Karthika Deepam November 18th Episode 1512 (కార్తీకదీపం నవంబరు 18 ఎపిసోడ్)
శౌర్యని కలిసిన సౌందర్య..ఇంద్రుడు-చంద్రమ్మకి క్లాస్ తీసుకుంటుంది.
సౌందర్య: చిన్న పిల్ల దానికి తెలియదు మీరు కూడా దాని నమ్మకాన్ని బలపరుస్తున్నారా
ఇంద్రుడు-చంద్రమ్మ: అవన్నీ మేం పట్టించుకోవడం లేదమ్మా తన సంతోషం కోసం మేము ఏమైనా చేస్తాం
సౌందర్య: ఇంక చాలు నువ్వు నాతో పాటు హైదరాబాద్ వస్తున్నావు .. చిన్న పని ఉంది చూసుకుని వస్తాను ఆలోపు బయలుదేరు నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి చిన్న పిల్లవి కాదు పెద్దమనిషి అయ్యావు అర్థం చేసుకో శౌర్య అని
సౌందర్య అలా బయటకు వెళ్లగానే..ఇంద్రుడు-చంద్రమ్మ శౌర్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. నానమ్మకి అబద్ధం చెప్పానని శౌర్య ఏడుస్తుంది.
Also Read: గోరుముద్దలు తినిపించుకున్న రిషిధార, జగతిని ఆలోచనలో పడేసిన రిషి మెయిల్
మరొకవైపు మోనిత కోసం దీప-కార్తీక్ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. మోనిత ఇంటి బయట ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.
దీప: ఈ రోజు నేను ఏం చేసినా మీరు మాట్లాడకండి డాక్టర్ బాబు
కార్తీక: సరే ఏంచేస్తావో చేయి
దీప: అదేంటి భార్యని ఏం చేస్తావో చేయిఅని అంటారేంటి అని అనుమానపడుతుంది
మరోవైపు మోనిత కచ్చితంగా కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చింది అందుకే దీపని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్యని చూసి మోనిత టెన్షన్ పడుతుంది.
మోనిత: సారీ ఆంటీ ఇంట్లోకి పిల్చుకుని వెళ్ళడానికి కీస్ లేవు అంటుంది.
సౌందర్య: సరేలే మోనిత బయటికి వెళ్దాం నాతోపాటు రా
కారు కీస్ కూడా లేవు ఆంటీ అనడంతో మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది సౌందర్య. అప్పుడు సౌందర్య అసలు ఏముందో లేదో నేను తేలుస్తాను అని మోనిత ఇంటి వైపు కోపంగా వెళుతుంది. లోపల కార్తీక్-దీప ఉండడం చూసిన మోనిత టెన్షన్ పడుతుంది. సౌందర్య...ఓ బండ తీసుకొచ్చి తాళం పగులగొడుతూ ఉండగా...మోనితలో టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు కానీఆంటీ కార్తీక్ ని చూస్తే జీవితంలో కార్తీక్ మళ్లీ దక్కడని ఫీలై..బండతో తలపై కొడుతుంది.
Also Read: శౌర్యని కలిసిన సౌందర్య, దీప-కార్తీక్ ను తప్పుదారి పట్టించిన మోనిత
తాళం పగులగొట్టిన తర్వాత కూడా మోనిత లోపలకు రాకపోవడంతో తలుపులు తీసిబయటకు వస్తారు దీప-కార్తీక్...
సౌందర్యని కొట్టిన దగ్గర రక్తపు మరకలు ఉండడంతో దీప-కార్తీక్ అనుమాన పడతారు. మరోవైపు సౌందర్య తలకు కట్టించి హైదరాబాద్ లో దించేసిరమ్మని శివను పంపిస్తుంది మోనిత... మరోవైపు దీప-కార్తీక్ బయట రక్తంచూసి ఏం జరిగి ఉంటుందో..మనల్ని కాపాడాలని అనుకుంటే ఎవరినైనా కొట్టిందా అనుకుంటారు. ఇంతలో వచ్చిన మోనిత నా కొంపలో నువ్వేం చేస్తున్నావ్ అని అడుగుతుంది మోనిత..
ఈ రక్తకం ఎవరిదని దీప అడిగితే నీకు దెబ్బేమైనా తగిలిందా అని కార్తీక్ అడుగుతాడు..కంగారులో మోనిత నాకేం అవసరం ...నేను వచ్చేసరికి ఇంటికితాళం వేసి ఉంది..తాళం పగుల గొట్టి లోపలకు వద్దామంటే మీరు లోపలున్నారని ఆగిపోయాను..ఈ రక్తం ఎవరిది అని దీప రెట్టించడంతో..మీ ఇద్దరిబాగోతం చూశారని ఎవరినైనా కొట్టారా అని రివర్స్ లో మాట్లాడుతుంది మోనిత....కాసేపు వాదన జరిగిన తర్వాత దీప వెళ్లిపోతుంది...అటు కార్తీక్ మాత్రం మోనిత ఏదో చేసిందని డౌట్ పడుతూనే ఉంటాడు...