Jurassic World Dominion | ‘జురాసిక్ పార్క్’, ‘జురాసిక్ వరల్డ్’ సీరిస్‌లను ఇష్టపడే సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్. ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ (Jurassic World Dominion) చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ Universal Pictures (యూనివర్శల్ పిక్చర్స్) రిలీజ్ డేట్ ప్రకటిస్తూ తెలుగు, తమిళ్, హిందీ ట్రైలర్లను విడుదల చేసింది. 

Continues below advertisement


జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్ (Jurassic World: Fallen Kingdom) చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలోనూ క్రిస్ ప్రాట్,
బ్రైస్ డల్లాస్ హోవార్డ్, రాఫె స్పాల్, టోబి జోన్స్, టెడ్ లెవిన్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డైనోసార్లతో కలిసి జీవించాలనే నిర్ణయం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటారనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. గాలి, నీరు, నింగి, మంచు.. ఇలా వదలకుండా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో.. థ్రిల్లింగ్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. అయితే, ఈ సారి మరింత పెద్ద డైనోసార్లను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ చిత్రానికి కోలిన్ ట్రెవోరో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే.. స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జురాసిక్ పార్క్’ చిత్రంలో డాక్టర్ స్టాలర్, అలన్ గ్రాంట్, మల్కోలామ్‌ పాత్రలు పోషించిన అలనాటి తారలు మళ్లీ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వీరితోనే ఈ సీరిస్‌ను కూడా ముగించే ప్లాన్‌లో ఉన్నారు. అంటే.. ‘జురాసిక్’ చిత్రాల్లో ఇదే ఇక ఆఖరిది కానుంది. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


Jurassic World Dominion ఉత్కంఠభరిత తెలుగు ట్రైలర్‌ను ఇక్కడ చూసేయండి: