గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu December 7th Update Today Episode 627)
షాపింగ్ కి వెళ్లిన రిషి..వసుధారకి వరుస మెసేజెస్ చేస్తుంటాడు.ఏం కావాలి అని అడిగితే మీకు నచ్చింది తీసుకోండి.. మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది. ఏంటి నాకే వదిలేసింది జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి అనుకుంటాడు రిషి. మరోవైపు రిషిని నిన్ను పక్కపక్కన చూస్తుంటే సంతోషంగా ఉందంటుంది జగతి. అప్పుడు వసుధార మేడం మీ అబ్బాయి పక్కన ఉంటే ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాడో అర్థంకాక భయంగా ఉంటుందని అంటుంది. మరోవైపు గౌతమ్ కాలేజీ స్టాప్ స్టూడెంట్స్ అందరికీ ఫోన్ చేసి మన భోజనానికి రమ్మని చెబుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వచ్చి ధరణి పై సిరీయస్ అయ్యి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అందరికీ ఫోన్ చేసి చెప్పావా అని అడిగిన మహేంద్ర.. రిషి,వసు లని నువ్వే చూసుకోవాలి వదినగారు ఏదో ఒకటి అంటుంటారని అంటాడు. సరే అని హామీ ఇస్తాడు గౌతమ్.
Also Read: వసు కోసం రిషి షాపింగ్, వనభోజనాల్లో రచ్చ చేసేందుకు స్కెచ్ వేసిన దేవయాని!
మరొకవైపు ధరణి వసుధార భోజనానికి సిద్ధం చేస్తుంటారు. అప్పుడు రిషి గిఫ్ట్ తీసుకువచ్చి వసుధార కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతా భోజనానికి కూర్చుంటారు..నీకోసం కొత్త శారీ ఎదురుచూస్తోంది రూమ్ లో అని మెసేజ్ ఇస్తాడు రిషి. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని చాటింగ్ చేస్తారు. ఇంతలో వచ్చిన దేవయాని ఏంటి వసుధార వన భోజనానికి ప్లాన్స్ ఏంటి అని అడిగితే..థాంక్స్ మేడం అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు సార్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి సార్ అని రిషికి చెబుతుంది. అప్పుడు రిషి అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. దేవయానిని వనభోజనానికి రానివ్వకుండా చేసేందుకు గౌతమ్.. కావాలనే హాట్ బాక్స్ దేవయాని కాళ్లమీద పడేలా చేస్తాడు. ఆ తర్వాత దేవయాని కాలు నొప్పితో అల్లాడుతూ ఉంటే మీరంతా వెళ్లండి నేను పెద్దమ్మ దగ్గరే ఉంటాను అంటాడు రిషి. అప్పుడు అదేంటి రిషి మినిస్టర్ సార్ నేను తప్పకుండా రమ్మని చెప్పారు నువ్వు వెళ్ళు అని అంటాడు ఫణీంద్ర. నువ్వు వెళ్లకపోతే ఎలా..నేను కూడా ఓపిక చేసుకుని వస్తాను అంటుంది దేవాయని. అప్పుడు మీరు వద్దుపెద్దమ్మా అనేసి... సరే నేను కూడా వెళ్తాను అంటాడు రిషి. ఆ తర్వాత గౌతమ్ పక్కకు వెళ్లి నవ్వుకుంటూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు. గౌతమూ ఏంటిది అని మహేంద్ర నవ్వుతూ అడుగితే.. కంగారులో హాట్ బాక్సుకి చేయి తగిలిందని అబద్ధం చెప్పి అక్కడ నుంచి పంపిస్తాడు గౌతమ్.
Also Read: కార్తీక్ దగ్గర నిజం దాచిన డాక్టర్ చారుశీల, సౌందర్య దగ్గరకు బయలుదేరిన దీప-కార్తీక్
రిషి తెచ్చిన చీర కట్టుకుని అద్దం ముందు మురిసిపోతూ ఉంటుంది వసుధార...శారీలో నేను ఎలా ఉన్నాను అనుకుంటూ రిషి తయారవుతుండగా అక్కడికి వెళ్లి రిషి కళ్ళు మూస్తుంది. ఎవరు అని అడిగితే..ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటుంది వసు. నేను కాలేజీ ఎండీని తెలుసా అంటే..కాలేజీలో ఎండీ ఇక్కడ కాదుకదా అంటుంది. ఇంతకీ కళ్లు ఎందుకు మూశారో అని రిషి.. ఒకరు గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఎలా ఉందో చూడాలంట అంటుంది. వసుని చీరలో చూసిన రిషి అలాగే ఉండిపోతాడు. అందంగా ఉన్నావని రిషి చెప్పడంతో..వసు గులాబీ ఇచ్చి పెట్టమని సైగ చేస్తుంది.