గుప్పెడంత మనసు ఫిబ్రవరి 24 గురువారం ఎపిసోడ్
పొద్దున్నే ధరణి ఇంట్లో బట్టలు సర్దుతుంటుంది. వాటిలో జగతి చీర రావడంతో ఇది చిన్నత్తయ్య చీర అని ఆలోచనలో పడుతుంది. అది చూసిన దేవయాని అక్కడకు వెళ్లి ఈ చీర ఎవరిదో తెలుసా నీకు అంటే..చిన్నత్తయ్య గారిది మరిచిపోయినట్టున్నారు అంటుంది. తను మర్చిపోతే నువ్వు ఉతికి ఇస్త్రీ చేసి భద్రంగా దాచుతున్నావా, తన జ్ఞాపకాలు, వస్తువులు ఇంట్లో ఉండేందుకు వీల్లేదు, బయటకు తీసుకెళ్లి కాల్చెయ్ అంటుంది. చీరను కాల్చాలి, అలాగే తన జ్ఞాపకాలను కూడా కాల్చాలి అంటే..వద్దు అత్తయ్యగారు ఈ చీరను పంపిద్దాం అంటుంది. ఆ చీర బయట విసిరెయ్ , నేను వచ్చి అగ్గిపుల్ల అంటిస్తానంటుంది దేవయాని. మళ్లీ ఏదో ఆలోచనలో పడిన దేవయాని కాల్చనులే ఇటివ్వు అని లాక్కుని తీసుకెళ్లిపోతుంది. ఈ మధ్య పెద్దత్తయ్యగారు చాలా ఎక్కువ చేస్తున్నారు, తన అహంకారం ఎప్పుడు తగ్గుతుందో ఏమో అనుకుంటుంది ధరణి.
Also Read: ఆ నిజం దీపకి కూడా తెలిసిపోయింది, ఇక కార్తీక్-పిల్లలే మిగిలారు, కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
క్లాస్ రూమ్ లో నిద్రావస్థలో ఉంటుంది వసుధార. క్లాస్ రూమ్ లోకి వచ్చిన రిషి నోట్ బుక్ అడుగుతాడు, క్లాస్ లో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు అడుగుతారో అనుకుంటూ తీసుకెళ్లి ఇస్తుంది. ఏంటి డల్ గా ఉంది అని ఆలోచిస్తాడు రిషి. రిషి చెబుతుండగా వసు నిద్రపోతుంటుంది. అది చూసిన రిషి వసుధార అని గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి లేచి నిలబడుతుంది. ఏమైంది, నీ ప్రాబ్లెమ్ ఏంటి అని అడిగితే మీరే నా ప్రాబ్లెమ్ సార్ అనేస్తుంది. షాక్ అయిన రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అసలు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదనుకుంటుంది. కట్ చేస్తే జగతి-మహేంద్ర రిషి రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటారు. షార్ట్ ఫిలిం చూసేందుకు ఇన్వైట్ చేయడానకి మనిద్దరం వెళదామా అని మహేంద్ర అంటే నేను ఒక్కదాన్నే వెళతాలు, లేదంటే మీరు వెళ్లండని అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ నేను మీతో రావొచ్చా అని అడుగుతాడు. మహేంద్ర సార్ ని అడుగు గౌతమ్ అనగానే.. అక్కడకు ఎవరెవరం వెళ్లాలో మేమే డిసైడ్ చేసుకోలేదు నువ్వడిగితే ఏం చెప్పగలను అని రిప్లై ఇస్తాడు మహేంద్ర.
ఇంతలో అక్కడకు వచ్చిన రిషి ఏమంటున్నావ్ రా అంటాడు. కాలేజీలో పూల మొక్కలు బావున్నాయి ఇంకా కొన్ని వెరైటీస్ తెప్పిద్దాం అని చెబుతున్నా అంటే..నువ్వు చెప్పేది నిజం అని నేను అనుకోవడం లేదంటూనే ఏం డాడ్ అని అడుగుతాడు. మహేంద్ర నసుగుతుండగా జగతి అసలు విషయం చెప్పేస్తుంది. అసలు నీకెందుకురా ఇవన్నీ అని క్లాస్ వేస్తాడు రిషి. మినిస్టర్ గారి దగ్గరకు ఎవరు వెళ్లాలనేది నేను ప్లాన్ చేసి చెబుతానంటాడు రిషి. సరే సార్ అన్న జగతి..షార్ట్ ఫిలిం ఎడిటింగ్ అయిపోయింది చూస్తారా అని జగతి అడిగితే నేను-వసుధార వెళ్లి చూసొస్తాం మేడం మీరు వేరే పనులు చూసుకోండి అని చెబుతాడు. థ్యాంక్స్ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు జగతి-మహేంద్ర. అక్కడే ఉన్న గౌతమ్ ఇప్పుడు రిషి-వసుధార ఎడిటింగ్ స్టూడియోకి వెళ్లి చూసొస్తారా నేను మిస్సవుతానా అనుకుంటాడు.
Also Read: మీరే నా ప్రాబ్లెమ్ సర్ అని రిషికి క్లాస్ రూమ్ లో షాకిచ్చిన వసుధార, గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
క్లాస్ రూమ్ లోంచి బయటకు వచ్చిన వసుధారని ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు గౌతమ్. తన స్టైల్లో మాట్లాడుకుంటూ వెళ్లిపోతుంటాడు ..వసు అయోమయంగా చూస్తుంటుంది. పొద్దున్న నీతో మాట్లాడుదాం అనుకుంటే రిషి ఛాన్స్ ఇవ్వలేదన్న గౌతమ్..ఇప్పుడు మనం కలసి బయటకు వెళుతున్నాం అంటాడు గౌతమ్. ఎక్కడికి వెళుతున్నాం అని వసుధార అడిగితే నువ్వు-నేను-రిషి కలసి ఓ చోటుకి వెళుతున్నాం ఆ విషయం ముందే నాకు తెలుసు అంటాడు గౌతమ్. నేను కారు దగ్గర వెయిట్ చేస్తాను అక్కడకు రా అనేసి వెళ్లిపోతాడు. రిషి వచ్చాడంటే నిన్ను-నన్ను చూసి నన్ను దూరం పంపిస్తాడు నేను కారు దగ్గరే కాపలా కాస్తుంటా అనేసి వెళ్లిపోతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి..నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఇప్పుడే గౌతమ్ సార్ కనిపించి మనం ఎక్కడికో వెళుతున్నాం అన్నారు..ఎక్కడికి సార్ అని అడుగుతుంది వసుధార. నువ్వొక రెండు నిముషాలు ఆగి బైక్ పార్కింగ్ దగ్గర ఉండు నేనొస్తాను అని చెబుతాడు. ఇప్పుడు గౌతమ్ ని తప్పించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఇంతలో ఓ స్టూడెంట్ ని పిలిచి నా కార్ దగ్గర గౌతమ్ అనే వ్యక్తి ఉంటాడు...ఆయన దగ్గరకు వెళ్లి అని ఏదో చెబుతాడు రిషి.
కట్ చేస్తే కారు దగ్గర నిల్చున్న గౌతమ్..నన్ను తప్పించుకుందామని రిషి చాలా ప్లాన్స్ వేస్తుంటాడు , ఈ రోజు నన్ను ఎలా వదిలించుకుంటాడో చూస్తాను అనుకుంటాడు. ఇంతలో రిషి పంపించిన స్టూడెంట్ గౌతమ్ దగ్గరకు వెళ్లి సార్ మీ బైక్ అక్కడ అడ్డంగా ఉంది, ఓసారి కీస్ ఇస్తే నేను బైక్ ని తీసి పక్కనపెట్టి వస్తాను అని అడుగుతాడు. నువ్వు మంచోడిలా ఉన్నావ్ అనుకుంటూ బండి తాళాలు ఇస్తాడు గౌతమ్. కాసేపటి తర్వాత సార్ ఇదిగోండి అంటూ తాళాలు గౌతమ్ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. రిషి ఇంకా రాలేదేంటని ఆలోచించిన గౌతమ్...అప్పుడు చేతిలో ఉన్న కార్ కీస్ చూసుకుంటాడు. నేను బైక్ కీస్ ఇస్తే నా చేతిలోకి కార్ కీ వచ్చిందేంటి, ఇదెలా సాధ్యం అనుకుంటూ..నా బైక్ కీ తీసుకెళితే రిషి, కార్ కీ ఎలా వచ్చిందని గౌతమ్ ఆలోచనలో పడతాడు. రిషి-వసుధార ఇద్దరూ బైక్ పై వెళుతుంటే చూసి..నా బైక్ లాగే ఉందే అనుకుంటాడు. అయినప్పటికీ కారు దగ్గర నుంచి కదల్లేక అలాగే ఆగిపోతాడు. ఇక్కడేం చేస్తున్నావ్ గౌతమ్ అని మహేంద్ర అడిగితే రిషి కోసం వెయిట్ చేస్తున్నా అంటాడు. రిషి రాడులే నేను నిన్ను డ్రాప్ చేస్తా పద అని మహేంద్ర చెబుతాడు. సడెన్ గా ఈ బైక్ ఏంటి సార్ అంటుంది వసుధార. నాకు నడపాలని అనిపించింది ఏం నీకు ఇబ్బందా అంటాడు రిషి. లేదు సార్ అంటుంది. అయినా గౌతమ్ సార్ ని అలా వదిలేసి అన్న వసుతో వాడు వద్దనే కదా బైక్ లో వచ్చింది అని రిప్లై ఇస్తాడు.
రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
ఇంతలో గౌతమ్ నుంచి కాల్ వస్తుంది. రిషి కట్ చేస్తాడు, వెంటనే వసుధారకి కాల్ చేస్తాడు...ఆన్సర్ చేయొద్దని రిషి చెప్పేలోగా వసుధార కాల్ లిఫ్ట్ చేస్తుంది. అక్కడ మీ ఎండీగారు ఉన్నారా అని అడిగితే..స్పీకర్ ఆన్ చేయి అంటాడు రిషి. నీకు కాల్ చేస్తే ఎందుకు కట్ చేశావు రా అని గౌతమ్ అంటే.. ఇందాక కాల్ వచ్చింది కదా సార్ వేస్ట్ కాల్ అని చెప్పారు అంటుంది వసుధార. మొత్తం విన్న గౌతమ్ కాల్ కట్ చేసి వేస్ట్ కాల్ అంటావా అని క్వశ్చన్ చేస్తాడు. రిషి తలపట్టుకుంటాడు...