గుప్పెడంత మనసు ఫిబ్రవరి 23 బుధవారం ఎపిసోడ్


షార్ట్ ఫిలిం విషయంలో ఇక్కడ రిషి, అక్కడ వసు ఇద్దరూ తెగ సంబరపడిపోతారు. రిషి ఏదేదో మాట్లాడేస్తుంటే ఆ సంతోషం చూసి మహేంద్ర మురిసిపోతాడు. ఆ హడావుడిలో పడి ధరణి వాటర్ బాటిల్ సంగతి మరిచిపోయి అమ్మో అనుకుంటూ తీసుకెళ్లి దేవయానికి ఇస్తుంది. బయట రిషి గొంతు ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు ఏంటి సంగతి అంటే..అది మనకు సంబంధం లేని విషయం లెండి అని అంటుంది. కాలేజీ మనది కాదా మనకు ఎందుకు సంబంధం లేదని ఎప్పటిలా క్లాస్ వేస్తుంది దేవయాని. మరోవైపు వసుధారకు నిద్రపట్టదు.  రిషితో కలసి దిగిన సెల్ఫీ చూస్తూ..నాకు రిషి సార్ పదే పదే ఎందుకు గుర్తొస్తున్నారు అనుకుంటూ... వద్దంటూనే ఎందుకు ఆలోచిస్తున్నాను...ఎందుకంటే జగతి మేడం వాళ్ల అబ్బాయి అయినందుకా, సీరియస్ సింహం అయినందుగా, జెంటిల్మెన్ అయినందుకు కూడా కావొచ్చు...ఇప్పుడు రిషి సార్ ఏం చేస్తుంటారబ్బా అనుకుంటుంది. కట్ చేస్తే అక్కడ రిషి కూడా వసు ఇప్పుడేం చేస్తోందో అనుకుంటూ  అమ్మాయిగారి ఊహల్లో మునిగితేలుతుంటాడు. కాల్ చేద్దామా అనుకుంటూ...వద్దులే ఈ మధ్య ఒకరికి కాల్ చేస్తే ఇంకొకరు తీస్తున్నారు వద్దులే అనుకుంటూనే మెసేజ్ చేస్తాడు. ఇంతలో రిషి నుంచి మెసేజ్ రావడంతో వసు ఆనందంతో కూడిన ఆశ్చర్యంలో ఉంటుంది. కాసేపు చాటింగ్ చేసుకుంటారు. 


 ఏం చేస్తున్నావ్ అంటే..మీ గురించే ఆలోచిస్తున్నా సార్ అని రిప్లై ఇస్తుంది. నా గురించి ఏం ఆలోచిస్తున్నావ్ అంటే ఓ మెసేజ్ లో చెప్పేలేను, మళ్లీ కలిసినప్పుడు చెబుతా అంటుంది.  షార్ట్ ఫిలిం షూటింగ్ విషయంలో మీరు హ్యపీనా అంటే..మరి నువ్వో అంటే..ఫుల్ హ్యాపీ అనుకుంటారిద్దరూ. ఈ విషయంలో నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అని మెసేజ్ చేస్తాడు. స్పెషల్ థ్యాంక్స్ అంటే ఏంటబ్బా అని ఆలోచించిన వసుధార ( గతంలో హగ్ చేసుకున్న విషయం గుర్తుచేసుకుంటుంది). అమ్మో ...ఈ స్పెషల్ థ్యాంక్సులు వద్దు సూచన క్లిక్ అయితే చాలు అని వసు మెసేజ్ కి అవుతుంది లే అని రిప్లై ఇస్తాడు. కొందరు గంటలు గంటలు చాటింగ్ చేస్తారు వాళ్లకి ఏం టాపిక్స్ ఉంటాయో అనుకుంటూ గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తే...అప్పుడే గుడ్ నైట్ ఏంటి కాసేపు చాటింగ్ చేయొచ్చు కదా అనుకుంటుంది. ఈ రోజు నాకేమైంది అస్సలు నిద్రరావడం లేదనుకుంటుది. 


Also Read: ఆపరేషన్ బ్లడ్ రిలేషన్, మోనిత కొడుకు చుట్టూ తిరుగుతున్న కథ, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
వసుధారా వసుధారా అన్న రిషి పిలిచినట్టు అనిపించి సడెన్ గా నిద్రలోంచి లేచి కూర్చుంటుంది. ఏమైంది నాకీరోజు రిషి సార్ పిలిచినట్టు అనిపించింది అనుకుంటూ లేస్తుంది. చేతిలోకి నెమలీక తీసుకుని ఏం చేస్తున్నారు రిషి సార్ అనగానే... అక్కడ రిషి సెడెన్ గా లేచి కూర్చుంటాడు. మా డాడ్ సంతోషం కోసం మా ఇంటికి  రావాలి అని పిలిచినప్పటి నుంచీ జగతి విషయంలో జరిగినవన్నీ గుర్తుకువస్తాయి. నాకసలు ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి..వసుధారకి ఫోన్ చేసి మాట్లాడాలా...ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి ఏంటో మనసు బాలేదు ఏదోలా ఉందని చెప్పాలా , ఈ టైమ్ లో కాల్ చేసి మనసు బాలేదని చెప్పడం బావుండదేమో. వసుధారకి జ్ఞాపకాలు పంచాలి కానీ బాధలు కాదు అనకుంటూ నిద్రపోతాడు.


వసు టిఫిన్ రెడీ అని జగతి పిలిస్తే వస్తున్నా మేడం అంటుంది వసుధార. ఇంతలో ఫోన్ రింగవడంతో మినిస్టర్ గారి పీఏ చేస్తున్నారని చెప్పి తెచ్చి ఇస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన మినిస్టర్ గారు చూస్తారంట, డేట్-టైమ్ మెయిల్ చేస్తారా అంటే సరే అంటుంది. మినిస్టర్ గారు ప్రివ్యూ చూస్తారట అని క్లారిటీ ఇస్తుంది.  ఒకపని మనం చేస్తే వేరేవాళ్ల జడ్జిమెంట్ కోసం తాపత్రయ పడొద్దు, ఒకరి మెప్పుకోసం ఎదురుచూడడం మంచిది కాదు అది అలవాటుగా మారిపోతుందని చెబుతుంది జగతి. షార్ట్ ఫిలిం బావుంది కదా మేడం అంటే...మనపని మనకు ఆనందాన్ని ఇస్తుందంటే అది సక్సెస్ అయినట్టే కదా అంటుంది. మీరేంటి మేడం అన్నీ మనసులోనే దాచుకుంటారు అంటే..అలవాటైపోయింది వసుధార, జీవితం అన్నింటినీ నేర్పిస్తుంది కదా అని రిప్లై ఇస్తుంది.


Also Read:  శ్రీవారు అన్న వసు పిలుపుతో మైమరిచిన రిషి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పేందుకు ప్లాన్స్, గుప్పెడంతమనసు మంగళవారం ఎపిసోడ్
వసు, పుష్ప మాట్లాడుకుంటూ వెళుతుంటే రిషి కార్ వస్తుంది. నువ్వెళ్లు పుష్ప నేను వస్తాను అంటుంది. వసు తనని చూసి పిలవాని రిషి, తనే పిలవాలని వసు అనుకుంటారు. కాసేపటికి ఇద్దరూ ఒకేసారి చూసుకుంటారు. ఆగుతున్నా అలా వళ్లిపోతున్నారేంటి అని వసు...పిలుస్తుంది అనుకున్నా పిలవలేదేంటని రిషి అనుకుంటూ ఒకర్నొకరు పిలుచుకుంటారు. పక్కనుంచి వెళ్తుంటే కనిపించలేదా అంటే కనిపించారు,కానీ మీరు వెళ్లిపోతుంటే మీకేమైనా పనుందేమో అని పిలవలేదు అంటుంది. అంటే వెనక్కి తిరిగానంటే నాకేం పనిలేదని ఫిక్సైపోతావా అంటే అలా ఏం కాదంటుంది. కళ్లెందుకు ఎర్రగా ఉన్నాయి రాత్రి నిద్రపోలేదా అంటే..వసు ఏదో చెప్పేలోగా నేను మీ గౌతమ్ అంటూ వచ్చేస్తాడు. వసుధార నువ్వు క్లాస్ కి వెళ్లు అని చెబుతాడు రిషి. నేను రాగానే వెళ్లిపొమ్మని చెబుతావేంటి అని గౌతమ్ హర్ట్ అవుతాడు. తనని ఎందుకు భయపెడతావ్ అని గౌతమ్ అంటే.. భయం, భక్తి, గౌరవానికి తేడా ఉంటాయిలే నీకు తెలియదు అని కౌంటర్ ఇస్తాడు. మరోవైపు క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోతూ వసుధార వెనక్కి వంగి చూస్తుంది. ఇంతకీ నన్ను చూస్తోందా, రిషిని చూస్తోందా అనుకుంటాడు గౌతమ్. 


రేపటి (గురువారం) ఎపిసోడ్ లో
డల్ గా ఉంది నన్నేం మాట్లాడించకు అంటుంది వసుధార. నోట్ బుక్ ఇస్తావా అని రిషి అడుగుతాడు ఏంటి డల్ గా కనిపిస్తోంది అనుకుంటూ లెసన్ స్టార్ట్ చేస్తాడు. నిద్రపోతున్న వసుని గట్టిగా పిలిచి ఏంటి ప్రోబ్లెం అంటే... మీరే నా ప్రాబ్లెమ్ సార్ అని షాకిస్తుంది...