యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, కల్యాణ్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్’. ఇందులో రామ్‌ నితిన్‌,  సంగీత్‌ శోభన్‌, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితారా, ఫ్యార్చూన్‌ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూత్ ఫుల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఆటకట్టుకుంటున్న 'ఫ్రౌడ్ సే సింగిల్...' సాంగ్ ప్రోమో


తాజాగా ‘మ్యాడ్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. 'ప్రౌడ్ సే సింగిల్...' అంటూ సాగే పాటకు సంబంధించిన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “సింగిల్ గా ఉండు మామా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? సింపుల్ గా ఉన్న లైఫ్ ని కాంప్లికేట్ చేయకు.. మామా.. ఫ్రౌడ్ సే బోలో ఐయామ్ సింగిల్..  ఛాన్సే దొరికినా అవకు మింగిల్.. లైఫ్ లో ఇదే కదా బెస్ట్ యాంగిల్” అంటూ సాగుతూ అలరిస్తోంది. కాలేజీ హాస్టల్ పరిసరాల్లో చిత్రీకరించిన ఈ పాట యూత్ ను ఫిదా చేస్తోంది. ఈ పూర్తి పాటను సెప్టెంబర్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 



సినిమాపై అంచనాలు పెంచిన ‘మ్యాడ్’ టీజ‌ర్


ఇక ఇప్పటికే విడుదలైన ‘మ్యాడ్’ మూవీ టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. టీజర్ మొత్తం  కాలేజ్‌ చుట్టూనే తిరుగుతుంది. కాలేజీలో గ్యాంగులు, సీనియర్ల ర్యాగింగ్, ప్రేమలు, కొట్లాటలు అన్నింటినీ ఇందులో చూపించారు. సుమారు నిమిషమున్నర ఉన్న టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో నిండిపోయింది. ఇందులో యువకులు చేసే అల్లరి మామూలుగా లేదు. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో ముగ్గురు యువకుల కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  లవ్, రొమాన్స్, ఎంటర్ టైన్మెంట్ కలిసిన ఈ టీజ‌ర్ సినిమాపై అంచనాలను పెంచింది. చాలా రోజుల తర్వాత కాలేజీ బ్యాగ్రాఫ్ లో సినిమా అలరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  


అనుదీప్ స్పెషల్ రోల్ చేయబోతున్నారా?  


ఇక ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన  టీజర్ లో ఆయన కూడా కనిపించారు. ఇక ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ ఉందంటే, నవ్వుల పువ్వులు పూయాల్సిందేనని ప్రేక్షకులు భావిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో యూత్ ను ఆకట్టుకునే చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకు కాలేజీ బ్యాగ్రాఫ్ లో వచ్చిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.  ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారు లోకం’, ‘సై’ సహా పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమా కూడా యూత్ ను ఓ రేంజిలో ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ వెల్లడించనున్నారు.   


Read Also: ‘పుష్ప 2’ కొత్త పోస్టర్ - బన్నీ చిటికెన వేలు వెనుక అంత కథ ఉందా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial