Japan Movie Making Video: తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. కార్తీ మూవీ వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆవారా’ తెలుగులో ఓ రేంజిలో సక్సెస్ అందుకున్నాడు కార్తీ.  తమిళంలోని ‘పయ్యా’ అనే పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు బాగా నచ్చేసింది. ఏకంగా 100 డేస్ ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత కార్తీకి తెలుగులో అభిమానులు పెరిగిపోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతుంది.


‘జపాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ


కార్తీ తాజాగా నటించిన సినిమా ‘జపాన్’. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజమురుగన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుక‌గా ఈ చిత్రం నవంబరు 10న  విడుదల అయ్యింది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కార్తీ వేషం, యాస, నటన అన్నీ బాగున్నాయని సినీ అభిమానులు చెప్తున్నారు.


ఆకట్టుకుంటున్న ‘జపాన్’ మేకింగ్ వీడియో  


‘జపాన్’ విడుదలకు ముందు చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.  ‘ది జర్నీ ఆఫ్ గోల్డెన్ స్టార్ జపాన్’ పేరుతో అభిమానుల ముందుకు తెచ్చింది. ఈ వీడియో చూస్తుంటే కార్తీ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డట్లు అర్థం అవుతుంది. ఆయన మేకోవర్ కోసం మేకప్ ఆర్టిస్టులు చాలా కష్టపడ్డారు. సినిమా కోసం వేసిన సెట్, షూటింగ్ కోసం మూవీ యూనిట్ పడిన శ్రమ అంతటినీ ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ‘జపాన్’ మూవీని డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 



Read Also: రష్మిక వేసుకునే డ్రెస్సులు, ఎక్స్‌పోజింగ్ కంటే పెద్దగా ఏమీ లేదు - ‘డీప్‌ఫేక్’పై మాధవీ లత కామెంట్స్


వరుస హిట్లతో ఫుల్ జోష్


కార్తీ ఇటీవల ‘విరుమాన్‌’, ‘సర్థార్‌’, ‘పొన్నియిన్‌సెల్వన్‌ 1’, ‘పొన్నియిన్‌సెల్వన్‌ 2’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ అద్భుత విజయాలను అందుకున్నాయి. కార్తీ కెరీర్ లో 25వ సినిమాగా ‘జపాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జపాన్‌’ మూవీ తనకు చాలా స్పెషల్ అని వెల్లడించారు. దర్శకుడు రాజుమురుగన్‌ స్టోరీ, డైలాగ్స్ తనకు చాలా నచ్చాయని చెప్పారు. ఈ చిత్రంలో తాను కనిపించనని, తన క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందని చెప్పారు.  






Read Also: వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అదే, వైవాహిక జీవితంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial