దీప తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉండగా కార్తీక్ చూసి బాధపడతాడు. నువ్వు నా ప్రాణం దీప, దేవుడు నా దీపాన్ని ఆర్పాలని చూస్తున్నాడు. కానీ ఆరిపోనివ్వను ఎలాగైనా కాపాడుకుంటాను అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. కార్తీక్ మనసు మారి అత్తయ్య వాళ్ళ దగ్గరకి వెళ్ళేలా ఏదైనా దారి చూపించమని దీప మనసులో వేడుకుంటుంది. అప్పుడే చారుశీల వచ్చి పలకరిస్తుంది. పెళ్లి చేసుకోమని అడగటానికే పిలుస్తుందని చారుశీల మనసులో సంబరపడుతుంది. చారుశీల గురించి కాసేపు పండరి కార్తీక్ దగ్గర మాట్లాడుతుంది. తను ఇచ్చిన మందుల గురించి పండరి నోరు జారబోతుంది కానీ మళ్ళీ తన మాట దాటేస్తుంది.


హేమచంద్రతో శౌర్య తన తల్లిదండ్రుల గురించి చెప్పుకుని బాధపడుతుంది. అది విని మీ అమ్మానాన్న ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నారు. కానీ మీ నాన్న మనసు మారితేనే మీకు కనిపిస్తారు అని మనసులో అనుకుంటాడు. చారుశీల గురించి హేమచంద్రని అడుగుతుంది. తెలియదని చెప్పేసరికి తన అమ్మానాన్న వెతకడానికి సహాయం చెయ్యమని అడుగుతుంది. హేమచంద్ర శౌర్య ఫోటో అడుగుతాడు. ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకుని డాన్ని కార్తీక్ వాళ్ళకి పంపిస్తాడు. దీప చారుశీలని డాక్టర్ బాబు ని తన అమ్మానాన్న దగ్గరకి పంపించాలని అడుగుతుంది.


Also Read: ఒకరి మీద ఒకరు చిలిపి ఫిర్యాదులు చేసుకున్న వేద, యష్- భ్రమరాంబికని ఆట ఆడుకుంటానన్న మాళవిక


చారుశీల: చనిపోతున్నా అని తెలిశాక కార్తీక్ కి వేరే పెళ్లి చేయాలని అనుకుంటుంది, అది నేనే అవుతాను అని ఆశపడితే తల్లిదండ్రుల దగ్గరకి పంపించమని అడుగుతుంది ఏంటి? అప్పుడు నేనేం కావాలి, కార్తీక్ మీద నేను పెట్టుకున్న ఆశలు ఏం కావాలి అని మనసులో అనుకుని ఏం మాట్లాడుతున్నావ్ అక్కా అని అంటుంది.


దీప: మీరు ఆడిన అబద్ధం తెలుసు. నా ప్రాణాల మీదకి వస్తే ఆయన మీదకి వచ్చిందని చెప్తారా


చారుశీల: కార్తీక్ చెప్పనివ్వలేదు(నువ్వు పోవాలి, కార్తీక్ నా వాడు కావాలి. కానీ మధ్యలో కార్తీక్ ని మీ వాళ్ళకి అప్పగించమని చెప్తున్నావ్ అదే బాగోలేదు అని మనసులో అనుకుంటుంది)


దీప: నేను చనిపోతే నువ్వే ఆయన్ని వాళ్ళ దగ్గరకి చేర్చాలి


చారుశీల: అంతేనా దీప ఇంక వేరే ఆలోచన లేదా


దీప: ఇంకేం ఆలోచన ఉంటుంది. ఆయన ఏమంటున్నారో తెలుసా చావు అయినా బతుకు అయినా నాతోనే అంటున్నారు. అసలు ఆయనకి తెలియకుండా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలని అనిపిస్తుంది


చారుశీల: వద్దు ఆ పని మాత్రం చెయ్యకు(వాళ్ళు వస్తే నా ప్లాన్ ఏమవుతుంది), వాళ్ళు వస్తే నీ గురించి తెలుస్తుంది కదా


దీప: అందుకే నువ్వే ఆయన్ని వాళ్ళ దగ్గరకి చేర్చాలని మాట తీసుకుంటుంది. కానీ చారుశీల మాత్రం కార్తీక్ ని పెళ్లి చేసుకుంటాను అని మాట మనసులో అనుకుంటుంది. ఇంద్రుడు వచ్చి చంద్రమ్మని కాఫీ అడుగుతాడు. ఇద్దరూ కాసేపు జ్వాల గురించి మాట్లాడుకుని బాధపడుతుంది. ఆ మాటలన్నీ హిమ వింటుంది. వచ్చి వాళ్ళకి సోరి చెప్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కావాలని చేయలేదని అమ్మనాన్న కనిపించడం లేదనే బాధలో అలా అన్నాను అని అంటుంది. మీరంటే నాకు చాలా ఇష్టం మీ గురించి అలా తప్పుగా ఎందుకు అనుకుంటాను అని హిమ అంటుంది. మాకు జ్వాల ఎంతో నువ్వు కూడా అంతే, జ్వాలమ్మతో మాట్లాడి మిమ్మల్ని కలుపుతాను అని ఇంద్రుడు చెప్తాడు. ఆ మాట విని హిమ సంతోషిస్తుంది.


Also Read: నందు దుమ్ముదులిపిన తులసి- చిక్కుల్లో పడబోతున్న సామ్రాట్?


కార్తీక్ కోపంగా దీప దగ్గరకి వచ్చి అరుస్తాడు. ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను కదా మరి అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని అంటావ్ ఏంటి? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను. నా ఊపిరి ఆగిపోయేవరకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను’ అని తెగేసి చెప్తాడు. ఎంత చెప్పినా వెళ్ళడం లేదు ఎలా పంపించాలి అని మనసులో అనుకుంటుంది. ఎన్ని చెప్పినా ఎవరితో చెప్పించినా కూడా ఎక్కడికి వెళ్ళేది లేదని కార్తీక్ దీపతో చెప్తాడు. అప్పుడే హేమచంద్రతో శౌర్య దిగిన ఫోటో పంపిస్తాడు. అప్పటి వరకు అరుచుకున్న ఇద్దరు శౌర్య ఫోటో చూడగానే కోపం పోయి మాట్లాడతాడు. కూతురు ఫోటో చూడగానే కోపం పోయింది వాళ్ళ దగ్గరకి వెళ్ళను అంటున్నారు అని దీప అంటే నువ్వు నా ప్రాణం నిన్ను వదిలేసి ఎలా వెళ్లిపోతానని కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడతాడు.