Karthika Deepam  December 7th  Episode 1529 (కార్తీకదీపం డిసెంబరు 7 ఎపిసోడ్)


శౌర్యని రమ్మంటే రావడం లేదు..హిమ ఒంటరిది అయిపోయిందని ఆనందరావు బాధపడతాడు. బుల్లి ఆనందరావుని కూడా మోనిత తీసుకెళ్లిపోయిందనుకుంటాడు. ఇంతలో సౌందర్య అక్కడకు రావడంతో మోనిత ఏమైనా చెప్పిందేమో రోషిని మేడంని అడుగు అని అనడంతో సౌందర్య కాల్ చేస్తుంది. రోషిణి మేడంతో మాట్లాడి కాల్ కట్ చేసిన సౌందర్య...మోనిత గురించి మాట్లాడుతూ ఫైర్ అవుతుంది. జైల్లో కార్తీక్ తో కలసి ఉన్న ఫొటో పెట్టుకుంటానని జైలర్ కి రిక్వెస్ట్ పెట్టిందట అని చెబుతుంది. ఆనంద్ ఎక్కడున్నాడో తెచ్చేసుకోవాలి అనుకుంటారు..


మరోవైపు దీప రిపోర్ట్స్ చూసిన మరో డాక్టర్... ఆమెకి హార్ట్ ట్రాన్సప్లంటేషన్ చేయడం తప్పదంటాడు. వాళ్ల జీవితంలో ఇప్పుడిప్పుడే ఆనందం నిండి ఉంది..ఇలాంటి సమయంలో ఈ విషయం చెప్పడం సరికాదు అంటుంది డాక్టర్ చారుశీల. చెప్పడమే మంచిది ఆయన కూడా డాక్టరే కదా అంటాడు. సరే అని దీప-కార్తీక్ ను కలస్తుంది చారుశీల.
చారుశీల: ఇప్పుడు వెళ్లడం అవసరమా..కారులో అంతదూరం అవసరమా..ఫ్లైట్ లో వెళ్లొచ్చుకదా 
కార్తీక్: నేను కూడా అదే చెప్పాను కానీ వినడం లేదు...ఫ్లైట్ ఎక్కితే తను ప్రశాంతంగా కూర్చోదు..నన్ను కూడా ప్రశాంతంగా కూర్చోనివ్వదు
దీప: డాక్టర్ చారుశీల ఎంత చెప్పినా దీప వినదు.. ఏం కారుతో ఏదైనా పనిఉందా 
చారుశీల:అలా ఏం లేదు...కొద్దిరోజుల్లోనే సర్జరీ అయింది కదా అందుకే చెబుతున్నా
దీప: నువ్వు కూడా రా
చారుశీల: మీరిద్దరూ సంతోషంగా వెళ్లండి..మధ్యలో నేనెందుకు అంటుంది...దీప కండిషన్ కార్తీక్ కి చెప్పేస్తే మంచిదేమో.. దారిలో ఏమైనా జాగ్రత్త తీసుకోగలుగుతాడేమో అనుకుని.. కార్తీక్ ని పిలిచి మీతో కొంచెం మాట్లాడాలి ఓ పేషెంట్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి
కార్తీక్: ఇప్పుడు బయలుదేరే సంతోషంలో ఉన్నాను రిపోర్ట్స్ మెసేజ్ చేయి చూస్తాను 
చారుశీల: గట్టిగా చెబుదాం అంటే విని తట్టుకోలేవని భయం..అలాగే ముందే ఎందుకు చెప్పలేదని భయం.. అయినా చాలా రోజుల తర్వాత సంతోషంగా మీ ఇంటికి వెళుతున్నారు కదా మీరు వచ్చాక చెబుతాను..ఈ లోగా ఏం చేయాలో ఆలోచిస్తాను


Also Read: రిషిధార రొమాంటిక్ మూమెంట్స్, దేవయానికి ఝలక్ ఇచ్చిన గౌతమ్!


మరోవైపు సౌందర్య వాళ్లు లక్ష్మణ్ కోసం వెళతారు. వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు...పెద్ద ఇల్లు కొన్నారు, కారు కూడా కొన్నారు..ఎవరో బాబుని తీసుకొచ్చి ఇచ్చారు..దాంతో వాళ్ల దశ తిరిగిపోయిందని చెబుతుంది.
ఆనందరావు: పిల్లాడిని, ఆస్తిని లక్ష్మణ్ చేతికి అప్పగించి ఆ మోనిత జైలుకి వెళ్లిపోయింది
సౌందర్య: ఇలా ఎందుకు చేసింది వాడు మన మనవడు కదా మన దగ్గరే ఉంచాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది
ఆనందరావు: మన కొడుకుని మనతో ఉంచలేదు..తన కొడుకుని మనతో ఉండనివ్వలేదు.. ఏ జన్మలోనే శత్రుత్వం ఇప్పుడు ఇలా వేధిస్తోంది
సౌందర్య: ఎవరు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతారని హిమకు ధైర్యం చెబుతుంది. మోనిత జైలుకి వెళ్లింది, శౌర్య వస్తుంది, నా మనవడు కూడా వస్తాడు


Also Read: కార్తీక్ దగ్గర నిజం దాచిన డాక్టర్ చారుశీల, సౌందర్య దగ్గరకు బయలుదేరిన దీప-కార్తీక్


కార్తీక్ కారు డ్రైవ్ చేస్తూ దీపను చూస్తుంటాడు. రోడ్డు చూస్తూ కార్ డ్రైవ్ చేయండి అంటుంది దీప.  నిన్ను చూస్తున్నానని ఎలా తెలిసింది అంటే..నాకు మీరేలోకం అని డైలాగ్స్ చెబుతుంది. నువ్వు అల్పసంతోషివి దీపా అంటాడు కార్తీక్. దార్లో ఎక్కడైనా గ్రేప్స్ కనిపిస్తే ఆపండి అత్తయ్య కోసం అంటుంది దీప. ఎవరెవరికి ఏం ఇష్టమో అవన్నీ కొని తీసుకెళ్లాలి అంటుంది. ఈ లోగా వారణాసి ప్రస్తావన తీసుకొస్తుంది..వారణాసికి ట్యాక్సీ కొనివ్వాలి అంటుంది. కార్తీక్ కి వెంటనే..వారణాసి హాస్పిటల్లో కోమాలో ఉన్న విషయం గుర్తుచేసుకుంటాడు కార్తీక్. 


సౌందర్య-ఆనందరావు ...మోనిత గురించి మాట్లాడుకుంటారు. మోనిత ప్రవర్తన చూస్తుంటే కార్తీక్-దీప బతికే ఉన్నారనిపిస్తోంది అనుకుంటారు. కార్తీక్ లోపల ఉన్నాడు కాబట్టే నిన్ను తాళం తీయనీయకుండా ఆపిందంటాడు. మోనిత ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే దీప కూడా బతికేఉందని అనిపిస్తోంది అంటుంది సౌందర్య. మరోవైపు ఇంద్రమ్మ..శౌర్యని పంపించడానికి సరే అన్నాకానీ తను లేకుండా నేను ఉండగలనా అని బాధపడుతుంది.  
ఎపిసోడ్ ముగిసింది


రేపటి(గురువారం) ఎపిసోడ్ లో
దీప-కార్తీక్ ఇంటికొచ్చేశారు...శౌర్య మీతో ఎందుకు లేదు..తను ఒక్కతే ఎందుకు ఉంది..శౌర్యని వదిలేసి మీరెందుకు అమెరికా వెళ్లిపోయారని సౌందర్యని వరుస ప్రశ్నలు వేస్తుంది దీప