Satyabhama Today Episode అభిమానంతో ముద్దు పెట్టాను అని ఏమీ అనొద్దని అర్థం చేసుకోమని క్రిష్ సత్యని అంటాడు. దానికి సత్య అది అభిమానమో, ప్రేమో గాడిద గుడ్డో పక్కన పెట్టు ఇంట్లో అందరి ముందు పరువు పోయినట్లు అయింది కదా అని అంటుంది. అందరూ ఎగతాళిగా నవ్వారు. ఇప్పుడు నేను వాళ్లకి మొఖం ఎలా చూపించాలి. 


సత్య: ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండాలి. మూడు నెలలు స్నేహంగా ఉండాలి. ప్రశాంతంగా కలిసి ఉంటే ప్రశాంతంగా విడిపోవచ్చు. నీ ఎమోషన్స్‌ని మాటల వరకే కంట్రోల్ చేసుకో. నిన్ను ఇంకా నమ్ముతున్నాను కాబట్టి ఈ గొడవ ఇక్కడితో వదిలేస్తున్నా. ప్లీజ్ క్రిష్ మన మధ్య గొడవలు వద్దు. ఎవరి గౌరవాన్ని వాళ్లు కాపాడుకుందాం.
క్రిష్: సత్య వెళ్లిపోయిన తర్వాత.. నిజంగా నా మీద ప్రేమ లేకపోయి ఉంటే నేను చేసిన పనికి చెంప లాగి పగలగొట్టేదానివి. తగ్గి మాట్లాడుతున్నావ్ అంటే అర్థం అవుతుంది. ఏదో ఒక రోజు నీ మనసులోకి నన్ను రానిస్తావ్ అని.. 


హర్ష: నాన్న ఇంకోసారి ఆలోచించండి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కానీ కాళీని కంట్రోల్ చేయడం కష్టం.
సంధ్య: పోనీ సమస్యని ఒక్కసారి బావగారికి చెప్తే.
విశ్వనాథం: ఎట్టి పరిస్థితుల్లో అల్లుడుగారికి ఈ విషయం చెప్పకూడదు. చూశారు కదా మొన్న మొండిగా ఎలా చేశారో.
హర్ష: అవును ఒక సమస్య కోసం మరో సమస్య తెచ్చుకోకూడదు.
శాంతమ్మ: కానీ ఆ రౌడీని చితక్కొట్టే దమ్ము తనకి మాత్రమే ఉంది. 
విశాలాక్షి: అయినా మన గొడవల్లోకి అల్లుడు గారిని లాగొద్దు వాళ్లని అలా ప్రశాంతంగా ఉండనిద్దాం.
హర్ష: నాన్న నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంతే.
విశ్వనాథం: వద్దు హర్ష మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని రెచ్చగొట్టినట్లే. వాడు అడిగిన ఇరవై లక్షలు ఇవ్వడమే. డబ్బు కోసం ఏదో ఒకటి చేస్తా. నందిని రావడంతో విశాలాక్షి భర్తకి సైగ చేస్తుంది. 
నందిని: నేను రాకముందు అందరూ ఏదో మాట్టాడుతున్నారు. నేను రాగానే ఆపేశారు. ఎందుకు అలా. నేను వినకూడని విషయమా. లేదంటే నా మీద చాడీలు చెప్పుకుంటున్నారా. మాట్లాడరేంటి. ఇది నా ఇళ్లు అంటారు. నేను అంటే ఇష్టం ప్రేమ అంటారు. కానీ నన్ను మాత్రం పరాయిదానిలా చూస్తారు. మీరు మీరే ముచ్చట్లు ఆడుకోండి. నేను పోతా.
 
సత్య వంట చేస్తుంటుంది. రేణుక అక్కడికి వచ్చి నన్ను ఎవరూ ఏ పని చేయించడం లేదు అని అంటుంది. ఇంతలో సత్యకి ఫోన్ వస్తే రేణుకని కూర కలపమని ఫోన్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో భైరవి అక్కడికి వచ్చి సత్య ఏం కూర చేస్తాన్నావ్ అంటుంది. రేణుకని అక్కడ చూసి అమ్మో అమ్మో నా కొంపలు ముంచేలా ఉన్నావే అంటుంది.


భైరవి: నా మొగుడి దగ్గర నాకు వాతలు పెట్టించేలా ఉన్నావే. హాయిగా కాలిమీద కాలు వేసుకొని కూర్చొ మంటే నన్ను ఇలా కాల్చుకొని తింటున్నావ్ ఏంటే. ఏది సత్య.
సత్య: అత్తయ్య నా ఫోన్ రింగ్ అయితే వెళ్లాను.
భైరవి: ఫోన్ రింగ్ అవ్వడం కాదు పిడుగు పడినా నువ్వు వంట ఇంటి నుంచి కదలడానికి వీల్లేదు. నువ్వు ముందు బయటకు నడవ్వే. నాకు వారసుడి గండం రాసిపెట్టనట్లుంది. నీకు తొమ్మిది నిండేలోపు నాకు నూరేళ్లు నిండేలా ఉన్నాయి. పద.. అని దగ్గరుండి రేణుకని భైరవి తీసుకెళ్తుంది. 


ఇంతలో క్రిష్ అక్కడికి వస్తాడు. సత్యని చూసి నవ్వుకుంటాడు. వంట గదికి ఎందుకు వచ్చావ్ అని సత్య అడుగుతుంది. తన తల్లి పంపించి హెల్ప్ చేయమని చెప్పిందని అంటాడు. పని చెప్పు అని అంటాడు. దాంతో సత్య క్రిష్‌ని కూరగాయలు కట్ చేయమని అంటుంది. బెండకాయలు పట్టుకొని క్రిష్ మనకు పీకలు కోయడం వచ్చు కానీ కాయలు కోయడం రాదు అనుకుంటాడు. క్రిష్ బెండకాయలు కట్ చేయడం  చూసి సత్య నవ్వుతుంది. దాంతో క్రిష్ కొత్తగా ట్రే చేయాలి అనుకుంటాడు. కూరగాయలు కట్ చేస్తూ సత్యను చూస్తుంటాడు. గతంలో సత్య వేలు కట్ అయితే క్రిష్ వెళ్లి చేయి నోటిలో పెట్టుకున్న సీన్ గుర్తొచ్చి సత్య కూడా అలా చేస్తుందేమో అని వేలు తెగినట్లు నటిస్తాడు. సత్య చూసి చూడనట్లు వదిలేస్తుంది.



క్రిష్: ఏయ్ నీకు రుణం తీర్చుకోవడం కూడా తెలీదా. అప్పుడు ఒకసారి నీ వేలు కట్ అయినప్పుడు నేను ఏం చేశానో గుర్తుందా. మరి ఇప్పుడు నా వైపు కూడా చూడవేంటి.
సత్య: నీ వేషాలు నాకు తెలుసు కాబట్టి. 
భైరవి: క్రిష్ నోట్లో టమాటా పెట్టుకొని సత్యని చూస్తూ కూరగాయలు కట్ చేస్తుంటే భైరవి ఇంకో టమాటా తీసుకొని క్రిష్‌ని కొడుతుంది. పాతికేళ్ల సంది ఏ దినం అయినా ఇట్లా వంటింటికి వచ్చావారా నాకు సాయం చేశావారా. పెళ్లాం కష్టపడుతుంటే చూడలేక ప్రేమ పొంగుకొచ్చిందా.  
క్రిష్: హలో నువ్వు టమాటాతో కొట్టాల్సింది నన్ను కాదు బాపుని. నీకు సాయం చేయాల్సింది నేను కాదు నీ మొగుడు.
భైరవి: నిన్నూ.. చూస్తున్నారా చూస్తున్నా.. పెళ్లి అయినప్పుటి నుంచి నీ వేషాలు చూస్తున్నా. ఈసారి నా దగ్గరికి వచ్చి చికెన్ సూప్ చేయ్, మటన్ కర్రీ చేయ్ అంటావ్ కదా అప్పుడు చెప్తా నీ సంగతి. సత్య నవ్వుకుంటుంది. 
క్రిష్: నీ నవ్వు మంచిగా అనిపించింది ఇంకొక్కసారి నవ్వవా. మొగుడి లెక్కకాదు దోస్త్ లెక్క. 


ఇంతలో సంధ్య వస్తుంది. మా అక్కతో మాట్లాడాలి అంటుంది. క్రిష్ బయటకు వెళ్తాడు. సంధ్య సత్యని బయటకు తీసుకెళ్తుంది. మరోవైపు విశ్వనాథం, హర్షలు సేటుని కలుస్తారు. ఇరవై లక్షలు అడుగుతారు. ఇంటిని తాకట్టు పెడతామంటే దానికి సేటు పాత పది లక్షలు ఈ ఇరవై లక్షలు మొత్తానికి ఇళ్లు ఇచ్చేయ్ మంటాడు. హర్ష వద్దని అంటాడు. విశ్వనాథం మాత్రం సేల్ అగ్రిమెంట్‌కి ఒప్పుకుంటాడు. ఇక క్రిష్ సేటు ఇంటి దగ్గర విశ్వనాథం, హర్షని చూస్తాడు. వీళ్లేంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటాడు. అప్పు చేశాడా ఏంటో అని సేటునే అడిగి తెలుసుకుందామని వెళ్తాడు. ఇరవై లక్షలు కావాలని అడిగారు అని అంటే అంత డబ్బు ఎందుకు అని క్రిష్ ఆలోచిస్తాడు. 



సంధ్య: ఇంట్లో జరుగుతున్న కొన్ని విషయాలు నాన్న నీకు తెలియకూడదు అన్నారు. కానీ నేను నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను అక్క. అందుకే మొదటి సారి నాన్న మాటను కాదు అని ఇక్కడికి వచ్చాను అక్క.
సత్య: ఏంటి సంధ్య నువ్వు చెప్పేది నాన్న నాకు తెలియకూడదు అనుకోవడం ఏంటి. నువ్వు నాన్న వాళ్లకి తెలీకుండా ఇక్కడికి రావడం ఏంటి. అసలు ఏం జరిగింది. సమస్య ఏంటో చెప్పు.
సంధ్య: నాన్న మన ఇంటిని అమ్మేయాలి అని నిర్ణయించుకున్నారు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రేవతి లవర్ కిరణ్ ఎంట్రీ.. పెళ్లి వాళ్ల ముందు ప్రేమాయణం చెప్తూ మహా బ్యాచ్‌కి ట్విస్ట్!