యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) ఒకప్పుడు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అంటే కొడాలి నాని ఎంతో అభిమానం ఉండేది. టీడీపీ పార్టీ నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు కొడాలి నాని. ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో అతడికి స్నేహం కుదిరింది. ఎన్టీఆర్ సినిమాల విషయంలో కూడా కొడాలి నాని ఇన్వాల్వ్మెంట్ ఉండేది. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)తో కూడా ఎన్టీఆర్ క్లోజ్ గా మెలిగేవారు.
అప్పుడప్పుడు నాని, వంశీ కలిసి ఎన్టీఆర్ సినిమా సెట్స్ లో సందడి చేసేవారు. వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ హీరోగా సినిమాలను కూడా నిర్మించారు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ తో విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత కొడాలి నాని చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ను తక్కువ చేస్తూ మాట్లాడారు. ఎన్టీఆర్ తనకు స్నేహితుడు కాదని అన్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై కూడా కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కొడాలి నాని, వల్లభనేని వంశీతో కలిసి ఉన్న ఎన్టీఆర్ ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఎన్టీఆర్.. కొడాలి నానిపై కాలేసి మరీ కూర్చున్నారు. పక్కనే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. ఈ ఫొటోను బట్టి వీరంతా ఎంత క్లోజ్ గా ఉండేవారో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఫొటోను ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందంటున్నారు కానీ ఇప్పుడు అక్టోబర్ కి వాయిదా పడినట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.
Prashanth Neel On NTR 31: ఎన్టీఆర్‌తో సినిమా గురించి చెప్పమని ఇటీవల ప్రశాంత్ నీల్(Prashanth neel) ని అడిగితే అడిగితే... ''ఏం చెప్పాలి? కథ చెప్పాలా? ఆ సినిమా షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని ప్రశాంత్ నీల్ తెలిపారు.
వెట్రిమారన్ దర్శకత్వంలో...
కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఇద్దరూ కలిసి పని చేయడం ఖాయమని వినబడుతోంది.
Also Read: 'విక్రమ్ వేద' టీజర్ - మక్కీకి మక్కీ దించేశారుగా!
Also Read: 'లైగర్' పరిస్థితి నార్త్ ఇండియాలో ఎలా ఉందంటే?