కార్తీకదీపం ఫిబ్రవరి 25 శుక్రవారం ఎపిసోడ్
తాడికొండ వెళ్లొచ్చినప్పటి నుంచీ మీరు మారిపోయారంటుంది సౌందర్య. దీపూ గాడిని ఎప్పుడైనా ఓ గంట సేపు ఎత్తుకున్నారా , దీపూ గాడు మీకు తమ్ముడు అని సౌందర్య చెబుతుంటే...వీడే మాకు సొంత తమ్ముడు అని రిప్లై ఇస్తుంది హిమ. నిన్నటి ఎపిసోడ్ ఇక్కడే ముగిసి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడే ప్రారంభమైంది. దీప-సౌందర్య ఎంత చెప్పినా వీడికి ఫంక్షన్ చేద్దాం అని పట్టుబడతారు. నువ్వేం మాట్లాడవేంటి శౌర్య... నీకు తమ్ముడిపై ప్రేమ లేదా అని క్వశ్చన్ చేసిన హిమ కోపంగా ఆనంద్ ని తీసుకుని వెళ్లిపోతుంది. ఆనంద్ ని మా సొంత తమ్ముడు అని ఒప్పుకోపోతే మేం మళ్లీ తాడికొండ వెళ్లిపోతాం అని బెదిరిస్తుంది హిమ. ఈ దగ్గరవడం, ప్రేమలు పెంచుకోవడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో నీకు తెలియదు దీపా అని మనసులో అనుకుంటోంది సౌందర్య. అటు దీప కూడా తాడికొండ నుంచి వచ్చాక హిమ ఆలోచనలు, తీరు బాగా మారిపోయింది, ఒకప్పుడు హిమ సైలెంట్ గా ఉండేది-శౌర్య ఇబ్బంది పెట్టేది. ఇఫ్పుడు రివర్స్ అయ్యారంటుంది దీప. జీవితంలో పాఠాలు నేర్చుకున్నారని సౌందర్య అంటే మనం అనుకున్నదానికన్నా ఎక్కువే నేర్చుకున్నారంటుంది దీప.
Also Read: గౌతమ్ ముందు రిషిని బుక్ చేసిన వసుధార, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
హాస్పిటల్లో ఉన్న కార్తీక్ దగ్గరకు దొంగ ఏడుపుతో వస్తుంది మోనిత. ఎందుకు ఏడుస్తున్నావ్ మోనిత అని అడగవా అంటే..ప్రతి కన్నీళ్ల వెనుకా బాధే ఉండాలని లేదుగా అని రిప్లై ఇస్తాడు. అంటే నా బాధ నీకు కనిపించడం లేదా అంటుంది. హాస్పిటల్లో ఇదంతా ఏంటని అడిగితే....థ్యాంక్స్ కనీసం ఎందుకు ఏడుస్తున్నావ్ అని ఇన్ డైరెక్ట్ గా అడిగినందుకు అంటుంది. నీకోసం ఇంటికెళ్లాను అనాగనే...ఇంటికి ఎందుకు వెళ్లావ్, నీ బడ్డని వెతుకుతా అన్నాను కదా అంటే.. అనడం కాదు ఏదో ప్రయత్నం చేయాలి కదా అంటుంది. ఎవరినో తెచ్చుకుని ప్రేమ కురిపిస్తారు కానీ మన బిడ్డ గురించి ఆలోచించరేంటి అన్న మోనితతో...మా ఇంట్లో బిడ్డ గురించి నీకు అనవసరం నా ప్రయత్నాలు నేను చేస్తున్నా అంటాడు. వీడియో ఫుటేజ్ గురించి మా మమ్మీని అడిగాను ఆ సంగతేదో నీతోనే తేల్చుకోమన్నారు...సీసీ ఫుటేజ్ నీ దగ్గర ఉందికదా ఇవ్వు అంటాడు. ఈ వీడియో చూపిస్తే అక్కడున్నది నా బిడ్డే అని తెలిసిపోతుంది, నా ప్లాన్ అమలు చేయడం కుదరదు అనుకుంటూ ఆ వీడియో డిలీట్ అయిపోయిందని చెబుతుంది. నువ్వు తల్లిగా ఎంత సీరియస్ గా ఉన్నావో అర్థం అవుతోందంటూ క్లాస్ వేస్తాడు. నీ బాబుకి సంబంధించిన వీడియో నీ దగ్గర ఉండదు కానీ నేను వెతకాలా అని ప్రశ్నిస్తాడు. నేనొకటి అనుకుంటే మరొకటి జరుగుతోందనుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. నిన్ను వదిలించుకునేందుకు అయినా నీ బాబుని వెతుకుతా, నన్ను కలిసేందుకు అస్తమానం రావొద్దు, నా ఇంటివైపు అస్సలే రావొద్దు అని హెచ్చరిస్తాడు. ఈ రోజు నాకు గ్రహాలు అనుకూలించినట్టు లేదు అనుకుంటూ మోనిత వెళ్లిపోతుంది.
ఇంట్లో కూర్చున్న దీప-కార్తీక్ ఎవరి ఆలోచనల్లో వాళ్లుంటారు. డాక్టర్ బాబు తొందరపడ్డారు, బాబుని వెతికి ఇస్తానని మాటివ్వకుండా ఉండాల్సిందని దీప అనుకుంటే... నేను తొందరపడలేదు మోనిత గొడవ ముగిసిపోతుందనుకుంటే బాబుని వెతికివ్వడంలో తప్పులేదు అనుకుంటాడు. ఏంటి దీపా జరిగిందానికి బాధపడుతున్నావా అంటే జరగబోయే దానికి భయపడుతున్నాను అంటుంది. మళ్లీ మోనిత ఏం చేస్తుందో, ఎట్నుంచి ఏం ప్రమాదం తెస్తుందో అనే భయం వేస్తోంది అంటుంది. మోనిత పీడ వదిలిపోతే అందరం సంతోషంగా ఉంటాం కదా అని కార్తీక్ అంటే... అన్నీ సర్దుకుంటాయ్ టెన్షన్ పడకని చెబుతాడు. ఇదంతా విన్న సౌందర్య..చెప్పకుండా వెళ్లిపోయారు, మళ్లీ ఇంటికొచ్చారని సంబరపడేలోగా మరో సమస్య వచ్చింది, ఇందులోంచి బయటపడేదెలా అనుకుంటుంది సౌందర్య.
Also Read: ఆ నిజం దీపకి కూడా తెలిసిపోయింది, ఇక కార్తీక్-పిల్లలే మిగిలారు, కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
నీ కుటుంబంలో అందరూ విశాల హృదయం ఉన్నవారు, మంచి తనానికి బ్రాండ్ అంబాసిడర్లు, అందుకే ఎవరో తెలియని బిడ్డని తీసుకొచ్చి నీ బిడ్డగా చూస్తున్నారు, ప్రేమను పంచుతున్నారు. మన బిడ్డ కనిపించలేదని చెబితే పట్టించుకోవడం లేదు. దేవుడున్నాడు...అందుకే నా బిడ్డనే తిప్పి తిప్పి నీ దగ్గరకే చేర్చాడు. మన ఆనందరావుగారు తాత ఆనందరావుగారి ఒడికి చేరుకున్నారు ఇంతకన్నా జీవితంలో ఏం కావాలి, సగం విజయం సాధించాను కార్తీక్ , ఇప్పుడు అసలు కథ మొదలైంది, మోనిత ఆట మొదలైంది, నువ్వు మన బిడ్డకోసం వెతుకుతావు, మోనితని నీ జీవితంలోంచి దూరం చేయాలని వెతుకుతూనే ఉంటావ్...కొన్నాళ్లలోపు దొరకడు, అంతలో నా బిడ్డపై నీకు ప్రేమ పెరుగుతుంది అప్పుడు ఇంట్లో వాళ్లందరకీ షాక్ ఇస్తానంటుంది. అప్పుడు నేను ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాను నన్ను పొమ్మనలేవు, ఆనందరావుగారిని వదలుకోలేవు...అప్పుడు నేను అనుకున్నదే చేస్తా అనుకుంటుంది.
పిల్లలు ఆనంద్ మీద ప్రేమను పెంచుకున్నారు, రేపు ఏదైనా జరిగితే ఏం జరుగుతుందో అనకుంటుంది సౌందర్య. ఇంతలో దీప రావడంతో అప్పారావ్ వచ్చాడంట కదా అని అడిగితే... వచ్చి ఏవో ఇచ్చివెళ్లాడని చెబుతుంది. కోటేష్-శ్రీవల్లి ఫొటో చూసిన దీప...వీళ్లు బాబుతో ఫొటో కూడా దిగి కార్డు తెచ్చుకున్నారు, వీడిని డాక్టర్ ని చేయాలనుకున్నారని అనగానే సౌందర్య షాక్ అవుతుంది. మేం కూడా వీడితో ఓ ఫొటో దిగాలి అంటుంది దీప. అంతా మోనిత కొడుక్కి దగ్గరైపోతున్నారు, అసలు నిజం తెలిస్తే అంతా ఏమైపోతారో, మోనితకి తన కొడుకు ఇక్కడున్నాడని తెలిస్తే ఎలా ప్రవర్తిస్తుందో అని సౌందర్య బాధపడుతుంది. మరోవైపు హాస్పిటల్లో కార్తీక్ ...లక్ష్మణ్ ని పిలిచి మాట్లాడుతాడు. నువ్వు మోనిత బిడ్డని తీసుకెళ్లిన వాడిని చూశావా అంటే..లేదు సార్ ఎలాంటి ఆధారం ఇవ్వకుండా ఎళా వెతుకుతాం అందుకే వెతకలేదు అని చెబుతాడు లక్ష్మణ్. తాడి కొండ చుట్టుపక్కల వెతకమని నాకు డబ్బులిచ్చిందని కూడా లక్ష్మణ్ చెబుతాడు. మోనితకి నన్ను వెతకడంపై ఉన్న శ్రద్ధ, తన బాబుని వెతకడంపై లేదనుకున్న కార్తీక్..మోనిత పీడ ఎప్పుడు వదులుతుందో అనుకుంటాడు.
మరోవైపు దీప తాడికొండ నుంచి అప్పారావ్ తీసుకొచ్చిన కోటేష్-శ్రీవల్లి మీరు ఏ పుణ్యలోకాల్లో ఉన్నారో కానీ ఆనంద్ ని మీరు కోరుకున్నట్టే డాక్టర్ ని చేస్తాం అనుకుంటుంది దీప. మోనిత కారు నంబర్ రాసి నీకు దండాలమ్మా, నన్ను క్షమించమ్మా అని కోటేష్ రాసిన నంబర్ మళ్లీ చూస్తుంది...ఎసిపోడ్ ముగిసింది.
రేపటి (శనివారం) ఎపిసోడ్ లో
మోనిత కార్ నంబర్ చూసి దీపకు ఏదో గుర్తొస్తుంది. కోటేష్ డైరీలో ఈ నంబర్ ఎందుకు రాసి పెట్టుకున్నాడని ఆలోచనలో పడుతుంది. కారు క్లీన్ చేస్తున్న లక్ష్మణ్ ని చూసి ఎవరిది ఈ కారు అని అడుగుతుంది. మోనితది అని చెప్పడంతో షాక్ అవుతుంది. ఆ తర్వాత కానిస్టేబుల్ రత్నసీతను కలసి సీసీ ఫుటేజ్ చూసి షాక్ అవుతుంది. ఇన్నాళ్లూ మోనిత బిడ్డని మా దగ్గర ఉంచుకున్నామా అనుకుంటుంది.