సాన్యా మల్హోత్ర. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, అమీర్ ఖాన్ కూతురిగా నటించి ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే అద్భుత గుర్తింపు తెచ్చుకుది. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. తాజాగా ‘జవాన్’ సినిమాలో కనిపించింది. డాక్టర్ పాత్రలో చక్కటి నటన కనబర్చింది. ఈ సినిమాతో మరోసారి బాగా క్రేజ్ సంపాదించుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, పలు కీలక విషయాలను వెల్లడించింది.
ఆ సమస్యతో చాలా ఇబ్బంది పడ్డా- సాన్యా
చాలా కాలంగా ఇంపోస్టర్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు సాన్యా తెలిపింది. దీని కారణంగా తనతో తాను ఆత్మ న్యూనతకు గురవుతున్నట్లు వెల్లడించింది. తన నటన పట్ల ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నా, బాగా చేయలేదేమోనని తనకు అనుమానం కలుగుతుందని చెప్పింది. తాను చేసే పని తనకు నచ్చేది కాదన్నారు. ‘బదాయ్ హో’ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డా, తాను బాగా నటించలేదని ఫీలయ్యానని తెలిపింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నట్లు తెలిపింది.
అనుకోకుండా ‘దంగల్’ అవకాశం
ఢిల్లీ నుంచి ముంబైకి మారిన సమయంలోనూ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సాన్యా వివరించింది. "నేను ఢిల్లీ నుంచి ముంబైకి మారినప్పుడు, బాలీవుడ్‌లో రాణించాలంటే 10 నుంచి 15 సంవత్సాల సమయం పడుతుందని చాలా మంది అన్నారు. కానీ, కొద్ది రోజుల్లోనే ‘దంగల్’ సినిమా కోసం నితేష్ తివారీ నుంచి కాల్ వచ్చింది. నేను ఎప్పుడూ నా కష్టాన్ని నమ్ముకుంటాను. టాలెంట్ ను నమ్ముకుంటాను. మీరు కూడా మిమ్మల్ని నమ్ముకోండి” అని చెప్పింది.
ఢిల్లీతో పోల్చితే ముంబై సేఫ్
మహిళల రక్షణ విషయంలో ఢిల్లీతో పోలిస్తే ముంబై బెస్ట్ అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసింది సాన్యా. ‘‘నాది ఢిల్లీ. నేను అక్కడే పుట్టి పెరిగాను. కానీ, ముంబైలో సేఫ్ గా ఫీలవుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధి చెందిందో? లేదో? తెలియదు కానీ, అక్కడ మహిళలకు మాత్రం భద్రత లేదు” అని అప్పట్లో హాట్ కామెంట్స్ చేసింది. అటు కొంత మంది సినీ దర్శకుడు తనతో వ్యహరించిన తీరు ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పారు. ‘దంగల్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాన్యా ‘బదాయ్ హో’, ‘ఫొటోగ్రాఫ్’, ‘మీనాక్షి సుందరేశ్వర్’ ‘లవ్ హాస్టల్’ ‘హిట్’ సహా పలు సినిమాల్లో నటించింది. తదితర సినిమాల్లో నటించారు. సాన్యా మల్హోత్రా చివరిసారిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’లో కనిపించింది. ఇక భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితకథ ఆధారంగా రూపొందించబడిన ‘సామ్ బహదూర్’లో కనిపించబోతోంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, ఫాతిమా సనా షేక్ కూడా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది. అటు మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ హిందీ రీమేక్ లోనూ ఆమె నటిస్తోంది.
Read Also: రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial