హేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఇటీవల ‘కళావతి’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ పాటకు మహేష్ బాబు వేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట, అదే డ్యాన్స్. ‘సర్కారు వారి పాట’ సినిమాకు తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే శేఖర్ మాస్టర్ ‘కళావతి’ సాంగ్‌కు నృత్య దర్శకత్వం చేశారు. మరి, వీరిద్దరు కలిసి అదే పాటకు డ్యాన్స్ చేస్తే.. భలే బాగుంటుంది కదూ. అయితే, ఈ కింది వీడియో చూసేయండి. తమన్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘సిగ్గుతో నన్ను నేనే..’’ అంటూ శేఖర్ మాస్టర్‌కు థాంక్స్ చెప్పాడు. 




#KalaavathiChallenge పేరుతో ఈ పాట ఇప్పుడు వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇటీవల మహేష్ బాబు కూతురు సితార ఈ పాటకు తండ్రి స్టైల్ లో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. అంతేకాదు.. #KalaavathiChallenge అంటూ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరింది. 'కళావతి' పాటకు రీల్స్ చేసి #KalaavathiChallenge పేరుతో వీడియోలను షేర్ చేయాలని కోరింది. అందులో తనకు నచ్చిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకుంటానని చెప్పింది. ఈ ఛాలెంజ్‌ను ‘సర్కారు వారి పాట’ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా స్వీకరించింది. ‘కళావతి’ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది.