విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ యూనివర్సిటీ పేరు మార్చేందుకు గానూ గతంలోనే మంత్రివర్గ కూడా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది రాజకీయనాయకులు, టీడీపీ సపోర్టర్స్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే  ఈ విషయంపై చంద్రబాబు నాయుడు, పురందరేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాజాగా కళ్యాణ్ రామ్ ఈ విషయంపై ఓ సీరియస్ నోట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 


''1986లో విజయవాడలో మెడికల్‌ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్‌ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది మరియు లెక్కలేనన్ని వైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అని పేరు మార్చబడింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకుపైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు..'' అంటూ సోషల్ మీడియో పోస్ట్ పెట్టాడు.






నటుడు నారా రోహిత్ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. 'రాజకీయ కారణాలతో మహనీయుల పేర్లు మార్చటం హుందాతనం కాదు. NTR స్థాయిలో మరొకరు లేరు,రారు. ఆయన పేరు మార్చాలి అంటే తిరిగి ఆయన పేరే పెట్టాలి. ఇలాంటి పనులతో మీ స్థాయి దిగజారుతోంది తప్పితే ఆయన స్థాయికి ఏమి కాదు. జోహార్ NTR!' అంటూ రాసుకొచ్చారు. 


Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 



Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!


అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పెట్టాలనే ఆలోచన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుది. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూనివర్సిటీలను పరిశీలించి, వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా 1986 నవంబరు 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరుతో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు. పాతికేళ్లుగా ఆ పేరు అంతే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎవరూ పేరు గురించి ఆలోచించలేదు. పేరు మార్చాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు.


ఎన్టీఆర్ ఆ యూనివర్సిటీని స్థాపించారు కాబట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 జనవరి 8న ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. మళ్లీ 2006 జనవరి 8న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేసింది. మొత్తానికి ఎన్టీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.