నందుతో ఛాలెంజ్ చేసి సామ్రాట్ కోపంగా బయటకి వస్తాడు. తప్పు చేశాను తులసి గారి గురించి అలా మాట్లాడి ఉండకూడదు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యడానికి వెళ్ళి మరికొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టాను. ఈ విషయం వెంటనే తులసిగారికి చెప్పి క్షమాపణ అడగాలని సామ్రాట్ అనుకుంటాడు. అటు సామ్రాట్ మాట్లాడిన మాటలు తులసి తలుచుకుంటూ ఉంటుంది. తన దగ్గరకి ప్రేమ్ వస్తాడు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది, నీ తరఫున ఆయన అలా మాట్లాడితే తప్పేంటమ్మా అని ప్రేమ్ అంటాడు. కానీ తులసి చిరాకుగా ప్రేమ్ ని వెళ్లిపొమ్మని చెప్తుంది. ప్రస్తుతం నాకు ఎవరితో మాట్లాడే మూడ్ లేదని తులసి ఏడుస్తుంది. అమ్మలో ఉన్న కోపం అంతా బయటికి రావాలి, అప్పుడే తను చెప్పేది అర్థం చేసుకోగలదని ప్రేమ్ మనసులో అనుకుంటాడు.


నందు సామ్రాట్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ‘ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాత కూడ ఎందుకు తను మా మంచి కోరుకుంటుంది, తన మనసులో ఏముంది, ఎందుకు తనలో అంత మంచితనం, పాతికేళ్లు కాపురం చేసిన నేను తులసి మనసు తెలుసుకోలేకపోయాను, కానీ కొద్ది రోజుల స్నేహంలో సామ్రాట్ తెలుకోగలిగాడు. తులసి చూపించిన ప్రేమకి నేను అర్హుడినా అని అడిగాడు, నేను ఇది ఎప్పుడు ఆలోచించలేదు, ఏమవుతుంది నాకు, సామ్రాట్ మాటలు ఎందుకు డిస్ట్రబ్ చేస్తున్నాయ్. వాటిలో నిజం ఉండబట్టేనా, నేను తప్పు చేశానా, తులసి మీద ఎందుకు కోపం తెచ్చుకుంటున్నా నా తప్పులు బయటపడతాయనా, ఎందుకో సడెన్ గా ఒంటరి వాడిని అయ్యాను అనిపిస్తుందని’ నందు ఫీల్ అవుతాడు.  


Also Read: వెక్కి వెక్కి ఏడుస్తున్న వేద- తాగి రచ్చ చేసిన యష్, సంబరంలో ఖైలాష్


అటు సామ్రాట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.


ప్రేమ్: నీ లైఫ్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతాను వింటావా అమ్మా, సామ్రాట్ గారు ఎప్పుడు గీత దాటలేదు, అందుకే నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావ్ అవునా


తులసి: ఎందుకో స్నేహాన్ని దాటి ఎక్కువ మాట్లాడేశాను అనిపిస్తుంది


ప్రేమ్: నిన్ను ఆరాధిస్తున్నా అని చెప్పారు, అందుకు కారణం కూడా చెప్పారు కదా


తులసి: ఈ మాటలు మొదటిసారి ఆయన నోటి నుంచి వింటున్నా


ప్రేమ్: అందులో తప్పేముందు, సందర్భం వచ్చింది కాబట్టి బయటపడ్డారు, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవమే ఇచ్చారు


తులసి: నా విషయంలో అంతగా ఇన్వాల్వ్ అవడం అవసరమా


ప్రేమ్: మేము నీ పిల్లలం నీ తరపున మాట్లాడలేకపోతున్నాం, నీ తరఫున ఆయన నిలబడ్డారు, ఏదో ఉక్రోషంగా అరిచారె కానీ వాళ్ళ మాటల్లో అర్థం లేదు. నీ స్నేహితుడి గురించి ఇలా ఆలోచించకూడదు. నిజాయితీలో సామ్రాట్ నీకంటే తక్కువ కాదు. సామ్రాట్ నీకు అన్ని విషయాల్లో మంచే చేశారు, అలాంటి ఆయన గురించి ఎందుకు నెగటివ్ గా ఆలోచిస్తున్నావ్, తొందరపడి స్నేహాన్ని వదులుకోవద్దు, సామ్రాట్ స్నేహం నీ అదృష్టం, వదులుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆయన స్నేహాన్ని అనుమానించకు, ఆరాధించడం అనే మాట ఎప్పటికీ తప్పు కాదు, ఆరాధన అనే ఒక భావం, ఆ అనుభూతిని గౌరవించాలి, నాకు ఎటువంటి తప్పు కనిపించడం లేదు, నీ అభిప్రాయం ఏదైనా ముఖాముఖీగా చెప్పు తప్పించుకుని తిరగొద్దు


Also Read: చిక్కుల్లో పడ్డ దేవయాని- తండ్రికి దగ్గరగా రిషి, వాళ్ళని చూస్తాడా?


తన బాధని సామ్రాట్ బాబాయ్ కి చెప్పుకుని బాధపడతాడు. తులసి తనకి దూరం అయిపోతుందని ఫీల్ అవుతాడు. నందు దగ్గరకి లాస్య వస్తుంది. సామ్రాట్ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా అనవసరం అని లాస్య ఎక్కిస్తుంది. ఈ టాపిక్ గురించి మాట్లాడొద్దని నందు అంటాడు కానీ లాస్య మాత్రం తులసి గురించి మరింత ఎక్కించేందుకు చూస్తుంది. లాస్య మాటలకి ఇరిటేట్ అవుతాడు.