Karthika Deepam October 5th Episode 1475 (కార్తీకదీపం అక్టోబరు 5 ఎపిసోడ్)
కార్తీక్ కోసం మోనిత పకోడీలు తీసుకొచ్చి ఇచ్చి సామ్రాజ్యం, సైకిల్ అంటూ ఏవేవో కథలు అల్లుతుంది. అప్పుడే వచ్చిన దుర్గ రివర్స్ లో అదే కథ కార్తీక్ కి చెబుతాడు. అప్పట్లో మేం ఇద్దరం సైకిల్ పై తిరుగుతూ ఉండేవాళ్లం..అవన్నీ గుర్తొచ్చి నన్ను రమ్మంది నేను రావడం లేటయ్యేసరికి మీకిచ్చేసిందంటాడు. కార్తీక్ కోపంగా లేచి వెళ్లిపోతాడు. అప్పుడు మోనిత..దుర్గ షర్టు పట్టుకుంటుంది..నీకేం అన్యాయం చేశానని అడుగుతుంది. అసలు స్వరాజ్యం ఎవరో నీకు తెలుసా అని అంటే..నీకు తెలుసా అని రివర్స్ లో క్వశ్చన్ చేస్తాడు. 
మోనిత: అసలు మీకు ఏం కావాలి? ఎందుకు నాకు, కార్తీక్ మధ్య దూరం పెంచాలనుకుంటున్నారు. నువ్వు ఆ వంటలక్క కలిసి ఏం ప్లాన్ చేశారు
దుర్గ:  మధ్యలో దీపమ్మని తీసుకురావొద్దు. అప్పుడు విహారిని అడ్డం పెట్టుకొని  సార్ కి , దీపమ్మ కి మధ్య దూరం పెంచావు. ఆ నొప్పి నీకు తెలియాలి కదా! అయినా ఇప్పుడేముంది, రాత్రికి ఉంటది చూడు నీకు అసలు పండగ బంగారం అని చెప్పి వెళ్ళిపోతాడు 


ఆ తర్వాత  కార్తీక్ మేడపై నిల్చుని అసలు ఏంజరిగిందని గుర్తుచేసుకుంటూ ఉంటాడు. నేను ఒక్కడినే సైకిల్ పై ఎందుకు వెళుతున్నాను..గుర్తొచ్చేది పూర్తిగా గుర్తుకురావొచ్చుకదా అనుకుంటాడు. నాకు గతం ఎప్పుడు గుర్తు వస్తుందో ఈ కన్ఫూజన్స్ ఎప్పుడు దూరమవుతాయో అనుకుంటాడు. పైనుంచి దీప నవ్వుతూ ఉండడం చూసి..ఈ మధ్య వంటలక్క సంతోషంగా కనిపిస్తోంది ఏంటి అనుకుంటూ..దీపా అని పిలుస్తాడు... ఏంటి సంతోషంగా ఉన్నావ్ అని అడుగుతాడు..
దీప: అవును పెద్ద పండుగ నా జీవితంలోనే అన్నిటికీ మించిన పెద్ద పండుగ...
కార్తీక్: ఈ సస్పెన్స్ నేను భరించలేను చెప్పు అని అడుగుతాడు..ఇంతలో వెనుకే వచ్చిన మోనిత కార్తీక్ కి లాక్కెళ్లిపోతుంది.
ఈ రోజు ఏదో పండుగ ఉంది నువ్వే చెప్పడం లేదంటాడు కార్తీక్..ఈ రోజు ఏ పండుగా లేదు నీకు అనుమానం ఉంటే క్యాలెండర్ చూసుకో అంటుంది మోనిత. అయినా ఏదో ఉంది..వెళ్లి కనుక్కుని వస్తానని కార్తీక్ అంటే..మోనిత ఆపేస్తుంది..


Also Read: పంటపొలాల్లో ప్రేమపక్షుల విహారం, మరోసారి విషం చిమ్మిన దేవయాని


దీప...వాళ్ళ అమ్మ, అన్నయ్యలతో భోజనం చేస్తూ ఆనందంగా ఉంటుంది. నిన్ను ఇలా ఆనందంగా చూసి చాలా రోజులు అయిందని వాళ్లంటారు. ఇన్నాళ్లు డాక్టర్ బాబుకి గతం గుర్తొస్తుందా రాదా అనే బాధలోనే ఉండేదాన్ని ఇప్పుడు ఎక్కడో చిన్న ఆశ కనిపిస్తోంది. ఈరోజు జరిగేది ఎలాగా ఎవరు ఆపలేరు డాక్టర్ బాబుకి గతం గుర్తు రాకపోయినా నన్ను దీపా అని రోజు మనసారా పిలిచారు నాకు అది చాలా ఆనందంగా ఉంది అంటుంది. దీనికే ఇలా సంతోషపడిపోతున్నావంటే కార్తీక్ కి గతం గుర్తొస్తే ఇంకా ఎలాగ అయిపోతావో అని దీప వాళ్ళ అమ్మ,అన్నయ్య అంటారు. అప్పుడు దీప...ఈరోజుతో డాక్టర్ బాబు కి గతం గుర్తు రాదు కానీ మోనిత తన భార్య కాదని మాత్రం తెలుస్తుంది అని అనుకుంటుంది.


మోనిత-కార్తీక్
కార్తీక్, మోనిత భోజనం చేస్తుంటారు...
కార్తీక్: ఏం ఆలోచిస్తున్నావ్ మోనిత 
మోనిత: ఏమి లేదు కార్తీక్ బొటిక్ కి రావాల్సిన మెటీరియల్ ఇంకా రాలేదు దాని కోసం ఆలోచిస్తున్నాను అని కవర్ చేస్తుంది.
కార్తీక్: దీప గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నాను 
మోనిత: వాళ్ల గురించి మనకెందుకు కార్తీక్, నేను మెటీరియల్ గురించి ఆలోచిస్తున్నాను అయినా ఈ విషయం నీకు ఉదయం చెప్పాను కదా 
కార్తీక్: చిరాకు వచ్చి నాకు ఏం గుర్తు రావడంలేదు. నిజంగా నేను మర్చిపోయానా లేకపోతే నువ్వే చెప్పకుండా మర్చిపోయాను అని అంటున్నావో అర్థం కావడం లేదని నాకుకోపం వస్తోంది
మోనిత: కార్తీక్ నువ్వు భయపడాల్సిందేమీ లేదు ఏ ఆలోచనలు లేకుండా మనశ్శాంతిగా ఉండు
కార్తీక్: వస్తువు పోతేనే గిలగిల్లాడిపోతాం అలాంటిది గతం మర్చిపోతే ఎలా సైలెంట్ గా ఉంటాను అనేసి కోపంగా లేచి నిలబడతాడు. నేను నీ భర్తని అన్నావు కానీ ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకా ఎవరూ లేరా... ఎందుకని ఎవ్వరినీ పరిచయం చేయడం లేదు..మరోవైపు దీప ఎన్నో పేర్లు చెప్పింది హిమ అని, రౌడీ అని అలాగైతే నేను దీపనే నా భార్య అనుకోవాలా అని కార్తీక్ అరుస్తాడు.
మోనిత: అలా అనుకోవద్దు కార్తీక్ నీకు ఆ ఆలోచన కూడా రాకూడదు.నేను నీ భార్యను, ఆనంద్ మన బాబు... నువ్వు నాతో ఉంటున్నావు దీప నీకోసం వచ్చింది. ఇది చాలు కదా నువ్వు నా వాడివి అని చెప్పడానికి 
కార్తీక్: ఇది చాలదు మోనిత నాకు నమ్మకం కావాలి నేను గతాన్ని మర్చిపోయాను అని తెలుసు కానీ మరి అంత జడ్డోడిని కాదు.. నాకు గతం గుర్తుకు రావాలి అంతవరకూ ఏదీ నిజమని నమ్మలేను అబద్ధం అని కొట్టిపారేయలేను అనేసి కోపంగా వెళ్లిపోతాడు కార్తీక్..
తొందరగా దుర్గని ఇక్కడి నుంచి పంపించేయాలి,దీపను ఇక్కడ లేకుండా చేయాలి...లేదా కార్తీక్ ని తీసుకెళ్లిపోవాలి లేదంటే కార్తీక్ నాకు దూరమైపోతాడు అనుకుంటుంది.. ఆ తర్వాత మోనిత ఫ్రిడ్జ్ లో మంచినీళ్లు తాగుతూ...దుర్గేమో ఈ రోజు ఏదో ట్విస్ట్ ఉంది అన్నాడని గుర్తుచేసుకుంటుంది...ఇంతలో డాక్టర్ బాబూ అని డోర్ కొడుతుంది దీప... అర్థరాత్రి పూట తలుపులు కొడుతోంది ఏంటి ఈ టైమ్ లో వంటలక్కకి ఏం పని అనుకుంటుంది. కార్తీక్ లేచేలోగా దీన్ని పంపించాలి అనుకుంటుంది మోనిత..ఇంతలో కార్తీక్ రానేవస్తాడు...
అర్థరాత్రి ఎందుకు వచ్చావ్ బయటకుపొండి అంటుంది మోనిత..అదేంటి పండుగ చేసుకుందాం అని వస్తే బయటకు పొమ్మంటారేంటి అంటుంది దీప. ఫైర్ అయిన మోనిత ఏం పండుగే ఈ రోజు అని రెట్టిస్తుంది. దీపా ఏం పండుగో చెప్పెయ్ అంటాడు కార్తీక్..ఈ రోజు మీ పుట్టినరోజు పండుగ అనిచెప్పి దీప పూలు ఇస్తుంది.  మోనిత షాక్ అవుతుంది..


Also Read: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క


రేపటి( గురువారం ఎపిసోడ్ లో)
దీప గుడికి బయలుదేరుతుంది. ఇంటికెళ్లి చూసేసరికి ఇల్లంతా ఖాళీగా ఉండడంతో డాక్టర్ బాబుని ఎక్కడికైనా తీసుకెళ్లిపోయిందా అని ఆలోచిస్తుంది దీప.. అటు మోనిత, కార్తీక్ కార్లో వెళుతుంటారు... నన్ను వంటలక్క నుంచి దూరంగా తీసుకెళ్లిపోతున్నావా లేదా నీకు-దుర్గకి అడ్డొస్తున్నాని ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా అని మోనిత క్వశ్చన్ చేస్తాడు కార్తీక్...