కొన్ని సినిమాలు మేకర్స్ మైండ్‌లో ఉన్నవిధంగా ఆడియన్స్‌కు రీచ్ అవ్వలేకపోతాయి. ఒకవేళ అయినా కూడా మధ్యలోని పలు అవాంతరాల కారణంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఒక విధమైన నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన ‘ఓఎమ్‌జీ 2’ విషయంలో కూడా అదే జరుగుతోంది. దేవుడి గురించి, దేవుడిపై మనుషులు చూపించే నమ్మకం గురించి సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందు పెట్టాలనుకుంది ‘ఓఎమ్‌జీ 2’ టీమ్.. కానీ అనూహ్యంగా ఈ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనిపై ప్రేక్షకుల్లో ఒక విధమైన నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఇప్పటివరకు సీబీఎఫ్‌సీ నిర్ణయం గురించి స్పందించడానికి ఇష్టపడని అక్షయ్ కుమార్.. తాజాగా వారు ఇచ్చిన A సర్టిఫికెట్‌పై ఫైర్ అయ్యారు.
అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించిన ‘ఓఎమ్‌జీ 2’ థియేటర్లలో విడుదల అవ్వకముందే, ప్రేక్షకుల ముందుకు రాకముందే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. సీబీఎఫ్‌సీ.. ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ఇవ్వడమే దీనికి కారణం. అంతే కాకుండా ఇప్పటివరకు A సినిమాకు లేని విధంగా ‘ఓఎమ్‌జీ 2’కు 27 కట్స్ చెప్పింది సెన్సార్ బోర్డ్. ఈ మూవీలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించాడు.. కానీ సినిమా మాత్రం ఎక్కువగా సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి సినిమాకు యూ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు అంటూ A సర్టిఫికెట్‌ను అందించింది సీబీఎఫ్‌సీ. అప్పటినుండి అసలు ఈ మూవీకి A సర్టిఫికెట్ ఎందుకు వచ్చింది అంటూ ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది. ఇది ఒక విధంగా మూవీకి హైప్‌ను కూడా తీసుకొచ్చింది.
సీబీఎఫ్‌సీకి అక్షయ్ కౌంటర్..
ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓఎమ్‌జీ 2’ ప్రస్తుతం కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. ఇక ఈ సమయంలో సినిమాకు వచ్చిన A సర్టిఫికెట్ గురించి స్పందించాలని అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నాడు. తాజాగా ఒక థియేటర్‌కు సర్‌ప్రైజ్ విజిట్‌కు వెళ్లారు అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి. ఆ సమయంలో ఇన్‌డైరెక్ట్‌గా సీబీఎఫ్‌సీపై పలు కామెంట్స్ చేశాడు అక్షయ్. ‘ఇది టీనేజర్ల కోసం తెరకెక్కించిన మొదటి అడల్ట్ సినిమా అయ్యిండొచ్చు. అసలైతే ఇది ప్రతీ స్కూల్‌లో చూపించాల్సిన సినిమా.’ అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి చూస్తే ‘ఓఎమ్‌జీ 2’కు A సర్టిఫికెట్ అందుకోవడం అనేది అక్షయ్‌ను ఎంతగా ఆగ్రహానికి గురిచేసిందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ స్పందించిన ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
‘ఓఎమ్‌జీ 2’ వర్సెస్ ‘గదర్ 2’..
అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో పాటు యామీ గౌతమ్ కూడా ‘ఓఎమ్‌జీ 2’లో కీలక పాత్ర పోషించింది. సీబీఎఫ్‌సీ నుండి ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా మూవీ విడుదలయిన రెండురోజులకే రూ.25.56 కోట్ల కలెక్షన్‌ను సాధించింది. ఇక ఈ మూవీతో పాటు ఆగస్ట్ 11న విడుదలయిన మరో చిత్రం సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘గదర్ 2’. ‘ఓఎమ్‌జీ 2’కు మాత్రమే కాదు.. ‘గదర్ 2’కు కూడా ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఆదరణే లభిస్తోంది. ‘ఓఎమ్‌జీ 2’లాగా ‘గదర్ 2’కు పెద్దగా ప్రమోషన్స్ Aమీ జరగలేదు. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ రెండూ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి.
Also Read: షారుఖ్ ‘జవాన్’ టీమ్‌కు ఊహించని షాక్, రిలీజ్‌కు ముందే ట్విట్టర్‌లో సినిమా లీక్ - అదేలా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘Aబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial