Karthika Deepam October 6th Episode 1476 (కార్తీకదీపం అక్టోబరు 6 ఎపిసోడ్)
దీప...కార్తీక్ కి మీ పుట్టినరోజు డాక్టర్ బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి పువ్వులు ఇస్తుంది. ఈ రోజు నా పుట్టినరోజా! అని కార్తీక్ అనుకుంటాడు.అప్పుడు మోనిత మనసులో..ఈరోజు కార్తీక్ పుట్టినరోజు కదా నేను ఎలా మర్చిపోయాను సరైన సమయంలో దీప నన్ను ఇరికించేసింది..పోనీ ఈరోజు నీ పుట్టినరోజు కాదు కార్తీక్ అని చెబుదామంటే ఆధార్ కార్డు ఆధారాలు ఏమైనా తీసుకొస్తే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది అనుకుంది. అప్పుడు కార్తీక్ ఈరోజు నా పుట్టినరోజా మోనిత అని కార్తీక్ అడిగితే...లేదు కార్తీక్ చేద్దామనుకున్నాను సర్ప్రైస్ ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని కవర్ చేస్తుంది.
దీప: డాక్టర్ అమ్మ మీ పుట్టినరోజు ఇంట్లో బాగా జరుపుతుంది అనుకున్నాను..బెలూన్,కేకులతో ఇల్లంతా హడావిడిగా ఉంటుందనుకున్నాను కానీ మీరు ఏంటి ఇలా పడుకున్నారు అని చెప్పి నేను ఒక చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేశాను రండి అంటుంది
కార్తీక్ అక్కడికి వస్తాడు ఇష్టం లేకపోయినా మోనిత కూడా వస్తుంది. కార్తీక్ కేక్ కట్ చేస్తాడు.
దీప: గుర్తుందా డాక్టర్ బాబు కిందటి సంవత్సరం ఇదే పుట్టినరోజుకి నేను మీకు పర్స్ ఇచ్చాను అని అదే పర్స్ ని ఇస్తుంది దీప.
కార్తీక్: నిజంగా ఇచ్చావా అని ఆ పర్స్ తీసుకుంటాడు కార్తీక్...
దీప: మీ పుట్టినరోజు జరిపేందుకు రేపు రక్తదానం, అన్నదానం చేస్తున్నాం డాక్టర్ బాబు మీరు కచ్చితంగా రేపు రావాలి
ఇప్పుడు అవన్నీ ఎందుకు దీప అంటే..మీరు ఇచ్చిన డబ్బులతోనే చేస్తున్నాను డాక్టర్ బాబు మీ మంచి కోసమే అని దీప రిప్లై ఇస్తుంది. సరే రేపు అంతా మీతోనే ఉంటాను అని కార్తీక్ అంటాడు.
కార్తీక్: అవును మోనిత నువ్వు దీప నా వెనకాతల పడుతుంది అని అన్నావు కదా అలాంటప్పుడు ఈ పర్స్ నాకు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అడ్డుకోలేదు? కిందటి సంవత్సరం కూడా నువ్వు నా పుట్టిన రోజు మర్చిపోయావా
మోనిత: లేదు కార్తీక్ నాకు గుర్తుంది.చాలా చీకటి అయింది నాకు నిద్రొస్తుంది అని బలవంతంగా దీప దగ్గరనుంచి కార్తీక్ నీ లాక్కుని వెళ్లిపోతుంది.
Also Read: నా గతం ఏంటో తెలియాలి ప్రూఫ్స్ కావాల్న కార్తీక్, మోనితకి భారీ షాక్ ఇచ్చిన దీప
ఆ తర్వాత రోజు ఉదయం దీప తయారయ్యి కార్తీక్ దగ్గరికి వస్తుంది కానీ అక్కడ కార్తీక్ ఇంటికి తాళం వేసి ఉంటుంది.ఇంట్లో ఎవరూ ఉండరు అప్పుడు దీప కంగారుగా వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్లి అన్నయ్య, డాక్టర్ బాబు కనిపించడం లేదు. ఆ మోనిత కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు ఇల్లు ఖాళీ చేసేసి ఉంటారని భయపడుతూ ఉంటుంది. సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళుండరు అని ధైర్యం చెబుతాడు. లేదు అన్నయ్య దాని గురించి మీకు తెలీదు బయటకు వెళ్దాము అని చెప్పి తీసుకువెళ్లి ఇంకొక ఊరికి చెక్కేస్తుంది అని భయపడుతూ ఉంటుంది.
Also Read: పంటపొలాల్లో ప్రేమపక్షుల విహారం, మరోసారి విషం చిమ్మిన దేవయాని
కారులో మోనిత, కార్తీక్ వెళ్తూ ఉండగా కార్తీక్ ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు.అప్పుడు మోనిత మనసులో మళ్ళీ కార్తిక్ ఏం ఆలోచిస్తున్నాడో అనుకుంటుంది. అయినా పుట్టినరోజుని ఎలా మర్చిపోయా? ఆ దుర్గ గాడి గొడవలో పడి కార్తీక్ పుట్టినరోజు మర్చిపోయాను అని అనుకుంటుంది.
కార్తీక్: మోనితతో నిజంగానే నీకు నా పుట్టిన రోజు గుర్తుందా, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నావా
మోనిత: కార్తీక్ నాకు నీ పుట్టినరోజు గుర్తున్నది అందుకే నేను వంటల వాళ్ళతో నీ పుట్టినరోజుకి వంటలు చేయించమని అడిగినప్పుడు వంటలక్క గుర్తుపట్టేసింది. లేకపోతే దానికి నీ పుట్టినరోజు అని కూడా తెలియదు
కార్తీక్: నీకు పుట్టినరోజు గుర్తులేదని చెబితే నమ్ముతాను కానీ ఇలాంటి కథలు అల్లోద్దు
మోనిత: కథలు అల్లడం ఏంటి కార్తీక్
కార్తీక్:నువ్వు వంట వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్లైనా రావాలి కదా ...
మోనిత: మర్చిపోయాను కార్తీక్
కార్తీక్: నిజంగానే మర్చిపోయావా లేదా ఇంకెవరినో దృష్టిలో పెట్టుకుని ఉండి పోయావా!సరేలే నీ క్లోజ్ ఫ్రెండ్ ఏమయ్యాడు. ఇంటి ద్గగర వాడు ఒక్క నిముషం కూడా వదిలి ఉండేవాడు కాదుకదా..
మోనిత: నువ్వు ఏమైనా మాట్లాడు కానీ నన్ను అనుమానించే టాపిక్ మాట్లాడకు
కార్తీక్: ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నావ్..వంటలక్క నుంచి దూరంగా తీసుకెళుతున్నావా... లేదా నీకు దుర్గకి అడ్డొస్తున్నానని నన్ను ఏమైనా చేయడానికా... రోజులు అసలే బాలేవు మోనిత...ఈ మధ్య ఎక్కడ చూసినా అవే న్యూస్ లు... దుర్గ ముందే వెళ్లి మనకోసం వెయిట్ చేస్తున్నాడు కదా..అక్కడకు వెళ్లగానే ఇద్దరూ చంపేస్తారా
మోనిత: స్టాపిట్ కార్తీక్ అని అరుస్తుంది..
కార్తీక్: ఓసారి గతం మర్చిపోయాను..మళ్లీ గతం తెలుసుకోకుండా చచ్చిపోతానేమో అనే భయం.. ఓ ప్లాన్ లేకపోతే సరే.. ఓ రోజు తప్పించుకున్నా మరోరోజు తప్పించుకోలేం కదా..
మోనిత: నువ్వు నా ప్రాణం కార్తీక్, నన్ను అనుమానించకు అంటుంది.. నిన్ను భరించడం చాలా కష్టం..రెండు రోజులకే నాకు ఇలా ఉందంటే దీప పదేళ్లు ఎలా భరించిందో అని మనసులో అనుకుంటుంది
శౌర్య..తన పిన్ని బాబాయ్ తో ఓ హోటల్ కి వెళుతుంది. డబ్బులు ఉన్నాయా లేదంటే ఇక్కడ అంట్లు తోమే ఓపిక నాకులేదంటుంది చంద్రమ్మ. ఉన్నాయిలే అంటాడు ఇంద్రుడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని శౌర్య అడిగితే.. సంగారెడ్డిలో బతుకమ్మ, దసరా పండుగ బాగా చేస్తారు అక్కడికి వెళుతున్నాం అని సమాధానం చెబుతారు. అయితే అక్కడకు అమ్మా నాన్న కూడా వస్తారా అని అడుగుతుంది శౌర్య..
ఎపిసోడ్ ముగిసింది...