1997లో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అద్భుత చిత్రం ‘టైటానిక్’. ఈ చిత్రం అప్పట్లో సంచనలన విజయాన్ని అందుకుంది. ప్రపంచ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌ లెట్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా వీరి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి 2008లో ‘రివల్యూషనరీ రోడ్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కేట్ అప్పటి భర్త సామ్ మెండిస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ లో తన భర్త ముందే హీరోతో శృంగార సన్నివేశాల్లో నటించడం పట్ల చాలా అసౌకర్యంగా ఫీలైనట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, ఈ విషయాన్ని వెల్లడించింది.


భర్త ముందు ఆసీన్లు చేయడం అసౌకర్యంగా అనిపించింది - కేట్ విన్స్‌ లెట్


“ ‘రివల్యూషనరీ రోడ్’ సినిమాకు అప్పటి నా భర్త సామ్ మెండిస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని శృంగార సన్నివేశాలు ఉన్నాయి. నా భర్త ముందే లియోనార్డో డికాప్రియోతో శృంగార సన్నివేశాల్లో నటించడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అంతేకాదు, చాలా విచిత్రంగా అనిపించింది” అని కేట్ వెల్లడించింది. ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు 2009లో ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.  


ఒకరికొకరం పోటీపడి నటించాం - లియోనార్డో


ఇక ఈ సినిమా గురించి నటుడు లియోనార్డో డికాప్రియో కీలక విషయాలు వెల్లడించారు. “ ‘రివల్యూషనరీ రోడ్’ సినిమా కోసం మేము మరోసారి కలిసి నటించడం సంతోషం అనిపించింది. ఈ సినిమాలో మేము సహజంగా  నటించాలి అనుకున్నాం. శృంగార  సన్నివేశాల సమయంలో విన్స్‌ లెట్ అసౌకర్యంగా భావించినప్పటికీ, కష్టమైన సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు బాగా నటించింది. మేము చాలా సంవత్సరాలుగా మంచి స్నేహితులుగా ఉన్నాం. అందుకే  మా మధ్య ఒక కంఫర్ట్ లెవెల్ కచ్చితంగా ఉంది. ఈ సినిమాలో నటన విషయంలో ఒకరికొకరం పోటీపడి మరీ నటించాం” అని చెప్పుకొచ్చారు.


భర్తతో విడిపోయిన కేట్ విన్స్‌ లెట్


కేట్, మెండిస్ 2010లో విడిపోయారు. వీరికి అప్పుడు జో అనే కొడుకు ఉన్నాడు. తన భర్తతో విడపోవడం గురించి కేట్ కీలక విషయాలు వెల్లడించింది. "నా గురించి, సామ్ గురించి నేను ఒక విషయం చెబుతాను. మేం ఇద్దరం కలిసి ఉండాలనేది ఇద్దరికీ కష్టమైన విషయంగా మారింది. అందుకే విడిపోవాలి అనుకున్నాం. మేము ఒక బిడ్డను కలిగి ఉన్నాం. అతడిని మేం ఇద్దరం ఇష్టపడతాం. అందుకే తనను ఇద్దరం కలిసి పెంచాలి అనుకుంటున్నాం. ఎలాంటి విభేదాలు లేకుండా పెంచుతాం అనే నమ్మకం ఉంది” అని చెప్పింది. ‘టైటానిక్’ సినిమా 25వ వార్షికోత్సవం సందర్భంగా తాజాగా రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు దర్శకుడు కామెరూన్ తో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌ లెట్ థియేటర్ కు వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు.


Read Also: భర్తకు అవమానం - ఆ హీరో సినిమాల్లో ఇక నటించనని నయనతార వెల్లడి!