టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు విజయ్ అండ్ టీమ్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. అయితే మెయిన్ ఫోకస్ తెలుగు, హిందీ భాషల మీదే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి భారీ క్రేజ్ కనిపిస్తోంది. పెద్ద హీరోల రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయమనిపిస్తుంది. విజయ్ సినిమాలకు తెలుగు క్రేజ్ ఉండడం మాములు విషయమే. అయితే 'లైగర్'ను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తూ అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. విజయ్ ఎక్కడికి వెళ్లినా జనాలు అతడికి బ్రహ్మరథం పడుతున్నారు.
నార్త్ ఇండియాలో విజయ్ క్రేజ్ ఏమేరకు పని చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అందులోనూ ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ఓ వర్గం పిలుపు ఇవ్వడంతో ఆ ప్రభావం గురించి చర్చించుకున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే మాత్రం 'లైగర్' పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదనిపిస్తుంది. ముంబై, ఢిల్లీ ఇలా మెయిన్ సిటీస్ లో బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం అక్కడి సూపర్ స్టార్స్ నటించిన పెద్ద పెద్ద సినిమాలకు కూడా జనాలేమీ రావడం లేదు.
అన్ని సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గానే ఉన్నాయి. హిందీలో 'పుష్ప', 'కార్తికేయ' సినిమాలకు కూడా రిలీజ్ కు ముందు సరైన బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్దగా జరగలేదు. రిలీజ్ తరువాత మాత్రం మౌత్ టాక్ తో బాగుండడంతో మంచి కలెక్షన్స్ సాధించాయి. 'లైగర్' సినిమా విషయంలో కూడా ఇలా జరుగుతుందేమో చూడాలి!
Liger movie to restart 5 shows trend: 'లైగర్' సినిమాకి మళ్లీ ఐదు షోలు పడే ఛాన్స్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు ఈ సినిమాను ఐదు షోలు చొప్పున రన్ చేసుకోవడానికి అనుమతులు కోరబోతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ ఐదు షోలకు అనుమతి దొరికేలానే ఉంది. అయితే థియేటర్లలో రీజనబుల్ రేట్లు పెడితేనే మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మల్టీప్లెక్స్ లో రూ.275కి బదులు రూ.200, సింగిల్ స్క్రీన్స్ లో రూ.150 చొప్పున టికెట్స్ అమ్మితే మాత్రం సినిమాకి మంచి రీచ్ ఉంటుంది. టాక్ బాగుంటే లాంగ్ రన్ కూడా ఉంటుంది. మరి టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి
Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ