నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్‌ను సైతం ఆకట్టుకోవడంతో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ 'జెర్సీ'కి కూడా దర్శకత్వం వహించారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ తో భారీ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ 'జెర్సీ' రీమేక్ లో కూడా నటించారు. నిజానికి ఈ సినిమాను గతేడాది డిసెంబర్ 31న విడుదల చేయాలనుకున్నారు. దానికి తగ్గట్లే అప్పట్లో సినిమా ట్రైలర్ ను వదిలారు. అచ్చం తెలుగు సినిమా ట్రైలర్ మాదిరి మక్కీకి మక్కి దించేశారు.
అయితే పాండమిక్ కారణంగా సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దీంతో మరో కొత్త ట్రైలర్ ను వదిలారు. ఇందులో సినిమాలో కీలక సన్నివేశాలను చూపించారు. దర్శకుడు గౌతమ్ రిస్క్ తీసుకోకుండా.. తెలుగులో తీసినట్లుగానే హిందీలో కూడా తీశారనిపిస్తోంది. అయితే ట్రైన్ దగ్గర హీరో అరిచే సీన్ లో నానిని చూసిన తరువాత షాహిద్ ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపించింది.
ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తం 47 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తిచేశామని షాహిద్ అప్పట్లో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మృనాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ కూడా నటించారు. సాచెట్, పరంపర సంగీతం అందించారు.
Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్
Also Read: ప్రభాస్ 'ఊ' అంటాడా? 'ఊ ఊ' అంటాడా?