మల్లిక మాటలు విని భయపడిపోయిన రామా వెంటనే లాయర్ కి ఫోన్ చేస్తాడు. ఉరిశిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు అలాంటిది ఏమి ఉండదు కదా అని రామా అడుగుతాడు. ఆ అవకాశం ఉంది ఒకవేళ ఆ అమ్మాయి హాస్పిటల్ లో చనిపోయి, కోర్టులో మీ ఆవిడ సాక్ష్యం చెబితే ఆ రెండింటిలో ఒక శిక్ష పడే అవకాశం ఉంది. మీ తమ్ముడి జీవితం మీ  ఆవిడ చేతిలోనే ఉందని లాయర్ చెప్పడంతో రామా మరింత భయపడిపోతాడు. జానకి దగ్గరకి గోవిందరాజులు వస్తాడు.


గోవిందరాజులు: జరిగిన దానికి బాధపడాలో అయోమయ పరిస్థితిలో నీతో మాట్లాడటానికి వచ్చాను. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకుంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి విషయంలో తర్వాత తాగొచ్చిన విషయంలో అఖిల్ తప్పు చేశాడు, తండ్రిగా నేను ఓడిపోయి ఉండవచ్చు. కానీ భర్తగా గెలవాలని అనుకుంటున్నా, నా భార్య కన్నీళ్ళు తుడవకపోతే నేను భర్తగా కూడా ఒడిపోయినట్టే ఇక నేను బతికి ఉండి ఏం ప్రయోజనం. గుండె కోత బయటకి చెప్పుకోలేక నరకం అనుభవిస్తుంది. నువ్వు నా కొడుకుని బయటకి తీసుకురా నువ్వు ఈ సాయం చేసి పెడితే నా భార్యని నేను సంతోషపెట్టిన వాడిని అవుతాను అర్థం చేసుకొమ్మా అని అడుగుతాడు.


ఇప్పుడు నా తమ్ముడిని బయటకి తీసుకురాలేకపోతే వాడి జీవితం జైలుకే అంకితం అయిపోతుందని రామా కుమిలిపోతాడు. వెంటనే జానకి గారిని అడుగుతాను అని ఆవేశంగా తన దగ్గరకి వస్తాడు. జానకి గోవిందరాజులు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉండగా రామా వస్తాడు.


Also Read: రంగంలోకి దిగిన వేద, ఇక మాళవికకి చుక్కలే- క్షమించమని అడిగిన యష్


రామా: నేను అడిగిన దానికి మీనిర్ణయం మార్చుకుంటారు అనుకున్నా కానీ మీరు అలా చెయ్యలేదు రేపు మధ్యాహ్నం లోగా కేసు వెనక్కి తీసుకోకపోతే అఖిల్ ని కోర్టుకి తీసుకెళ్తారు, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు వెనక్కి తీసుకుని తమ్ముడిని ఇంటికి తీసుకుని రావాలి సిద్ధంగా ఉండండి


జానకి: సోరి రామా గారు.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, నేను కేసు వెనక్కి తీసుకోలేను దయచేసి అర్థం చేసుకోండి


రామా: ఇంకేం అర్థం చేసుకోవాలి, ఇంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి, మీకు ఎంత అండగా ఉన్నానో మీ మనసుకి తెలుసు, ఐపీఎస్ ఆఫీసర్ అవడం మీ నాన్న గారి కల దాన్ని నిజం చేయడం కోసం మా అమ్మకి అబద్ధాలు చెప్పాను అది మిమ్మల్ని అర్థం చేసుకోవడం కదా, జెస్సి విషయంలో కూడా అలాగే చేశాను


జానకి: అప్పుడు ఉన్న నమ్మకం ఇప్పుడు లేదా


రామా: అప్పుడు జెస్సి జీవితాన్ని నిలబెట్టడానికి, కానీ ఇప్పుడు కూడా అదే చేస్తే నా తమ్ముడిని ఎక్కడ కోల్పోతానో అని భయంగా ఉంది, మీ కోసం అమ్మని మోసం చేశాను, అఖిల్ ని బయటకి తీసుకురాలేకపోతే జెస్సిని మోసం చేసిన వాడిని అవుతాను, రేపు పుట్టబోయే వాడు తండ్రి ఏడి అని అడిగితే నేనేం చెప్పగలను ఇంతమందిని నేను మోసం చేయలేను. అమ్మ మిమ్మల్ని ఒక కూతురిలాగా కడుపున పెట్టుకుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని నిలదీయ్యడం లేదు


జానకి: నా మరిది అరెస్ట్ అయ్యి ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే నాకు మాత్రం బాధగా ఉండదా


Also Read:  వసు ముందు తడబడిన గౌతమ్, దేవయానిని నిలదీసిన ఫణీంద్ర, రిషి ఏం చేయబోతున్నాడు!


రామా: అదే ఉంటే ముందు నాకు కానీ అమ్మకి కానీ విషయం చెప్పారా లేదు మీ పాటికి మీరు నిర్ణయం తీసుకుని కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. రామా అబద్ధం చెప్పాడు అనే నమ్మకం మీ వల్ల ఎప్పుడో కోల్పోయాను, ఇప్పుడు తమ్ముడిని కాపాడుకోలేకపోతే వాడి నమ్మకం కూడా కోల్పోతాను అందుకు నేను సిద్ధంగా లేను


జానకి తన వాదం వినిపిస్తుంది కానీ రామా మాత్రం అర్థం చేసుకోడు. ఎట్టి పరిస్థితిల్లోనూ అఖిల్ ని బయటకి తీసుకురావాలని రామా తెగేసి చెప్తాడు. ఇలా చేస్తే నా ఆశయానికి అర్థం లేదు కదా అని జానకి బతిమలాడుతుంది. కానీ మీ చదువు నా తమ్ముడిని దూరం చేస్తుందంటే దాన్ని ఒప్పుకొనని రామ కఠినంగా చెప్పేస్తాడు. ఇంతమందిని బాధపెట్టే మీ చదువు నేను ఒప్పుకోను, చదువా, కుటుంబమా తేల్చుకోని నిర్ణయం రేపు 10 గంటల్లోగా చెప్పాలని రామా చెప్పేస్తాడు. మిమ్మల్ని దూరం చేసే ఈ చదువు నాకొద్దు, నా ఐపీఎస్ ని వదిలేస్తున్నా అని జానకి అంటుంది. మీరు కోరుకున్నట్టే తమ్ముడిని బయటకి తీసుకొస్తాను అని రామా ఉన్నాడనుకుని జానకి మాట్లాడుతుంది. తన ఆశయాన్ని చంపుకుని అఖిల్ ని బయటకి తీసుకొస్తాను అని జానకి డిసైడ్ అవుతుంది.