Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్లాస్ పీకారు. ఈ మధ్య సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో సినిమా అప్‌డేట్ కావాలంటూ ఫ్యాన్స్ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NTR30 సినిమా అప్‌డేట్ కోసం కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా ‘అమిగోస్’ ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. యాంకర్ సుమ ఎన్టీఆర్ 30 మూవీ అప్‌డేట్ ప్రస్తావన తెచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఆమె వైపు కోపంగా చూశారు. ‘‘వాళ్లు అడక్కపోయినా.. మీరు చెప్పేసేలా ఉన్నారు’’ అని సుమతో అన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ఒక్కోసారి సినిమాలు చేసేటప్పుడు చెప్పటానికి ఏమీ ఉండదు. ప్రతి గంటా ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, మీ ఉత్సాహం అర్థం అవుతుంది. కానీ వీటి వల్ల ఒక్కోసారి నిర్మాతలు, దర్శకుల మీద మనం చాలా ఒత్తిడి పడుతుంది. అభిమానులకు ఏదో ఒకటి చెప్పాలని వారు టెన్షన్ పడతారు. అలా అని ఏదో ఒకటి చెప్పడం కూడా కష్టం. ఒకవేళ అలా చెప్తే మీరు ఊరుకుంటారా? నచ్చకపోతే మళ్లీ వాళ్లనే తిడతారు’’.
‘‘ఇది కేవలం నా ఒక్కడికే కాదు. చాలా మంది ఇదే ఒత్తిడికి లోనవుతున్నారు. అప్‌డేట్ అనేది ఏమైనా ఉంటే ఇంట్లో ఉండే మా భార్య కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకంటే మీరందరూ నాకు చాలా ముఖ్యం. నేను చెప్తుంది కేవలం నా గురించే కాదు. నాలాగే ఉన్న ఇంకా చాలామంది హీరోల తరఫున చెబుతున్నాను. అప్‌డేట్ ఉంది అంటేనే చెప్తాం. అదిరిపోయే అప్‌డేట్ ఉంటేనే మీకు చెప్తాం.’’
‘‘అంతేకానీ మీరు ఎక్కడెక్కడో చదివిన వార్తల్ని మనసులోకి తీసుకుని ఆ ఒత్తిడిన నిర్మాతల మీద పెట్టకండి. ఎందుకంటే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ పటంలో నిలిచింది. సినిమాలు తీయాలి అంటే మనం దాని మీద చాలా ఫోకస్ చేయాలి. అద్భుతమైన రిజల్ట్ వచ్చేలా తీయాలి అని నా కోరిక. దయచేసి ప్రొడ్యూసర్లను మీరు ఒత్తిడి చేయకండి.’’
‘‘ఒక మంచి సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఫిబ్రవరిలోనే ఈ సినిమా ఓపెనింగ్ చేస్తాం. మార్చి 20వ తేదీ లేదా ఆలోపే షూటింగ్ మొదలు పెడతాం. 2024 ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తాం.’’ అని చెప్పారు.
దీంతో అమిగోస్ చిత్ర బృందానికి కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకున్నారు. ‘అమిగోస్’ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘‘ఎన్నో రాత్రులొస్తాయి’’ కానీ రీమేక్ ఇప్పటికే పెద్ద హిట్ అయింది.
అమిగోస్' నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే అమ్మేశారని తెలిసింది. వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం. 'బింబిసార' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ, శాటిలైట్ ఛానల్స్ 'అమిగోస్'ను తీసుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ హక్కులను తొమ్మిది కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ... భారీ విజయాలు అందుకుంది. అంతే కాదు... ఆ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా లాభాలు అందుకున్నాయి.
Also Read : పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్