లక్షపత్రి పూజ చెయ్యమని జ్ఞానంబ మల్లికకి చెప్తుంది. చికిత పూజ చేస్తే తనని పట్టుకుని మమ అనుకుంటాను పూజ చెయ్యమని బతిమలాడుతుంది. అది విని గోవిందరాజులు తనకి కౌంటర్ వేస్తాడు. నువ్వు చేసిన పనులకి దోషాలు పోవాలంటే పూజ చేయాలని మీ అత్తయ్యగారు దగ్గరుండి మరి చేయించమని చెప్పారని గోవిందరాజులు మల్లిక పక్కనే కూర్చుంటాడు. తనతో బలవంతంగా పూజ చేయిస్తాడు. తన భార్య మనసు మార్చమని వేడుకుంటూ రామా చేతిలో కర్పూరం వెలుగించుకుని దేవుడి ముందు నిలబడతాడు. అది చూసి జానకి పరుగున వచ్చి చేతిలోని కర్పూరం విసిరికొట్టి ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతుంది.


రామా: భార్య మనసు మార్చమని దేవుడిని వేడుకుంటున్నా


జానకి: నేను తీసుకున్న నిర్ణయం తప్పేమో అని ఒకటికి పది సార్లు ఆలోచించాను కానీ నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపించింది


రామా: జానకి తండ్రి ఇచ్చిన పెన్ చూపిస్తాడు. ఆఖరి చూపుల్లో ఆయన చేతిలో నుంచి జారిపోయిన ఈ పెన్ను నా చేతిలో ఎందుకు పడిందో అర్థం కాలేదు కానీ ఈరోజు అర్థం అయ్యింది ఆయన ఇచ్చింది పెన్ను మాత్రమే కాదు ఆయన కన్న కల కూడా. ఈ పెన్నుతో ఐపీఎస్ పరీక్షలు రాయలన్నది ఆయన కల అది తీర్చడం మీ ధర్మం, మీ అమ్మగారితో మీ కల గురించి చెప్పిన కల మర్చిపోయారా. మీరు చదవాలి ఐపీఎస్ అయి అందరి కల నెరవేర్చాలి


Also Read: సామ్రాట్ ని దొంగలాగా పరుగులు పెట్టించిన తులసి- క్షమించమని కన్నీటితో వేడుకున్న అనసూయ


జానకి: లేదు నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. తప్పు చేసింది భర్త అయినా సరే ఎదురు తిరిగి పోరాడాలి అనుకుంటేనే ఐపీఎస్ అవ్వాలి లేదంటే ఏదో ఒకటి వదులుకోవాలి. బంధాన్ని కుటుంబాన్ని త్యాగం చేయాలంటే ఇక్కడే ఆగిపోవాలి. నేను ఐపీఎస్ అయితే అందరి కల నిజం అవుతుంది కానీ సొసైటీకి న్యాయం చేయకపోతే చట్టానికి ద్రోహం చేసినట్టే. అందుకే నాకు కుటుంబం చాలు మీ భార్యగా ఉంటాను మీరు ఏం చెప్పినా చేస్తాను


రామా: కుటుంబం చూసుకుంటు ఉద్యోగాలు చేయడం లేదా ఇందాక పోలీస్ మేడమ్ చేస్తున్నారు కదా


జానకి: ఐపీఎస్ చదవలెను.. కానీ మీ భార్యగా ఏం చెప్పినా చేస్తాను


రామా; అయితే చెయ్యండి నా భార్య అవ్వాలని నేను కోరుకుంటున్నా ఇది నా కల, నా భార్యని ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలని అనుకుంటున్నా.. మీరు భర్త కోసం ఏమైనా చేస్తాను అని చెప్పింది నిజమే అయితే మీ భర్త కల నెరవేర్చండి అని పెన్ను తీసి జానకి చేతిలో పెట్టి నిర్ణయం తనకే వదిలేస్తాడు


హాస్పిటల్ లో మాధురి పరిస్థితి క్రిటికల్ గానే ఉందని డాక్టర్ తన తల్లిదండ్రులకి చెప్తుంది. అది విని వాళ్ళు చాలా బాధపడతారు. జెస్సి అఖిల్ కి కెరీర్ మీద దృష్టి పెట్టమని చెప్తుంది. అవి విన్నట్టు నటించిన అఖిల్ మనసులో మాత్రం తిట్టుకుంటాడు. రామా జానకి కోసం వెతుకుతూ ఉంటాడు. జానకి తులసి కోట దగ్గర ఆకాశ దీపం పెడుతూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. రామా వచ్చి ఎదురుగా నిలబడతాడు. గుళ్ళో చెప్పిన దానికి ఏ సమాధానం రాలేదు రేపటి నుంచి క్లాసులకి వెళ్ళడానికి మీరు ఒప్పుకున్నట్లేనా అని అడుగుతాడు. మీ కోరిక సరైందే కానీ ఒక క్లారిటీ కావాలని జానకి అంటుంది.


Also Read: యష్ మీద తనకున్న ప్రేమ బయటపెట్టిన వేద- కొడుకు మీద కోపంతో ఊగిపోతున్న మాలిని


జానకి: రేపు ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం వస్తే భార్యగా మీ మాట వినాలా ఒక పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చెయ్యాలా, ఇప్పటిలాగా అప్పుడు జరిగితే మీరు ఏం మాట్లాడుతారో నేను ఏం పోగొట్టుకుంటానో కూడా తెలియదు. ఇప్పుడు నేను ఎలా ఉండాలో చెప్పండి. నిజాయితీ గల ఇల్లాలిగా ఉండాలా బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ గా ఉండాలా ఆలోచించి మీరే చెప్పండి


రామా: ఇదేంటి ఇలా అన్నారు బాగా చదువుకున్న వాళ్ళతో ఇదే సమస్య. జానకి మనసు మార్చి మళ్ళీ ఎలా చదివించాలి