గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 6th Update Today Episode 625)


జగతి-మహేంద్ర ఇంటికి తిరిగి రావడంతో రగిలిపోతుంది దేవయాని. మరోవైపు వాళ్లు గౌతమ్ దగ్గరే ఉన్నారని తెలిసి మరింత మండిపడుతుంది. ఆ తర్వాత జగతి దగ్గరకు వెళ్లిన దేవయాని సూటిపోటి మాటలంటుంది. రిషి బాధ్యత నీకెలాగూ పట్టదు.. నేనైనా చూసుకోవాలి కదా..వసుధార వాళ్ల అమ్మా నాన్నతో వసు పెళ్లి గురించి మాట్లాడివస్తాను ఆ వివరాలు ఇవ్వు అని అడుగుతుంది. సాధించడానికి వేరే దారి లేక వసుధార వాళ్ల ఊరి వివరాలు అడుగుతోంది..ఏవో కొత్త కుట్రలు చేయాలని ఆలోచిస్తోందని అనుకుంటుంది జగతి..మొత్తానికి రిషి..గౌతమ్ ని క్షమించాడు అది చాలు అనుకుంటుంది..


ఆ తర్వాత కిచెన్లోకి వెళ్లిన రిషి..వెనుతిరిగి వెళ్లిపోతుండగా ఏమైనా కావాలా అని అడుగుతుంది. టీ, కాఫీ, జ్యూస్ అని తడబడతాడు.. అది గమనించిన ధరణి..వసుధార ఇప్పుడే తన రూమ్ లోకి వెళ్లిందని చెబుతుంది. నేను వసుధారని అడగలేదే అని రిషి అన్నప్పటికీ నాకు తెలుసులే అని నవ్వుతుంది ధరణి. రిషి వెంటనే వసు రూమ్ కి వెళతాడు... గమనించని వసుధార.. డ్రెస్ ఐరెన్ చేసుకుంటూ.. రిషి కోపం గురించి ఏదేదో మాట్లాడుకుంటుంది.
వసుధార: జగతి మేడం, మహేంద్ర సార్ కి కోపం అస్సలు లేదు మరి రిషి సార్ కి కోపం ఎలా వచ్చిందో..వాళ్ల తాతగారికి కోపం ఉందేమో అదే రిషి సార్ కి వచ్చిందేమో..అయినా పర్వాలేదులే నేను కోపాన్ని కూడా భరిస్తాను.. వసుధార నీకు భయం లేకుండా పోతోంది..నేను రిషిని అని ఇమిటేట్ చేస్తూ వెనక్కు తిరుగుతుంది...అక్కడ రిషి ని చూసి షాక్ అవుతుంది..  చేతిలో ఐరెన్ బాక్స్ పట్టుకుని రిషితో వాదిస్తుంది.. ఐరెన్ బాక్స్ తగిలి చేయి కాలుతుంది. వసు కంగారు పడుతుంది. నాకున్న కోపానికి ఇది శిక్షా..కాల్చడం ఎందుకు, కంగారు పడడం ఎందుకని అంటాడు. నాకేం కాలేదులే వదిలెయ్ అని రిషి అన్నా వసు కంగారు పడిపోతుంది.. ఎప్పుడొచ్చారని అడిగితే..నువ్వు నన్ను తిట్టుకున్నప్పుడే వచ్చానంటాడు. కాసేపు టీజ్ చేస్తాడు రిషి.. గాయం మీకు నొప్పి నాకు అని వసు ఏమోషన్ అవడంతో బాధపడకు అని చెబుతాడు. కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు...


Also Read: కార్తీక్ దగ్గర నిజం దాచిన డాక్టర్ చారుశీల, సౌందర్య దగ్గరకు బయలుదేరిన దీప-కార్తీక్


మహేంద్రకి..మంత్రి నుంచి కాల్ వస్తుంది. యాక్సిడెంట్ విషయం తెలిసి బాధపడ్డాను..మీరు కోలుకున్నారా అని పరామర్శిస్తాడు. ఎప్పటిలానే వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా రావాలని పిలుస్తారు మంత్రి. ఆ తర్వాత వర్కౌట్స్ చేస్తూ గౌతమ్..రిషి కోపం పోవడం గురించి తలుచుకుని సంతోషిస్తాడు..రిషి గొప్పోడు అనుకుంటాడు. ఆ తర్వాత వన భోజనాల సంగతి అన్నయ్య ఫణీంద్రకు చెబుతాడు మహేంద్ర... అదే విషయం రిషికి కూడా చెబుతారు.. రిషి వెంటనే గతంలో వనభోజనాల సమయంలో వసుతో స్పెండ్ చేసిన విషయాలు గుర్తుచేసుకుంటాడు.  వసుధార కూడా జగతికి వనభోజనాల గురించి చెబుతూ...రిషితో కలసి చేసిన అల్లరి గుర్తుచేసుకుంటుంది. ఈ సారి కూడా మనంబాగా ఎంజాయ్ చేద్దాం అంటుంది వసుధార.. మనం అంటున్నావేంటని ఎంటరవుతుంది దేవయాని
దేవయాని: అసలే జగతికి ఆరోగ్యం బాలేదు..ఇలాంటప్పుడు బయటకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు..ఈసారికి జగతిని ఇక్కడే ఉంచేసి మనం వెళదాం 
వసు: మేడం బాగానే ఉన్నారు..తీసుకెళదాం
దేవయాని: ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి రిషి ఒప్పుకోడు,నేను కూడా ఒప్పుకోను
జగతి: అక్కయ్య చెప్పేది నిజమే..ఈ పరిస్థితుల్లో నేను రాలేను
వసు: మీరు రాకుండా వనభోజనాలు....
దేవయాని: జగతి రాకపోతే వనభోజనాలు ఆగిపోతాయా..ఈ ఒక్కసారికీ జగతి ఇంట్లో ఉంటుంది..


Also Read: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని


ఇదంతా విన్న మహేంద్ర-గౌతమ్.. మేడం రాకుండా ఎలా అని గౌతమ్ అంటే.. వదినగారు నిర్ణయించుకున్నారు జగతికి తోడుగా నేనుంటాను మీరు వెళ్లండి అంటాడు మహేంద్ర. అలా కుదరంటాడు గౌతమ్.. అయితే వదినగారు రిషి-వసుని ప్రశాంతంగా ఉండనివ్వరు ఏంటో నాకేం అర్థంకావడం లేదంటాడు మహేంద్ర.  ఆ తర్వాత జగతి దగ్గర కూర్చుని ఉంటుంది వసుధార.. రిషి నుంచి మెసేజ్ వస్తుంది.. మీరు కూడా రండి వనభోజనాలకు అని అడుగుతుంది. ఈ డ్రెస్ ఎలాఉందని వసు అడిగితే..నీకు అన్ని కలర్స్ బావుంటాయంటుంది జగతి. రిషి ఇంట్లో లేడా అని అడిగితే.. నాకోసం డ్రెస్ సెలెక్ట్ చేసేపనిలో బిజిగా ఉన్నారంటుంది వసుధార. ఏదీ నచ్చిందని చెప్పడం లేదేంటి అనుకుంటాడు రిషి...అటు వసుధార జగతిని అడిగితే.. మీ ఇద్దరి మధ్యా నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని టీజ్ చేస్తుంది.