యష్ తాగొచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. తన చేతులతోనే తన జీవితాన్ని నాశనం చేసుకున్నా అని అరుస్తాడు. అక్కడి సెక్యూరిటీ ఇంట్లోకి వెళ్దాం రమ్మని ఎంత చెప్పినా కూడా వినకుండా అక్కడే ఉండి యష్ అరుస్తూ ఉంటాడు.. ఆ అరుపులు విని వేద బయటకి వస్తుంది. లోపలికి రమ్మని బతిమలాడుతుంది కానీ యష్ మాత్రం రాను అని గోల గోల చేస్తాడు. ‘నేను నిన్ను మోసం చేశాను వేద, నీకు ఎంత ద్రోహం చేశానో అందరినీ విననివ్వు నువ్వు మా ఫ్యామిలీని కాపాడిన దేవతవి. కానీ నేను నీకు అన్యాయం చేశాను. నేను చెడ్డవాడిని నన్ను వదిలెయ్, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు నరకం అనుభవిస్తున్నా.. నేను తప్పు చేశా ఒప్పుకున్నా సోరి చెప్పాను, చేతులు జోడించు అడుగుతున్నా నన్ను క్షమించు’ అని యష్ వేద ని అడుగుతాడు.


మాళవిక అభిమన్యు మీద అరుస్తుంది. యాక్సిడెంట్ చేసింది నేనే అని ఆ వేదకి చెప్పి అక్కడికి తీసుకొస్తావా ఇంతగా దిగజారిపోతావా అని మాళవిక తిడుతుంది. దిగజారిపోయింది నేను కాదు నువ్వు అని అభి అంటాడు.


మాళవిక: నాకు ఇప్పుడు నీకన్నా యశోధర్ ఎక్కువ, ఆ వేద నుంచి నన్ను నేను కాపడుకోవాలంటే యశోధర్ అవసరం చాలా ఉంది, అందుకే నేను తనని వదిలిపెట్టను


అభి: ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను నిన్ను కాపాడతాను, ఆ యశోధర్ తో తిరగడం మానేయ్


మాళవిక: ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో యశోధర్ మాత్రమే కాపాడగలడు


అభి: నేను కూడా తీర్చలేనంత సమస్య ఏముంది వీళ్లిద్దరి మధ్య అని ఆలోచనలో పడతాడు.


Also Read: 'సామ్రాట్ నీ అదృష్టం అమ్మా' వదులుకోవద్దని చెప్పిన ప్రేమ్- నందులో పశ్చాత్తాపం?


నువ్వు విన్నది నిజం కాదు వేద అని యష్ చెప్తుంటే మరి నిజం ఏంటి అని నిలదిస్తుంది. నా మనసు చెప్తుంది ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది, మీరే అన్నారు కదా మన ఇద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఒప్పందం మాత్రమే అని అన్నారు కదా మరి ఇదంతా ఎవరి కోసం భరించాలి అని వేద తన బాధ వెళ్లగక్కుతుంది. ఖుషి కోసమే నేను ఇక్కడికి వచ్చాను మీరు చెప్పే అబద్ధాలు వింటున్నా చాలా ఫీల్ అవుతుంది. వేద యష్ ని గదిలోకి తీసుకెళ్తుంటే తనని తోసేస్తాడు. అది చూసిన మాలిని వదిలేయ్ వేద వాడికి ఎక్కింది మత్తు మందు కాదు ఆ మాళవిక వీడిని ఇక్కడే వదిలేయ్ అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. నిన్ను మోసం చేయడం లేదు వేద అని యష్ తాగిన మత్తులో అంటూనే ఉంటాడు.


వేద యష్ తో పెళ్లి జరిగిన నాటి నుంచి తనతో గడిపిన క్షణాలు అన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంది. యష్ ని గదిలోకి తీసుకొచ్చి పడుకోబెడుతుంది. ఖైలాష్ మాళవిక దగ్గరకి వచ్చి రాత్రి యశోధర్ ఇంటికి తాగొచ్చి రచ్చ రచ్చ చేశాడని చెప్తాడు. వేదతో జాగ్రత్తగా ఉండమని అంటాడు. యశోధర్ వేద మాట జవదాటడు, తనతో ముందు ముందు చాలా ప్రమాదం అవుతుందని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. యష్ వేద గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. ‘నీ కోపాన్ని తట్టుకోగలను ఏమో కానీ నీ మంచితనం తట్టుకోలేకపోతున్నా’ అని యష్ అనుకుంటాడు.  


Also Read: వెక్కి వెక్కి ఏడుస్తున్న వేద- తాగి రచ్చ చేసిన యష్, సంబరంలో ఖైలాష్


తరువాయి భాగంలో..


వేద తన అమ్మకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే దోషులు జైలుకి వెళ్ళాల్సిందే అని యష్ ముందే లాయర్ తో మాట్లాడుతుంది. అవతల ఉన్న వాళ్లకి సపోర్ట్ చేస్తుంది మీ భర్తే, తనకి వ్యతిరేకంగా పోరాడటానికి సిధ్దంగా ఉన్నారా అని లాయర్ వేదని అడుగుతుంది.