ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ వస్తే శనివారం ఎందుకు విడుదలయ్యారు ? ఒక రోజు ఎందుకు అదనంగా జైల్లో గడపాల్సి వచ్చింది..? శుక్రవారం ఎందుకు విడుదల కాలేకపోయారు..? ఇవన్నీ చాలా మందికి ఉన్న సందేహాలు. వీటికి సమాధానంగా మాజీ హీరోయిన్ జూహిచావ్లా పేరు వినిపిస్తోంది. ఆమె కారణంగానే ఆర్యన్ ఖాన్ ఒక రోజు ఎక్కువగా జైల్లో గడపాల్సి వచ్చిందంట. 


Also Read:  ఆర్యన్ ఖాన్‌ విడుదలపై మంత్రి ఆసక్తికర ట్వీట్.. 'పిక్చర్ అబీ బాకీ హై మేరా దోస్త్'!
 
ఇలా కోర్టు బెయిల్ ఇస్తే అలా విడుదలైపోతూంటారు చాలామంది. ముఖ్యంగా  వీఐపీలు అయితే అంతే విడుదలవుతూంటారు. ఎందుకంటే వారికి చాలా మంది సహాయకులు ఉంటారు. న్యాయవాదులు అండగా ఉంటారు.  కోర్టు బెయిల్ ప్రకటించిన వెంటనే ఎలాంటి పూచికత్తులు సమర్పించారు.. ఎవరి ష్యూరిటీలు ఇవ్వాలనేదానిపై చకచకా పనులు పూర్తి చేసి జైలు అధికారులకు సమర్పించి.. తమకు కావాల్సిన వారిని బెయిల్‌పై విడుదల చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఆర్యన్ ఖాన్ విషయంలో అలాంటి ఏర్పాట్లు అవసరానికి మించి ఉన్నా ఆయన జైల్ నుంచి బయటకు రావడానికి ఒక్క రోజు ఆలస్యం అయింది. 


Also Read : బెయిల్‌పై విడుదలైన ఆర్యన్ ఖాన్ !


గురువారం హైకోర్టు బెయిల్  ఇచ్చింది.  పధ్నాలుగు షరతులు పెట్టింది. అలాగే పూచికత్తుల గురించీ చెప్పింది. అప్పటికే షారుఖ్ లీగల్ టీం మొత్తం రెడీ చేసుకుంది. కానీ కోర్టు సమయం ముగిసే సరికి ఉత్తర్వులు రాలేదు. దీంతో గురువారం బెయిల్ ఉత్తర్వులు చేతికి అందలేదు. అ ఉత్తర్వులు చేతికి అందితే.. పూచికత్తులు సమర్పించి ఆర్యన్‌ను విడుదల చేయించుకుని తీసుకెళ్లేవారే. కానీ కోర్టు సమయం ముగిసిపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం వరకూ బెయిల్ ఉత్తర్వులు చేతికి అందలేదు. అలా అందిన వెంటనే పత్రాలు.. పూచికత్తులుతీసుకుని షారుఖ్ లీగల్ టీం.. ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లింది.


Also Read : న్యాయవాద బృందంతో షారుక్ ఖాన్ ఫొటో... ఆర్యన్ ఖాన్ బెయిల్ తర్వాత తొలిసారి... సత్యమేవ జయతే అని న్యాయవాది మానేషిండే ట్వీట్


అక్కడ జైలు అధికారులు అన్ని ప రిశీలించి ఇక విడుదల ఉత్తర్వులు ఇస్తారు అనుకున్న సమయంలో పత్రాల్లో ఒకటి మిస్సయినట్లుగా గుర్తించారు. ఆ ఒక్కటి ఏమిటంటే జూహిచావ్లా ఫోటో.  పూచీకత్తు ఇచ్చిన వారిలో జూహిచావ్లా కూడా ఒకరు. ఆమె సంతకాలు చేశారు కానీ ఆమె పాస్ పోర్టు ఫోటోను అతికించడం మర్చిపోయారు. దీంతో ఆ ఫోటో కోసం ప్రయత్నించడంతో ఈ సారి జైలు సమయం ముగిసిపోయింది. దీంతో  ఆర్యన్ విడుదల శనివారానికి వాయిదా పడింది. షారుఖ్, జూహి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. కోల్‌కతా ఐపీఎల్ టీంలో వీరు భాగస్వాములు కూడా. కానీ పాస్‌పోర్ట్ ఫోటో మర్చిపోవడం వల్ల తనకు సంబంధం లేకుండా జూహిచావ్లా ఆర్యన్ ఒక రోజు ఎక్కువగా జైల్లో ఉండటానికి కారణం అయ్యారు. 


Also Read : ఆర్యన్- అనన్యా మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ లీక్.. ఈ మెసేజ్‌లు చదివారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి