Kalki 2898 AD Collections: భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా రిలీజైన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగినట్టుగానే తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ వెండితెరపై విజువల్ వండర్ క్రియేట్ చేశాడనే ప్రశంసలు కురిశాయి. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ సినిమాను తెరకెక్కించారని అభినందించారు. అదే సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అయితే, కల్కి తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!
ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్లు వసూళు
'కల్కి 2898 ఏడీ' సినిమా తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 95 కోట్లు వసూళు చేసినట్టు అంచనా. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 4వ సినిమాగా కల్కి రికార్డు సాధించింది. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో వరుసగా మూడు స్థానాల్లో ‘బాహుబలి 2‘, ‘RRR’, ‘KGF 2’ ఉండగా, నాలుగో స్థానంలో 'కల్కి 2898 ఏడీ' నిలిచింది. భారత్ లో అన్ని భాషల్లో కలిపి 'కల్కి 2898 ఏడీ' సినిమా రూ. 95 కోట్ల నెట్ సాధించగా, రూ. 115 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టు సమాచారం. ఇక ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ. 65 కోట్లు వసూలు చేయగా.. హిందీలో రూ. 23 కోట్లు సాధించినట్టు సినీ విశ్లేషకుల అంచన వేస్తున్నారు. తమిళంలో 4, మలయాళంలో 2.2 వసూళు చేసింది. ఓవర్సీస్ లో దాదాపు రూ. 65 కోట్లు సాధించింది. మొత్తంగా ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 180 కోట్లు అందుకుందని. అయితే ఈ లెక్కలపై కల్కి టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'కల్కి 2898 ఏడీ' కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్!
'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అటు ఈ సినిమా కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిన్న సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఆడియెన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్ గా మారిందంటున్నాయి.
'కల్కి 2898 ఏడీ' సినిమాలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
Also Read: తొలి రోజే 'కల్కి' హవా - అక్కడ ఆర్‌ఆర్‌ఆర్, సలార్ చిత్రాల రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్