భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ(ఎంఎస్ఎంఈ) కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధాకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.



వివరాలు..

మొత్తం పోస్టులు : 14

1) సీనియర్ ఇంజినీర్(ట్రైనింగ్): 01 పోస్టు

2) సీనియర్ ఇంజినీర్(డిజైన్): 02 పోస్టులు

3) సీనియర్ ఇంజినీర్(ప్రొడక్షన్): 01 పోస్టు

4) ఇంజినీర్(ట్రైనింగ్)- మెకానికల్: 01 పోస్టు

5) ఇంజినీర్(ట్రైనింగ్)- ఎలక్ట్రానిక్స్: 01 పోస్టు

6) ఇంజినీర్(ప్రొడక్షన్): 02 పోస్టులు

7) స్టోర్ ఆఫీసర్ పోస్టులు: 01 పోస్టు

8) సీనియర్ టెక్నీషియన్(ప్రొడక్షన్): 02 పోస్టులు

9) సీనియర్ టెక్నీషియన్(ట్రైనింగ్): 01 పోస్టు

10) సీనియర్ టెక్నీషియన్ మెయింటెనెన్స్(ఈఎల్‌ఈ, మెకానికల్‌): 02 పోస్టులు

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/ డిగ్రీ (కామర్స్)/సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 20.09.2022 నాటికి గరిష్ట వయోపరిమితి సీనియర్ ఇంజినీర్ పోస్టులకు 35 సంవత్సరాలు, ఇంజినీర్ పోస్టులకు 32 సంవత్సరాలు, స్టోర్ ఆఫీసర్‌కు 32 సంవత్సరాలు, సీనియర్ టెక్నీ షియన్ పోస్టులకు 30 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధాకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం: రూ.29,200ల - రూ.1,42,400. 



ముఖ్యమైన తేదీలు..


* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.10.2022.


* దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 31.10.2022.



దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

THE DY. GENERAL MANAGER, 
PLOT NO SP3, 871(A), 872, 
RIICO INDUSTRIAL ESTATE PATHREDI, 
POST OFFICE–TAPUKADA, 
BHIWADI-301019 (RAJASTHAN).



Notification & Application


Website


 


ఇవీ చదవండి..


BPCL: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు, వీరికి అవకాశం!
కొచ్చిలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...