గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఇచ్చినవాళ్లు ఉన్నారు. సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ ఇలానే చేశారు.
సౌత్ లో సమంత-నాగచైతన్య మాత్రం రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. సమంత క్రిస్టియన్ కావడంతో చైతు ఆమె కోసం సూట్ ధరించి చర్చిలో రింగ్ లు మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు. చైతు హిందువు కావడంతో అతడి కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంది సమంత. ఇలా రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. ఇప్పుడు కత్రినా-విక్కీ కూడా క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోబోతున్నారట.
తమ కుటుంబాల సంప్రదాయాల ప్రకారం.. కత్రినా-విక్కీ కూడా రెండు సార్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. క్రిస్టియన్ వెడ్డింగ్ లో ధరించడానికి కత్రినా ప్రముఖ డిజైనర్ తో వైట్ కలర్ ఫ్రాక్ ను డిజైన్ చేయించుకుంది. ట్రెడిషనల్ వెడ్డింగ్ కోసం సభ్యసాచి వస్త్రాలను ధరించనుంది.
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌చేయండి