Telangana Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తగ్గడంతో వేడి ప్రభావం చూపుతోంది. పొడి గాలులు వీచడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజామున, రాత్రులు చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి, ఉక్కుపోత అధికంగా ఉంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 25 డిగ్రీల మేర నమోదు కావడం వాతావరణంలో మార్పులను స్పష్టంగా సూచిస్తుంది.


ఏపీలో నైరుతి, దక్షిణ దిశల నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయి. వర్షాలు లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కానున్నాయి. వేటకు వెళ్లడానికి మత్స్యకారులకు ఏ ఇబ్బంది లేదు. అత్యల్పంగా జంగమేశ్వరపురం, బాపట్ల, నందిగామ, కళింగపట్నం, అమరావతి, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీలు చేరే అకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగానే పెరిగాయి. రాష్ట్రంలో పొడి గాలులు పెరగడం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత తప్పదు. రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నా, మధ్యాహ్నాలు మాత్రం వేడిగా ఉంటుంది.  ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో  కనిష్ట ఉష్ణోగ్రతలు 25కి చేరువలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే వాతావరణం పొడిగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో మాత్రం 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆదిలాబాద్ ఏజెన్సీలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇతర జిల్లాల్లో కనీసం 20 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.