1997లో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అద్భుత చిత్రం ‘టైటానిక్’. ఈ చిత్రం అప్పట్లో సంచనలన విజయాన్ని అందుకుంది. ప్రపంచ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా నిలిచిపోయింది.  బాక్సాఫీస్ దగ్గర  $1.84 బిలియన్లు వసూళు చేసి, బిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌ లెట్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా వీరి పేరు మార్మోగిపోయింది. విజువల్ వండర్ గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికీ సినీ అభిమానులను అబ్బుర పరుస్తూనే ఉంటుంది.


కేట్ విన్స్‌ లెట్  ఓవర్ కోటు వేలం


ఇక ‘టైటానిక్’ చిత్రంలో షిప్ మునిగిపోతున్నప్పుడు కేట్ విన్స్‌ లెట్  ఓవర్ కోట్ ను ధరించి ఉంటుంది. ఓ స్తంభానికి బంధించిన జాక్‌(లియోనార్డో డికాప్రియో)ను ఆమె విడిపించే సన్నివేశంలో ఈ కోటు వేసుకుని కనిపిస్తుంది. షూటింగ్ టైంలో ఈ కోటుపై కొన్ని మరకలు పడ్డాయట. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయట. అంతేకాదు, ఈ ఓవర్ కోటును రూపొందించిన ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్‌, డెబోరా లిన్ స్కాట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ సైతం అందుకున్నారు.  ఈ ఓవర్ కోటును తను నలుపు రంగు ఎంబ్రాయిడరీతో పింక్ కలర్ ఉన్నితో తయారు చేశారు.


లక్ష డాలర్లకు పైగా ధర పలుకుతుందని ఆశాభావం!


కేట్ విన్స్‌ లెట్ ఐకానిక్ ఓవర్‌ కోటును సెప్టెంబర్ 13, 2023 వరకు గోల్డిన్ ఆక్షన్ హౌస్ ఆధ్వర్యంలో ఆన్‌ లైన్‌లో వేలం కొనసాగనుంది. ఇప్పటికే ఈ కోటు వేలం పాట మొదలయ్యింది. ఈ కోటు ఏకంగా $100,000 (రూ.8,28,5000) ధర పలికే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు.  ఇప్పటికే ఈ కోటు కోసం ఐదురుగు వ్యక్తులు $34,000 (రూ.2,820,553) వేలం పాడారు. నిర్వాహకులు మాత్రం $100,000 కంటే అధికంగానే ధర పలికే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐకానిక్ ఓవర్ కోటును కొనుగోలు చేసిన తమ భార్యకు బహుమతిగా ఇవ్వాలని వేలంలో పాల్గొనే వారు భావిస్తున్నారట. అంతేకాదు, చారిత్రాత్మక చిత్రంలో హీరోయిన్ నటించిన ఈ ఓవర్ కోటు తమ భార్య ధరించిందని గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటున్నారట. అయితే, ఇంకా వేలం పాటకు సుమారు నెల రోజుల పాటు సమయం ఉన్న నేపథ్యంలో ఎంత ధర పలుకుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   


సంచలన విజయాన్ని అందుకున్న ‘టైటానిక్’


ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ అద్భుత చిత్రాన్ని  1997లో రూపొందించారు. ఈ చిత్ర నిర్మాణం కోసం ఆయన చేసిన సాహసాలు అనన్య సామస్యంగా చెప్పుకొవచ్చు. సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ను చూసేందుకు పదుల సంఖ్యలో ఆయ సముద్ర గర్భానికి వెళ్లి వచ్చారు. ఎంతో శ్రమకు ఓర్చి రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం 14 అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను అందుకుంది.


Read Also: OMG 2: టీనేజర్లకు చూపించాల్సిన అడల్ట్ చిత్రం ఇది: ‘ఓఎమ్‌జీ 2’కు ఏ సర్టిఫికెట్‌పై అక్షయ్ కౌంటర్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial