AP Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. పొడి గాలులు వీచడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రులు చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి, ఉక్కుపోత అధికంగా ఉంటున్నాయి. చాలా  ప్రాంతాలల్లో 20 డిగ్రీలకు పైగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం వాతావరణంలో మార్పులను సూచిస్తుంది. 


ఏపీలో నేడు సైతం నైరుతి, దక్షిణ దిశల నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. దాంతో ఏపీలో మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయి. వర్ష సూచన లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతున్నాయి. వేటకు వెళ్లడానికి మత్స్యకారులకు ఏ ఇబ్బంది లేదు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్లలో 20.7 డిగ్రీలు, నందిగామలో 21.4 డిగ్రీలు, కళింగపట్నంలో 20.6 డిగ్రీలు, అమరావతిలో 21.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 23.8 డిగ్రీల, నెల్లూరులో 24.5 డిగ్రీలు, ఒంగోలులో 24.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో  కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి చేరువలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 18.9 డిగ్రీలు, నంద్యాలలో 22.4 డిగ్రీలు, తిరుపతిలో 20.5 డిగ్రీలు, కర్నూలులో 22.1 డిగ్రీలు, కడపలో 24.2 డిగ్రీల మేర రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


తెలంగాణ మొదలైన వేడి..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే వాతావరణం పొడిగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ చలి గాలులతో ఇబ్బందులు తప్పవన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ ఏజెన్సీలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇతర జిల్లాల్లో కనీసం 15 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 20 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17.9 డిగ్రీలు, రంగారెడ్డిలో 17 డిగ్రీలు, మెదక్‌లో 18.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలోనూ 14.6 డిగ్రీల మేర రెండో కనిష్ట ఉష్ణోగ్రత ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


Also Read: Gautham Reddy Son Krishna Arjun Reddy: నాన్నతో నేనొక్కడినే ఉండాలి, మీరంతా బయటికెళ్లండి ! గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి 


Also Read: CBI Vs AP Police : వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్‌ కేసు ! తర్వాత ఏంటి ?